Friday, October 22, 2010

నాకు నచ్చిన ఆర్గనైజేషన్స్

St.Jude Children's Research Hospital
ఒకసారి టివిలో ఈ హాస్పిటల్ గురించి ప్రోగ్రాం చూసాను. చాలా గొప్పగా అనిపించింది. వైద్యం అన్నిటికన్నా ఖరీదైన వ్యాపారమైన ఈ రోజుల్లో " St. Jude is the only pediatric cancer research center where families never pay for treatment not covered by insurance. No child is ever denied treatment because of the family’s inability to pay." అన్న మిషన్ స్టేట్మెంట్ పెట్టుకొన్న ఈ పిల్లల కాన్సర్ హాస్పిటల్ చాలా చాలా నచ్చింది.పక్కనున్న లింక్ పైన క్లిక్ చేస్తే ఈ హాస్పిటల్ గురించి చదవచ్చు.
  • మీకు వీలయితే నెల నెలా $23 ఈ హాస్పిటల్ కి డొనేట్ చెయ్యండి.

కనుక్కోగలరా-2

ఈ పాటకి పల్లవి కనుక్కోగలరా:
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు... గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా ...వెల్లువైనది లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది ... నీ కొరకే లోకముంది

Wednesday, October 20, 2010

నాకు నచ్చిన సినిమా-బెంగాలీ

ఈసారి నేషనల్ అవార్డ్స్ విజేతల పేర్లలో ఉత్తమనటి (అనన్యా చటర్జీ) , ఉత్తమ దర్శకుడు (రితు పర్ణో ఘోష్) "Abohoman"  చూసి ఆ సినిమా గురించి తెలుసుకుందామని గూగుల్ చేసాను. youtube లో లింక్స్ చూసి ఒక వీకెండ్  సాయంత్రం కూర్చొని చూసాను.


సినిమా బాగా నచ్చింది కానీ అనన్య చటర్జీ నటన అంత గొప్పగా అనిపించలేదు. అలకేందు మజుందార్ గా దీపాంకర్ డే , అప్రతిమ్ గా  జిషుసేన్ గుప్తా చాలా బాగా చేసారు. మీరీ సినిమా ఇక్కడ చూడచ్చు.

Tuesday, October 19, 2010

కనుక్కోగలరా-1

ఈ పాటకి పల్లవి కనుక్కోగలరా:
వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట
కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
 ప్రతి కదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా 

స్వాగతం

నా బ్లాగు చూస్తున్న మీకు ఇదే నా స్వాగతం.