Saturday, March 15, 2014

ఈ కథ చదివారా ?

ఈ కథ చదివారా ?

ఈ వారం చదివిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ... 
రమాసుందరి గారి "నమూనా బొమ్మ" కథ. 

మనలో చాలామందిలో ఉండే ఒక మామూలు లక్షణం, బలహీనులు, ఓడిపోయినవాళ్ళు, భరించలేని దుః ఖాలని మోస్తున్న వాళ్ళ పైన , పైసా ఖర్చులేని సానుభూతి ఒలకబొయ్యడం. ఆ సానుభూతి అందుకునే వ్యక్తి, ఏదైనా ప్రయత్నంతో తన బాధనుండి బయటపడాలనో, ఒక కొత్త జీవితాన్ని పునర్మించుకోవాలనో చూస్తే, ఈ సానుభూతి ఒలకబోసినవాళ్లు, కాసింత చేయూతనివ్వరు సరికదా వినేవాళ్ళుంటే   విమర్శించగలరు కూడా. మనసులోని ఈ చీకటి కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ ఇది. 

బాధలో ఉన్నవాళ్ళ పైన మనకు ఉండేది సానుభూతి మాత్రమే, ప్రేమ కాదు. సానుభూతి, దయ, బాధ్యత లేని ఫీలింగ్స్ , కాని ప్రేమ అలా కాదు. కొద్దికాలానికి ఈ సానుభూతి అందుకోడం కూడా ఒక వ్యసనంలా మారిపోయి,ఆ వ్యక్తి తనున్న పరిస్థుతులను ఏమైనా మార్చుకోవచ్చా అని ఆలోచించడం కూడా మానేస్తారు. ఉదాహరణకి మా బంధువుల్లో ఒకామెకి ప్రతి వారం ఏదో ఒక పేద్ద జబ్బు వస్తూనే ఉంటుంది. ఎంత మంది డాక్టర్లు ఎన్ని రకాల టెస్ట్లు చేసి "నీకేం లేదమ్మా" అని చెప్పినా ఆవిడ వినదు. ఆమెకి ఆ వంక పెట్టుకుని బంధువులందరికీ ఫోన్లు చెయ్యడం, వాళ్ళు ఆవిడని "అయ్యో పాపం, ఇంత మంచిదానివి..నీకే ఇన్ని కష్టాలా" అని జాలి పడ్డం, ఊర్లో ఉన్నవాళ్ళు ఆవిడని ఇంటికి వచ్చి పరామర్శించడం, చాలా ఇష్టమైన విషయాలు. 

ఈ కథలో భరించలేని దుఃఖం కలిగిన మల్లీశ్వరికి, ప్రధాన పాత్ర లీల తన సానుభూతిని, ఓదార్పుని, అందించగలిగే "ఉన్నత"స్థితిలో ఉన్నంతవరకు మంచిగానే ఆలోచించగలిగింది. కానీ ఎప్పుడైతే మల్లీశ్వరి తన చెదిరిపోయిన జీవితాన్ని,కాస్త, కాస్తగా సవరించుకోవాలనుకుందో, అది లీలకి భరించలేని విషయంగా మారింది. రమాసుందరి గారు చాలా స్పష్టంగా, సూటిగా, ఆసక్తికరమైన శైలిలో రాసిన ఈ కథ ఈ వారం నేను చదివిన కథల్లో బెస్ట్ కథ. 

మరి చదివి మీకేమనిపించిందో షేర్ చేసుకోండి.  


Thursday, March 13, 2014

ఇంకొకటి ...

ఈ పాట వింటుంటే ఈ మధ్య కాలంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఏ తెలుగు పాట గుర్తు వస్తోంది ???



ఈ పాట తెలుగు వర్షన్ " నీ కన్నులలోన... మురిసే మదిలోన, కురిసే విరివాన" కూడా బాగుంటుంది. 

Wednesday, March 12, 2014

ఈ హిందీ పాట ట్యూన్ లోనే వచ్చిన ఇంకో హిందీ పాట తెలుసా

మరి ఈ హిందీ పాట ట్యూన్ లోనే వచ్చిన ఇంకో హిందీ పాట తెలుసా ??

ఓ. పీ. నయ్యర్ గారి మ్యూజిక్ లో వచ్చిన చాలా పాటలు ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. మరి ఈ పాట యే ఇంకో ఫేమస్ పాటని గుర్తు చేస్తోందో చెప్పగలరా?



Tuesday, March 11, 2014

ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ?

ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ?

నిన్నటి పాట మరీ వీజీగా ఉన్నట్టుంది. మరి ఈ పాట హిందీలో ఏ పాటో తెలుసా ? హిందీలో కూడా బాగా పాత పాటే. ఎవరిని చూసి ఎవరు "ఇన్స్పైర్" అయ్యారో గూగులింగ్ చేసే ఓపిక లేదు. ఏదైతేనేమి మనకు ఒక మంచి పాట రెండు భాషల్లో వినే అవకాశం కలిగింది. 

 

http://www.youtube.com/watch?v=zrHrfn7GQm8 

 

 

Monday, March 10, 2014

ఇదే ట్యూన్ లో వచ్చిన మరో పాట తెలుసా ??

ఇదే ట్యూన్ లో వేరే భాషలో వచ్చిన మరో పాట తెలుసా ?




"చినుకులా రాలి" అని చెప్దామనుకున్నారా... అబ్బా, ఆశ. 

వేరే భాషలో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ "ఇన్స్పైర్ " అయ్యి (మన భాషలో కాపీ కొట్టిన) చేసిన  పాట చెప్పాలి. 

Saturday, March 8, 2014

మౌనరాగం

ఎప్పుడో చూసిన సినిమా. అప్పట్లో మురళి (కార్తీక్) భలే నచ్చాడు. కానీ అమ్మ, అత్తా వీళ్ళందరూ మోహన్ కారెక్టరైజేషన్ కి, తను ఎంతో బాగా పలికించిన సున్నితమైన భావాలకు వీర ఫాన్స్. "మీకు కొంచెం అర్థమయ్యే వయసు వస్తే తెలుస్తుంది, మోహన్ కారక్టర్ లో ఉన్న గొప్పతనమేంటో" అనేవాళ్ళు. నిజమే , ఈరోజు ఏదో ఛానెల్ లో ఆ సినిమా వస్తుంటే అప్పట్లో నోటీస్ చెయ్యని, మోహన్ కారెక్టర్ చూపించే అందమైన ప్రేమ అర్థమవుతోంది. కానీ ఇప్పుడు కూడా మురళీ కారెక్టరే ఎక్కువ నచ్చుతోందెందుకో? ఉప్పెనలా ముంచెత్తే అంత ప్రేమ... సినిమానే అని తెలుసు, అయినా నచ్చని అమ్మాయిలు ఉంటారా :)

Forever the best movie of Mani Ratnam (for me)



Friday, March 7, 2014

ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట

ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట

ఎందుకో కదూ, కొన్నిసార్లు ఏదో పాట మనసుని సడన్ గా కలవరపెట్టేస్తుంది. మన మానాన మనం రోజువారీ రొడ్డకొట్టుడులో బిజీ, బిజీగా ఉంటామా ? ఓ పాటేదో గాలి అలల పైన తేలివచ్చి మనసులో తిష్ట వేసుకుంటుంది. ఇక అప్పట్నుండీ ఆ రోజంతా మనసులో, మెదల్లో, సుళ్ళు తిరుగుతూ ఆ పాటే. అయినా పువ్వులు, పాటలు , పిల్లలు, నవ్వులు లేకపోయాక ఈ ప్రపంచముండీ ఏం లాభం?  అలాంటి ప్రపంచంలో బ్రతికుండీ ఏం భాగ్యం ? కాదంటారా ... 

ఇంతకీ ఈ రోజు నేను పలవరిస్తోన్న పాట " కభీ తన్హాయియోం మే యూ హమారీ యాద్ ఆయేగీ". 

ముబారక్ బేగం గొంతు లో ఈ పాట, మీ మనసులో మరుగున పడ్డ జ్ఞాపకాలేవో తట్టి లేపకపోతే, మీ మనసెక్కడుందో వెతుక్కోండి


Thursday, March 6, 2014

ఇప్పుడు చదువుతున్న పుస్తకం...

"అమృతవర్షాలు కురిసే రాత్రుల కోసం మనం నిరీక్షించకపోవచ్చు. మిన్ను విరిగి మీదపడే వేళల కోసం మెలకువగా ఉండకపోవచ్చు. కానీ ఆదమరచిన సమయాన పలకరించే ఆశ్చర్యాలకు, అదాటున మీదపడి అలజడి రేపే ఆనందాలకు, అనుకోకుండా వచ్చే అపురూపమైన అతిథులకు,మన జీవితాలను, హృదయాలను అన్నివేళలా ఒక సంసిద్ధతలో వుంచుకోవాలి. దెబ్బ కాచుకోడానికి వొళ్ళు రాటుదేల్చి పెట్టాలి. అయాచిత అద్భుతాల కోసం దోసిలి పట్టడం నేర్చుకోవాలి."

నాకిష్టమైన... అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, తనదంటూ పాఠకులు చటుక్కున గుర్తుపట్టే శైలిని ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారి "శీతవేళ రానీయకు" పుస్తకంలోని కొన్ని పంక్తులివి. 






                                                            Image from avkf.org

పుస్తకం avkf.org వెబ్ సైట్లో లభ్యం

పుస్తకం పేరు వినగానే మీకు దేవులపల్లి గారి ఆ పాట గుర్తు వచ్చిందని తెలుసు. మరెందుకాలస్యం...వినేస్తే ఓ పనైపోతుంది కదా.