Friday, July 11, 2014

మన "బాలు" కీర్తికిరీటంలో మరొక కలికితురాయి...

మన "బాలు" కీర్తికిరీటంలో మరొక కలికితురాయి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



 



http://www.bbc.co.uk/programmes/p022htmt

Friday, July 4, 2014

Down the memory lane


 A stroll down the memory lane (1990s Songs)

1970-80 మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఆదర్శాలు, ఆత్మీయతలు,మధ్యతరగతి కష్టాలు, కన్నీళ్ళు, ప్రధాన వస్తువులుగా తీసుకునేవి. కానీ 90వ దశకంలో మాత్రం  ప్రేమే ముఖ్య పాత్రగా అనేక సినిమాలు వచ్చాయి. 

ఆ టైం ని ఒక రొమాంటిక్ కాలంగా చెప్పచ్చు.  

     అలాంటి సినిమాలకు సంగీతం ఒక పెద్ద అసెట్. హీరో, హీరోయిన్లు పెద్ద అందంగా లేకున్నా, యాక్టింగ్ రాకున్నా, పాటల వల్లే హిట్టయిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. టీనేజీలో ఉన్న పిల్లలని ప్రధాన పాత్రధారులుగా చూపించడం (కొన్ని పాత సినిమాలు మినహాయిస్తే) బహుశా అప్పుడే ఒక పెద్ద ట్రెండ్ అయిందనుకుంటా. 

    అప్పటి కొన్ని పాటలు వింటే కళ్ళ నిండా కలలు, మనసులో  ప్రేమ,  బ్రతుకు మీద ఆశ, ఉన్న మనవో, మనకు తెలిసిన వాళ్లవో, ముఖాలు మీ కళ్ళ ముందు కదలాడుతాయి. మరి అలాంటి కొన్ని పాటలు చూద్దామా?


   








ఇంకా చాలా పాటలున్నాయి. అవి మళ్ళీ మరోసారి... 



మరి వీకెండ్ కోసం ఒక కొత్త పాట... 

     
         Put on your dancing shoes guys n gals

 
    

Saturday, June 28, 2014

మీరేమంటారు ??

మీరేమంటారు ?

అమెరికాలో వెస్ట్ కోస్ట్ లో ఉన్నవారైనా, లేదా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాళ్ళని చూడడానికి వచ్చినా, చూసి తీరే ఒక ప్రదేశం శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్



 File:GoldenGateBridge.jpg


Image from:http://en.wikipedia.org/wiki/File:GoldenGateBridge.jpg



    కొన్నిసార్లు పొగమంచు మేలిముసుగులో ఉండి, అంతదూరం నుండి వచ్చిన వాళ్ళకి ఒక చూపైనా దక్కనీయక పంపితే... 

     మరి కొన్నిసార్లు మబ్బుల్లో తేలుతున్నట్లు కనిపించి, కిందున్న నీలి సముద్రంలోనుండి, పైనున్న నీలాకాశానికి వేసిన వంతెనలా, ఉందో లేదో తెలీని మరో లోకానికి మనల్ని తీసుకెళ్ళే దారి ఇదేనేమో అనిపిస్తుంది. 



Photograph:Fog enshrouds the Golden Gate Bridge, which spans the entrance to San Francisco Bay in California.



      బహుశా ఈ రెండో కారణం వల్లేనేమో, యేటా ఆ బ్రిడ్జ్ పైనుండి దూకి ఎందరో ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ ఆత్మహత్యలను ఆపడానికి, తమవాళ్ళని కోల్పోయిన కొంతమంది ఆ బ్రిడ్జ్ కి ఒక నెట్ ఏర్పాటు చెయ్యాలని 20-30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ప్రొద్దున న్యూస్ లో $76 మిలియన్లు ఖర్చయ్యే ఆ ప్రతిపాదనని బోర్డ్ అంగీకరించిందని చదివాను. 

http://www.sfgate.com/bayarea/article/Golden-Gate-Bridge-going-to-get-suicide-nets-5585482.php

  అది చదివిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. తమవాళ్ళని ఆత్మహత్యతో కోల్పోయిన వారి మానసిక స్థితిని అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఆ పరిస్థితి వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరి వాళ్ళకు వచ్చింది కాబట్టి. మనమేమైనా చేసి ఉండగలిగేవాళ్ళమా? లేదా వాళ్ళ మానసిక స్థితిని అంచనా వెయ్యలేక పొరపాటు చేసామా అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ వదలదు. 

      కానీ ఈ నెట్ ఏర్పాటు చెయ్యడం ఆత్మహత్యలని నిరోధించడానికి ఎలాంటి పరిష్కారమో నాకర్థం కాలేదు. 

    ఈ ప్రతిపాదనని సమర్థించే వారు,అమెరికాలోని ఏ ఇతర బ్రిడ్జ్ ల కంటే గోల్డెన్ గేట్ బ్రిడ్డ్జ్ పై ఆత్మహత్య ఎక్కువమంది చేసుకుంటారు అని స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వీలవ్వకపోతే, మరణించాలనుకునే వారు మరో దారి వెతుక్కోరనే నమ్మకమేముంది? ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నంనుండి వెనక్కి తిరిగినవారు,మళ్ళీ ఆ ప్రయత్నం చెయ్యరు అని చెప్తున్నారు. కానీ ఆ స్టాటిస్టిక్స్ ఎలా తయారు చేస్తారో నాకర్థం కాలేదు. ఎంతమంది ప్రయత్నించి వెనుతిరిగారో ఎలా తెలుస్తుంది,వాళ్ళే చెపితే తప్ప. 

   ఇలాంటి ఎన్నో వ్యతిరేకతలని పరిశీలించిన తర్వాతే ఆ ప్రతిపాదనని అంగీకరించి ఉంటారని తెలుసు. కానీ నాకు మాత్రం ఇది సబబైన నిర్ణయంలా అనిపించలేదు. 

మరి ఇది చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది ??? 



Sunday, June 15, 2014

క్షణ, క్షణం...భయం,భయం

క్షణ, క్షణం...భయం,భయం 

స్కూల్ కో, కాలేజీకో అని వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగొస్తారో, లేదో అని భయం... 

రావడం అరగంట ఆలస్యమైతే ఇక చూడగలమో లేదో అన్న భయం... 

ఫ్రెండ్స్ తో పార్టీకో,సినిమాకో వెళ్ళిన పిల్లలు ఆ ఫ్రెండ్స్ చేతిలోనే యే ఘోరానికైనా గురవుతారేమోనని భయం... 

టూర్లకో,పిక్నిక్కులకో వెళ్ళిన పిల్లలు ఎక్కడ, ఏ ప్రమాదాల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో అని భయం... 
  
ప్రొద్దున పేపర్ తెరిస్తే చదివే,టీవీ లో 24 గంటలు వినే, ఘోరమైన వార్తల్లాంటి సంఘటనలు మన పిల్లలకెక్కడ జరుగుతాయో అని భయం...  

అమ్మానాన్నలు, అన్నం, నీళ్ళతో కాదు,అనుక్షణం ఈ భయాలతో, అనుమానాలతో,చస్తూ బతుకుతున్నారు. ఒకట్రెండు తరాల క్రితం వరకూ లేని ఈ పరిస్థితులు, ఇప్పుడు సర్వసాధారణమైపోడానికి కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు, కర్ణుడి చావుకు కారణాలు లక్ష లాగా. 

ఇలాంటి ఒక సంఘటనని చాలా సింపుల్ గా,సూటిగా చెప్పిన కథ పి.సత్యవతి గారి "పిల్లాడొస్తాడా" కథ. రచయిత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపున్న సత్యవతిగారు నాకిష్టమైన రచయిత్రుల్లో ఒకరు. ఈ కథ కూడా ఆవిడకలవాటైన, అందరూ అది మామూలే అన్న విషయాన్ని కొత్త కోణంలో చూపుతూ, బాగా చదివించే శైలిలో రాసిన మంచి కథ. 

ఈ కథ ముగింపు కథకి హైలైట్. కథ మొత్తంలో జరిగేలాగే, ముగింపులోనూ కథలోని రెండు ముఖ్యపాత్రల్లో ఒక పాత్ర ఆశావహ దృక్పథం తోనూ,మరొక పాత్ర నెగటివ్ ఆలోచనతోనూ అనే మాటలతో ముగించడం చాలా సరియైన ముగింపులా అనిపించింది. 

ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్ లోని ఈ కథ తప్పక చదవండి. 

మనందరికీ అతి సాధారణమైపోయిన విషయం, ఒక మంచి రచయిత/త్రి చేతిలో పడితే, అది మరొకసారి కొత్తగా మనసుని తాకే కథ ఎలా అవుతుందో చూడండి.

ఈ కథ చదివి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుంటారు కదూ...


Thursday, June 12, 2014

ఈమె ఎవరు ??

ఈమె ఎవరో గుర్తు పట్టగలరా ?


...ఎందుకంటే నేను ఈ ఒకనాటి నటిని గుర్తుపట్టలేకపోయా, కాబట్టి.