Monday, January 27, 2014

గాన గంధర్వులైననేమి...

... పాటను అగౌరవపరచడానికి?

నిన్నటి స్వరాభిషేకం (ఈ టివి ప్రోగ్రాం) చూసారా? మొదటగా అక్కినేని గారి జ్ఞాపకార్థం కె. జె. ఏసుదాస్ గారు పాడిన "ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన" పాట వినే ఉంటారు. మీకేమనిపించింది ? ఏసుదాస్ గారు చాలా గొప్ప గాయకులు. ఎంతో గొప్ప గాత్రం. నా బ్లాగ్ లోకి అడుగిడగానే మీకు ఈ వారం వినిపించే పాట వారిదే. 
 
కానీ ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా బాధ వేసింది. నాకు వినికిడి జ్ఞానమే తప్ప, సంగీతంలో ఎటువంటి ప్రవేశం లేదు. ఆ పాట వింటున్నప్పుడు నాకనిపించినవి... 

  •     చరణాల దగ్గర మ్యూజిక్ కి సంబంధం లేకుండా, ముందుగానో, వెనగ్గానో పాడేసారు. 
  •     పదాలు ఇష్టమొచ్చినట్టు పలికారు. విరహమో, దాహమో కాకుండా "విరగమో, దాగమో " అని వినిపించాయి
  •     "కడిమివోలె నిలిచానని" అయితే అసలేమన్నారో కూడా అర్థం కాలేదు. 

ఆయన తెలుగు వారు కాదు, కానీ పక్కన బాలు గారు, ఇతర తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ పదాన్ని ఎలా పలకాలో అడిగితే చెప్తారు కదా. పాటంటే గాత్రం మాత్రమే కాదు కదా.  సాహిత్యం, సంగీతం , గాత్రం మూడూ కలిసి ఆ ప్రత్యేక సన్నివేశాన్ని రక్తి కట్టించినప్పుడే పాటకి సార్ధకత. అంత పెద్దవారు ఆర్కెస్ట్రా తో కలిసి ప్రాక్టీస్ చేయకుండా(చేసి ఉండరనే అనుకుంటున్నా, ఆ పెర్ఫార్మన్స్ ప్రకారం) అలా స్టేజీ మీద పాడేయడం... అక్కినేని గారికి  నివాళి ఏమో కానీ, రమేష్ నాయిడు గారు, వేటూరి గారు might be turning in their graves :(
                                          (ఈమాటకి తెలుగులో సమానార్థకం తట్టలేదు)

  

No comments:

Post a Comment