Saturday, April 26, 2014

నూరు చైత్రాలు బ్రతకాలి

నూరు చైత్రాలు బ్రతకాలి

ఆమె గురించి ఏమని చెప్పాలి ?

సినీ సంగీత ఆకాశంలో వెన్నెలలు కురిపించిన జాబిల్లి తాననా... 
 

తన స్వరాల వర్షంలో తడవని శ్రోతలుండరనా ... 

  

ఒక చిన్న నవ్వుతో వందల భావాలని పాటలో పలికించగలరనా... 

  
వెన్నెల్లో గోదారిని, కన్నుల్లో గంగని ఒకే పాటలో దర్శింప చేయగలరనా...  


సన్నాయి స్వరాలతో పోటీ పడగల గాత్ర మధురిమ తనదేననా... 


మీకు తెలియకపోతే కదా నేను తన గురించి ఏదైనా చెప్పడానికి. 

అందుకే నేను ప్రార్థించేదొక్కటే జానకిగారు ఇలాంటి పాటలు పాడ్డానికి ఇంకో నూరు చైత్రాలు బ్రతకాలి. 
(విని తరించడానికి మనందరం కూడా అన్నాళ్ళుంటే అది బోనస్ అనుకోండి :)) 

ఆవిడ పుట్టిన రోజే పుట్టిన మా "చైత్ర", ఆవిడంత కాకపోయినా, అందులో వందో వంతు గాయని అయినా అవ్వాలని ఆశీర్వదించండి. 

Friday, April 25, 2014

ఈ పాట తెలుగులో ఏ పాటో తెలుసా

          ఈ పాట తెలుగులో ఏ పాటో తెలుసా ??




తెలుగులో ఈ పాట ఒక మూవీ ఆల్బంలో ఉంది, కానీ సినిమాలో పిక్చరైజ్ చెయ్యబడలేదు. ఆ తెలుగు సినిమాకు సంగీత దర్శకులైన సత్యం గారి పేరు పైనే ఇంటర్నెట్ లో దొరుకుతుంది, కానీ ఇది ఇళయరాజా గారి పాట. మరి ఆ తెలుగు పాట , ఆ సినిమా పేరు మీకు తెలుసా ??

అలాగే ఈ సినిమా భారతీరాజా గారు తెలుగులో రీమేక్ చేసినప్పుడు, ఈ సిచ్యువేషన్ కి ఇళయరాజా గారు వేరే పాట చేసారు. మరి ఆ పాట, ఆ సినిమా పేరు కూడా చెప్పగలిగితే మీకు బోనస్ పాయింట్స్ :)

Tuesday, April 22, 2014

My beautiful EARTH

                                  My beautiful EARTH


"Treat the earth well. It was not given to you by your parents, it was loaned to you by your children."

 




Friday, April 18, 2014

Just to brighten your weekend

ADELE 


~ the name says it all. Truly mesmerizing and magnificent voice. 

తన గొంతు వినడం మొదటిసారి అయితే, ఇక ఎప్పటికీ మరచిపోలేరని నా నమ్మకం. ఇదివరకే విని ఉంటే ఇక చెప్పేదేముంది, మీకే తెలుసు :)

Just sit back,relax,and let her voice wash over you ...








Wednesday, April 16, 2014

కొలనులో కలువనై విరిసాననా,ఓ నాన్నా

కొలనులో కలువనై విరిసాననా, ఓ నాన్నా


ఇవాళ్టి పేపర్లో చూసే ఉంటారు... జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా "నా బంగారు తల్లి" అనే చిత్రాన్ని ఎంపిక చేసారు. అసలు ఎప్పుడూ పేరు కూడా వినలేదే అని గూగుల్ చేస్తే యూట్యూబ్ లో శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట కనపడింది. 



 

   ట్రైలర్ చూస్తుంటే కాస్తా "మహానది" సినిమాలోలా కూతురు అనుకోని విషవలయంలో చిక్కుకొని, బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడితే, సర్వ శక్తులు ఒడ్డి కాపాడుకునే నాన్న కథ అనిపించింది. కానీ అంత ముఖ్యమైన నాన్న కారెక్టర్ కి మలయాళం యాక్టర్ సిద్దిఖ్ ని ఎందుకు తీసుకున్నారు అనుకున్నా.కింద ఉన్న బ్లాగ్ పోస్ట్ చదివాక అర్థమైంది, ఈ సినిమా మలయాళం, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి నిర్మించారని.  

అదే సినిమానుండి ఇంకో పాట... 





   ఉమెన్ అండ్ గర్ల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆపడానికి "ప్రజ్వల" ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ప్రయత్నానికే తన జీవితాన్ని అంకితం చేసిన సునీత కృష్ణన్ గారు ప్రొడ్యూస్ చేసారు అని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇంకాస్తా పెరిగింది. ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో ఆవిడ పడ్డ కష్టాల గురించి ఆమె మాటల్లోనే ఇక్కడ చదవండి.  

http://sunithakrishnan.blogspot.com/

Saturday, April 5, 2014

మంచు పైన మెరుపు తీగ

మంచు పై మెరుపు తీ 
సోచీ వింటర్ ఒలంపిక్స్ చూసారా? మీరు చూసినా, చూడకపోయినా, ఈ ఫిగర్ స్కేటర్ గురించైతే వినే ఉంటారు. ఆ గేమ్స్ లో రెండు కాంపిటీషన్లలో పాల్గొని, మూడో ఈవెంట్లో పాల్గొనబోతూ లాస్ట్ మినిట్లో నేను రిటైర్ అవుతున్నా అని చెప్పి, వార్తల్లో ప్రముఖంగా నిలచిన ఫిగర్ స్కేటర్ ఎవ్గీనీ ప్లుషేంకో గుర్తున్నాడా ? 

తన గురించి చదువుతుంటే, తన పట్టుదల, తన కోచ్ పైన తనకున్న గౌరవం, దేశం పైన ప్రేమ...భలే నచ్చేసాడు.




 (14 యేళ్ళ వయసులో యంగెస్ట్ ఎవర్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్ పెర్ఫార్మన్స్)

ప్లుషేంకో 11 యేళ్ళ వయసులో కోచ్ మిషిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోడం మొదలెట్టాడు. తనతో పాటూ అదే కోచ్ దగ్గర ట్రైన్ అవుతూ, మధ్యలో వేరే కోచ్ దగ్గరకి వెళ్ళిపోయిన అలెక్సీ యాగుడిన్ తో తనకు బద్ధ విరోధముండేది. అలెక్సీ రిటైర్ అయ్యేవరకు ఆ శతృత్వం అలాగే కొనసాగింది. ఎన్నో ఛాంపియన్ షిప్స్ గెలుచుకున్న అలెక్సీ , ప్లుషేంకో కారణంగా, రష్యన్ నేషనల్ ఛాంపియన్ షిప్ మాత్రం ఒక్కసారి కూడా సంపాదించలేకపోయాడు. 

 2006 లో తను బ్రేక్ తీసుకున్నప్పుడు, తర్వాత సంవత్సరం (2007) వరల్డ్ చాంపియన్ షిప్ లో రష్యా పెర్ఫార్మెన్స్ చూసి బాధపడి, రాబోయే 2010 ఒలంపిక్స్ లో మళ్ళీ రష్యా ని ఛాంపియన్ గా నిలబెట్టాలనుకున్నాడు. 



పట్టుదలతో తన ట్రైనింగ్ మళ్ళీ మొదలుపెట్టి, వాంకోవర్  ఒలంపిక్స్ లో తన షార్ట్ ప్రోగ్రాం పెర్ఫార్మెన్స్ స్కోర్ తో అప్పటిదాకా ఉన్న రికార్డ్ బ్రేక్ చేసాడు. కానీ గాయాల కారణంగా 2010 వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనలేకపోయాడు. అదే సంవత్సరం తను స్కేటింగ్ ఎక్జిబిషన్స్లో అనుమతి లేకుండా పాల్గొనడం వల్ల ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ నిషేధానికి గురయ్యాడు. కానీ అదే సంస్థ తను తిరిగి 2014 ఒలంపిక్స్ లో పాల్గొనడానికి అనుమతి కోరినప్పుడు, ఏకగ్రీవంగా అంగీకరించింది. 


  
సోచీ ఒలంపిక్స్ లో రష్యా కి మొదటి గోల్డ్ మెడల్ (టీమ్) సాధించి, తన బాక్ ఇంజ్యురీ కారణంగా మిగిలిన పోటీలనుండి తప్పుకొని రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.  



కానీ తనని 2018 వింటర్ ఒలంపిక్స్ లో మళ్ళీ చూస్తే, ఏ మాత్రం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే తన సంకల్ప బలం అలాంటిది కాబట్టి... అతను ఇప్పటికెన్నో సార్లు పడి, లేచిన కడలి తరంగం కాబట్టి. 
   

(దొంగలు పడ్డ ఆరు నెలలకు సామెతలాగా ఎప్పుడో ముగిసిపోయిన వింటర్ ఒలంపిక్స్ కి సంబంధించిన పోస్ట్ ఇప్పుడేంటి అనుకోకండి. ఇది అప్పట్నుండి నా డ్రాఫ్ట్స్ లో మూలుగుతూనే ఉంది.)

Friday, April 4, 2014

ఈ పాట వింటుంటే మీకు ఏ తెలుగు పాట గుర్తు వస్తోంది

ఈ పాట వింటుంటే మీకు ఏ తెలుగు పాట గుర్తు వస్తోంది??

 

ఈ హిందీ పాటలను గుర్తు పట్టగలరా - జవాబులు

      ఈ హిందీ పాటలను గుర్తు పట్టగలరా - జవాబులు

1. నీ దుఃఖాలన్నీ నావీ, నా సుఖాలన్నీ నీవి

 తేరే దుఃఖ్ అబ్ మేరే, మేరే సుఖ్ అబ్ తేరే

పాట : తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై
మూవీ: గైడ్ 

 


2. ఈ చప్పుడు... ఆకుల గల, గలలా? లేక నువ్వు నిశబ్దంగా నాతో ఏదైనా అన్నావా 

ఏ పత్తియోన్ కీ హై సర్ సరాహట్, కే తుమ్ నే చుప్ కే సే కుచ్ కహా హై 

పాట : యే కహా ఆగయే హమ్ యూహీ సాథ్ సాథ్ చల్తే 
మూవీ: సిల్ సిలా 





3. నేను సంతోషాల మజిలీలు వెతుకుతుంటే, శోకాల బాధలు దొరికాయి 

ఖుషియోం కీ మంజిల్  ఢూండీ తో ఘమ్ కీ దర్ద్ మిలీ 

పాట : జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా 
మూవీ: ప్యాసా 



 
4. కొంతమంది ఎడబాటుని సహిస్తారని విన్నాను. వాళ్ళు  ఆ బాధతో ఎలా జీవిస్తారో? 

సునా ఘమ్ జుదాయి కా ఉఠాతే హై లోగ్ , జానే జిందగీ కైసే బితాతే హై లోగ్ 

పాట : హమే తుంసే ప్యార్ కిత్నా యే హమ్ నహీ జాన్తే 
మూవీ: కుద్రత్ 



5. పెదాలు కదిలాయంటే, ఎక్కడో జాజిపూలు విచ్చుకునే ఉంటాయి. మీ కళ్ళలోనే, నే వెతికే తీరాలు దొరుకుతాయి. 

లబ్ హిలే తో  మోగ్రే కే ఫూల్ ఖిల్తే  హై కహీ , ఆప్ కీ ఆంఖోం మే క్యా సాహిల్ భీ మిల్తే హై కహీ 

పాట : ఆప్ కీ ఆంఖోం మే కుచ్ మెహకే హుయే సే రాజ్ హై  
మూవీ: ఘర్ 





6. జీవించడం ఎక్కడ మరచిపోయానో గుర్తు లేదు. నిన్నెక్కడైతే పొందానో, శ్వాస అక్కడినుండే మళ్ళీ మొదలయ్యింది.

నువ్వెప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తుంటే, కాలంతో కాస్త చెప్పి వెళ్ళు, అక్కడే ఆగమని...ఆ క్షణాన్ని అక్కడే ఆపమని...  

జీనా భూలే థే కహా యాద్ నహీ... తుఝ్ కో పాయా హై జహా , సాస్ ఫిర్ ఆయీ వహీ 
తుమ్ అగర్ జావో కభీ , జావో కహీ , వక్త్ సే కహ్నా వో ఠహర్ జాయే వహీ 
వో ఘడీ వహీ రుకే , 

పాట : నా జియా లాగే నా, తేరే బినా మేరా కహీ జియా లాగే నా  
మూవీ: ఆనంద్ 







(ఈ సినిమాలోని ఎన్నో గొప్ప పాటల్లో  ఈ పాట కొంచెం తక్కువ గుర్తు ఉంటుంది అందరికీ. కానీ నాకిష్టమైన పాటల్లో  తప్పక ఉండే పాట ఇది)  

Thursday, April 3, 2014

ఈ పాటలను గుర్తు పట్టగలరా

            ఈ హిందీ పాటలను గుర్తు పట్టగలరా ??

1. నీ దుఃఖాలన్నీ నావీ, నా సుఖాలన్నీ నీవి

2. ఈ చప్పుడు... ఆకుల గల, గలలా? లేక నువ్వు నిశబ్దంగా నాతో ఏదైనా అన్నావా

3. నేను సంతోషాల మజిలీలు వెతుకుతుంటే, శోకాల బాధలు దొరికాయి 

4. కొంతమంది ఎడబాటుని సహిస్తారని విన్నాను. వాళ్ళు  ఆ బాధతో ఎలా జీవిస్తారో? 

5. పెదాలు కదిలాయంటే, ఎక్కడో జాజిపూలు విచ్చుకునే ఉంటాయి. మీ కళ్ళలోనే, నే వెతికే తీరాలు దొరుకుతాయి.

6. జీవించడం ఎక్కడ మరచిపోయానో గుర్తు లేదు. నిన్నెక్కడైతే పొందానో, శ్వాస అక్కడినుండే మళ్ళీ మొదలయ్యింది. 

నువ్వెప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తుంటే, కాలంతో కాస్త చెప్పి వెళ్ళు, అక్కడే ఆగమని...ఆ క్షణాన్ని అక్కడే ఆపమని... 

(ఈ సినిమాలోని ఎన్నో గొప్ప పాటల్లో  ఈ పాట కొంచెం తక్కువ గుర్తు ఉంటుంది అందరికీ. కానీ నాకిష్టమైన పాటల్లో  తప్పక ఉండే పాట ఇది)  

Wednesday, April 2, 2014

విన్న ప్రతిసారి మనసుపై మత్తు జల్లే పాట

ఎన్ని పాటలు వింటుంటాం... రోజులో, నెలలో , సంవత్సరంలో, కొన్ని వేల పాటలు, ఔనా??

      ఇన్ని పాటల మధ్య, మొదటిసారి విన్నది కొన్నేళ్ళ క్రితం అయినా, ఈ రోజుకీ వింటుంటే... 

మనసుని గాలి అలలపైన తేల్చేసి, 
హృదయాన్ని పూరెక్కల మధ్య ముంచేసి, 
ఆలోచనలన్నీ మాయం చేసి, 
మనని మరో ప్రపంచంలో గిరికీలు కొట్టించే 

... పాటలెన్ని ఉంటాయి? వేళ్ళ పైన లెక్క పెట్టేటన్ని మాత్రమే,కదా?

అలాంటి ఒక పాటే, నాకెంతో ఇష్టమైన సంగీత దర్శకులు _/\_ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన "మాటే మంత్రము" పాట. 


ఈ పాట వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఈ మధ్య విని ఉండకపోతే ఈ వీడియో చూడండి. ఆ పాటకు తగ్గ ఎంత అందమైన ఫోటోలతో చేసారో.

పాట విన్న తర్వాత ఈ రోజంతా ఇదే పాట మీ మనసులో (నోట్లో) మెదులుతూ ఉండకపోతే అప్పుడడగండి.