Saturday, January 18, 2014

ఈయనని మనిషే అందామా, లేక మహర్షి అందామా ?

మన కడుపు నిండినా, పక్కవాళ్ళ ఆకలి పట్టించుకోని వాళ్ళం,
ఏడాదికో, రెండేళ్ళకో పిల్లికి బిచ్చం పెట్టి దానకర్ణులని లోకమంతా పొగడాలనుకునే వాళ్ళం,
కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా, ప్రపంచం అంతా ఆగి సానుభూతి చూపాలనుకునేవాళ్ళం,

మనమంతా మనుషులమే అయితే, మరి... 

కడుపున పుట్టిన చిరునవ్వుల చిట్టి పాపలు, కలిసి మెలిసి జీవితాంతం నడవాల్సిన తోడు,
ఏ ఉన్మాదో చేసిన ఉగ్రవాద చర్యకు అసహాయంగా బలైపోతే 
జన్మంతా తగలబడిపోయే కన్నీళ్ళ కార్చిచ్చుని 
ఎన్నో ఇళ్ళ ముంగిళ్ళకి కాంతి కిరణాలుగా, 
మరెంతో మంది చిట్టి శారదల కలల ప్రమిదలుగా 
వెలిగించిన మహానుభావుడు... 

ఈయనని మనిషే అందామా, లేక మహర్షి అందామా ??

డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి 
( Video - CNN-IBN Real Heroes Awards 2010)
డా. చంద్రశేఖర్ గారి గురించి నేను తెలుసుకున్నది దంతులూరి కిషోర్ వర్మ గారి ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారానే 

"సేవే మార్గం - సంకురాత్రి చంద్రశేఖర

మీకు వీలైతే ఈ మహా మనిషి చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందించాలనుకుంటే , ఈ వెబ్ సైట్ చూడండి

www.sankurathri.org

6 comments:

  1. చంద్రశేఖర్‌గారి గురించి పోస్ట్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ చాలా బాగుంది జ్యోతిగారు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ఫర్ ది కామెంట్ కిషోర్ వర్మ గారు :)
      నేను బ్లాగ్ మొదలుపెట్టి చాలా కాలమే అయినా పెద్ద రాసేదాన్ని కాదు. కానీ ఈ మధ్య మీ బ్లాగ్, ఇంకా కొన్ని ఇతర బ్లాగ్స్ చూసిన తర్వాత రోజువారీ విషయాలని కూడా ఇంత అందంగా, ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చా అని... నేను కూడా ప్రయత్నిస్తున్నా.

      Delete
    2. నా బ్లాగ్‌కి ఒక మెచ్చుతునక లాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు. ధన్యవాదాలు. మీకు ఆల్ ద వెరీ బెస్ట్ జ్యోతిగారు.

      Delete
  2. Great! లింక్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete