నా దగ్గర ఉన్న పుస్తకాల్లో , నేను మళ్ళీ, మళ్ళీ చదివేది, దూర ప్రయాణాల్లో తప్పనిసరిగా నాతో ఉండేది , మధురాంతకం నరేంద్ర గారు సంకలనకర్తగా వెలువరించిన "తాత్త్విక కథలు" పుస్తకం.
"సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే "అన్నా, "ఈ సృష్టికి ఏమర్థం ? మానవునికి గమ్యమేది? ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా, లేనట్టా !" అన్నా, ఈ ప్రశ్నలన్నీ అంతర్లీనంగా కోరే సమాధానమొక్కటే... జీవిత సత్యం తెలుసుకోవడం. ఏదో ఒక సందర్భంలో జీవితం అంటే ఏమిటి అనే ఆలోచన రాని మనిషి ఉండడు. ఈ పుస్తకంలోని కథలు ఆ ప్రశ్న కి జవాబులు కాదు కానీ, కొందరు రచయితలు ఈ ప్రశ్నకు వారు అన్వేషించిన సమాధానాలు, తమ తమ దృక్పథాల్లో, కథా రూపంలో తెలుగు పాఠకులకు అందించిన కానుకలు. నరేంద్ర గారి మాటల్లోనే చెప్పాలంటే, ఈ పుస్తకంలోని కథలన్నీ "మనసునీ, జీవితాన్నీ ప్రశ్నించి జిజ్ఞాసతోనో , ఆత్మసాక్షాత్కారంతోనో ముగిసే కథలు".
చలం గారి "ఓ పువ్వు పూసింది", ఆర్. వసుంధరా దేవి గారి "పెంజీకటి కవ్వల", ఆర్. ఎస్. సుదర్శనం గారి "మధుర మీనాక్షి", ముళ్ళపూడి గారి "కానుక", త్రిపుర గారి "భగవంతం కోసం", లాంటి అన్నీ మంచి కథలే వున్న ఈ సంకలనంలో, నాకు చాలా ఇష్టమైన కథ, చదివిన తర్వాత జలంధర గారి మిగిలిన రచనల గురించి ఒక క్యూరియాసిటీ ని కలిగించిన కథ "వియద్గంగ".
(కథ గురించి నా తర్వాతి పోస్ట్ లో...)

No comments:
Post a Comment