చాలామంది నిన్న ఐతజాజ్ గురించి వార్త చదివే వుంటారు. చదవనివారి కోసం...ఐతజాజ్ పాకిస్తాన్లోని ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని హంగు జిల్లాకు చెందిన 14 యేళ్ళ అబ్బాయి. కిందటి సోమవారం ఆ అబ్బాయి స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం లో ఉన్న సూయిసైడ్ బాంబర్ ఆ అబ్బాయిని స్కూల్ అడ్రస్స్ అడగడంతో అనుమానపడి, ఆ బాంబర్ ని రాళ్ళతో కొట్టి తరమడానికి ప్రయత్నించి, అది వీలుకాక, పెనుగులాడి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ వార్త చదివిన దగ్గర్నుండి ఒకటే ఆలోచన. ఐతజాజ్ తనేం చేస్తున్నాడో తెలిసే చేసివుంటాడా? తెలిసి, తెలిసి ఒక టీనేజ్ లో ఉన్న అబ్బాయి, తన ప్రాణాలను అంత బేఖాతరుగా పణం పెట్టగలడా? అనుమానంతో తనతో పాటు ఉన్న స్నేహితులు దూరం జరుగుతోంటే, ఆ నిముషంలో తనేమనుకొని ఉంటాడు? తల్చుకుంటుంటే కడుపులో బాధగా ఉంది. ఒకవేళ ఐతజాజ్ కి కనుక అనుమానం రాకపోయినా, ఆ బాంబర్ ని ఆపలేకపోయినా, ఆ స్కూల్ లోని 1000 మంది పిల్లల పరిస్థితి తల్చుకుంటేనే భయంగా ఉంది.
కానీ...ఐతజాజ్ వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున స్కూల్ కి వెళ్తుంటే ఏమని చెప్పి ఉంటారు? మనకులాగే...జాగ్రత్తగా వెళ్ళు, స్కూల్లో చెప్పింది శ్రద్ధగా విను అనేకదా. పొద్దున అలిగో, పోట్లాడో, నవ్వుతూనో, ఏదో కావాలి అని గొడవ చేసో వెళ్ళిన పిల్లాడు, ఇక ఎన్నటికి తిరిగిరాడని తెలిసిన క్షణాన వాళ్ళు కన్నీటి సంద్రాలైపోయి ఉంటారు కదా.
అకాల మరణం ఎవరిదైనా బాధాకరమే. కానీ ఇలా తమ తప్పేమి లేకుండా, కొంతమంది మానవత్వం లేని మనుషుల చర్యలవల్ల ప్రాణాలు పోగట్టుకున్న పిల్లల గురించి విన్నప్పుడు, మనుషుల మధ్యే ఉన్నామా అని అనుమానం వస్తుంది.
CNN లో ఈ వార్త: http://www.cnn.com/2014/01/11/world/asia/pakistan-boy-bravery-award/

No comments:
Post a Comment