Sunday, November 7, 2010

మీకు ఈ పదాలకు అర్థాలు తెలుసా ?

"సీమ కథలు "   కథా సంకలనం - మూడవ ముద్రణ
సంకలన కర్త- శ్రీ సింగమనేని నారాయణ
మీరీ  పదాలు ఎప్పుడైనా విన్నారా ?వీటికి అర్థాలు తెలుసా ?
సుల్ల
జవితి
గాటిపాపలు
రాయలసీమలో పుట్టి చాలా సంవత్సరాలు అక్కడే పెరిగిన నాకు ఈ పదాలు తెలీలేదు. ఇవే కాదు సీమ లోని జీవితాల నిత్య పోరాటాలు కూడా పూర్తిగా తెలియదని ఇప్పుడే అర్థమైంది.
ప్రతి నిత్యం అక్కడ తప్పని నీళ్ళ యుద్ధాలు చాలాసార్లే  చూసాను. కొన్నిసార్లు వాటిలో ప్రత్యక్షంగానో , పరోక్షంగానో పాల్గొన్నాను . 
పల్లెల్లో ఈ సమస్య తీవ్రత గురించి తెలుసు, అయినా  ఇన్ని కథలు , దాదాపు ప్రతి ఒక్క కథ లోను ప్రధాన సమస్య నీళ్ళే, చదువుతుంటే,  మర్చిపోయిన చిన్నప్పటి చీకటి గదిలోని పిశాచి భయం మళ్ళీ గుర్తు వచ్చిన లాంటి భావం.
మీరెప్పుడైనా బిందెడు నీళ్ళ కోసం వీధులు వీధులు తిరిగారా? అర్ధరాత్రి , అపరాత్రి అని లేకుండా ఇంట్లో ఉన్న అందరూ కొళాయిల దగ్గర మేలుకొని కూర్చున్నారా ? 6-7 యేండ్ల వయసునుండే  సైకిల్ కు  4 బిందెలు కట్టుకొని , తొక్కలేక తోసుకొని వచ్చే తమ్మున్ని చూసారా ? నీళ్ళు పట్టే తొందరలో కత్తిపీట కాలి మీదపడి నరం తెగిపోయినా నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో అని పరుగులు పెట్టిన అమ్మను చూసారా ?  
ఇవన్నీనా అనుభవాలే.    కాబట్టి ఈ పుస్తకం మరీ నచ్చింది. 
" ఎవరు ఎన్ని నీళ్ళు వాడుతారో తెలిస్తే వాళ్ళ నాగరికత ఏ పాటిదో  చెప్పెయ్యొచ్చు  అనేది ఒక సూక్తి ! తాగేదానికి ఒక కడవ నీళ్ళు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది ? "
- " నీళ్ళు" కథ -- రచయిత " స్వామి"

2 comments:

  1. Sulla ante apaddam...

    migtha rentiki naaku kuda meanings teliyavu....

    I too have some exp. with water...
    i am from Anantapur Dist.

    ReplyDelete
  2. అవునండి. సుల్ల అంటే అబద్ధం.మిగతా 2 పదాలు కడప వైపు వాడుతారనుకుంటాను.నేను ఈ పదాలేవీ వినలేదు.

    ReplyDelete