Friday, January 31, 2014

ఎపుడూ నీకు నే తెలుపనిదీ ...

ఎపుడూ నీకు నే తెలుపనిదీ...ఇక పై ఎవరికీ తెలియనిదీ


ఇ.వీ.వీ గారి అబ్బాయి, అల్లరి నరేష్ అన్నగానే మిగిలిపోయిన రాజేష్ (పేరులో ఆర్యన్ మధ్యలో చేర్చుకున్నాడు లెండి), తమిళ్ ఇండస్ట్రీ లో ఒకానొకప్పటి టాప్ హీరోయిన్ నమితలు జంటగా నటించిన "సొంతం" సినిమాలోని ఈ పాట విన్నారా?

         దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హీరోల సినిమాలు మాత్రమే చేసే పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అవకముందు చేసిన ఈ సినిమాలో "ఎపుడూ నీకు నే తెలుపనిదీ", "తెలుసునా తెలుసునా మనసుకీ కదలిక (చిత్ర గారు పాడారు)" పాటలు రెండు చాలా బాగుంటాయి. ఇదివరకు విని ఉండకపోతే తప్పక వినండి. 

మనసిచ్చిన స్నేహితుడికి ఆ మాట చెప్పలేక, మనసు లేని మనువు చేసుకోలేక, ఒక అమ్మాయి పడే ఆవేదనకి అక్షర రూపం ఈ పాట. 

        మేల్, ఫీమేల్ రెండు వర్షన్స్ లో, సుమంగళి పాడిన ఈ పాట నాకిష్టం. ఆ అమ్మాయి "ఖడ్గం" లో పాడిన "నువ్వు , నువ్వు" పాట మరచిపోగలమా ఎప్పటికైనా ?

        ఏంటీ, సాహిత్యం ఎవరిదీ అంటున్నారా? ఇంత మంచి భాషలో ఇంకెవరు రాయగలరు? పక్కన వున్న "ఈ వారం పాట" ఆడియో ప్లేయర్ లో ఈ పాట విని రచయిత పేరు చెప్పండి.


ఎపుడూ నీకు నే  తెలుపనిది... ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది... బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది... హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది

గుండెలో ఆశనే, తెలుపనే లేదు నా మౌనం
చూపులో భాషనే, చదవనే లేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా... కలుసుకోలేను  ఎదరున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా ...  అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం
కల కరిగించేటి కన్నీటి  వానే కాదా


శ్రీను వైట్ల కామెడీ మార్క్ ఈ సినిమాలో కూడా బాగా ఉంది. మూవీ చూడకపోతే యూ ట్యూబ్ లో ఉంది. 



3 comments:

  1. నాకు చాలా ఇష్టం..ఈపాట! ఈ పాట గురించి రాద్దామని లింక్స్ అన్నీ దాచి ఉంచా కానీ బధ్ధకిస్తు వచ్చా.. ఉండండి రాస్తాను...

    ReplyDelete
  2. మీ పుణ్యమా అని పెండింగ్ తపా ఒకటి పూర్తయ్యింది.. thanks vijaya gaaru:)
    http://samgeetapriyaa.blogspot.in/2014/03/blog-post.html

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ తృష్ణ గారు :)
      తమిళ్ సాంగ్ ఎప్పుడూ వినలేదు, కానీ బాగుంది. యూట్యూబ్ లో "సొంతం" మూవీ ఉంది, టైం ఉంటే చూడండి.

      Delete