Thursday, April 3, 2014

ఈ పాటలను గుర్తు పట్టగలరా

            ఈ హిందీ పాటలను గుర్తు పట్టగలరా ??

1. నీ దుఃఖాలన్నీ నావీ, నా సుఖాలన్నీ నీవి

2. ఈ చప్పుడు... ఆకుల గల, గలలా? లేక నువ్వు నిశబ్దంగా నాతో ఏదైనా అన్నావా

3. నేను సంతోషాల మజిలీలు వెతుకుతుంటే, శోకాల బాధలు దొరికాయి 

4. కొంతమంది ఎడబాటుని సహిస్తారని విన్నాను. వాళ్ళు  ఆ బాధతో ఎలా జీవిస్తారో? 

5. పెదాలు కదిలాయంటే, ఎక్కడో జాజిపూలు విచ్చుకునే ఉంటాయి. మీ కళ్ళలోనే, నే వెతికే తీరాలు దొరుకుతాయి.

6. జీవించడం ఎక్కడ మరచిపోయానో గుర్తు లేదు. నిన్నెక్కడైతే పొందానో, శ్వాస అక్కడినుండే మళ్ళీ మొదలయ్యింది. 

నువ్వెప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తుంటే, కాలంతో కాస్త చెప్పి వెళ్ళు, అక్కడే ఆగమని...ఆ క్షణాన్ని అక్కడే ఆపమని... 

(ఈ సినిమాలోని ఎన్నో గొప్ప పాటల్లో  ఈ పాట కొంచెం తక్కువ గుర్తు ఉంటుంది అందరికీ. కానీ నాకిష్టమైన పాటల్లో  తప్పక ఉండే పాట ఇది)  

10 comments:

  1. 1. Tere dukh ab mere, mere sukh ab tere
    Tere ye do mains chaand aur suraj mere, o mere jeevan sathi

    Tere mere sapne ab ek rang hain - guide

    2. yeh kahaan aagaye hum - Silsila.

    ReplyDelete
    Replies
    1. Correct పద్మ.

      ye do "mains"...iPhone auto correct ??? :)

      Delete
  2. 4. suna gam judaai kaa utaathey hain log, jaane zindagi kaise bithathe hain log
    din bhi yehaan tho lage, baras ke samaan

    hamein tumse pyaar kithna yeh hum nahin jaanthey
    magar jee nahin sakthey tumhaare binaa

    Movie: Kudrat

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్ Anonymous గారు.

      నా అనువాద ప్రతిభకి, నా భుజం నేనే తట్టుకుంటున్నా. పోస్ట్ చేసిన తర్వాత, క్షణ క్షణం సినిమాలో పరేష్ రావల్ లాగా, ఎవరికీ ఇవి అర్థం కావేమో అని కాసేపు అనుమానపడ్డా :)

      Delete
  3. అయ్యో మిస్సయ్యాను...మీరు ఎలార్ట్ చెయ్యాలి ఇవాళ క్విజ్ పెడతాను అని...!
    1,2&4 are over na,

    3.ఖుషియోం కీ మంజిల్ ఢూంఢీ తో ఘమ్ కీ గర్ద్ మిలీ..

    జానే వో కైసే లోగ్ థె జిన్కె ప్యార్ కో ప్యార్ మిలా..(ప్యాసా). :)

    5) "లబ్ ఖిలెవ్ తో మొగ్రె కె ఫూల్ ఖిల్తె హై కహీ.."
    ఆప్కీ ఆఖొం మె కుచ్ మెహ్కె హువే సే రాజ్ హై...(ఘర్)

    6)జీనా భూలే థే కహీ యాద్ నహీ తుఝ్ కో పాయా హై జహా సాస్ ఫిర్ ఆయీ వహీ..
    నా జియా లాగేనా..(ఆనంద్)

    :-)

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యా... అన్నీ చెప్పేశారు తృష్ణ. ఈ క్విజ్ లో 3/6 తో మీరు ఫస్ట్ రాంక్ సాధించారు :)

      Delete
  4. అయ్యో మిస్సయ్యాను...మీరు ఎలార్ట్ చెయ్యాలి ఇవాళ క్విజ్ పెడతాను అని...!

    3)ఖుషియోం కీ మంజిల్ ఢూంఢీ తో ఘమ్ కీ గర్ద్ మిలీ..
    జానే వో కైసే లోగ్ థె జిన్కె ప్యార్ కో ప్యార్ మిలా..(ప్యాసా)

    5)"లబ్ ఖిలెవ్ తో మొగ్రె కె ఫూల్ ఖిల్తె హై కహీ.."
    ఆప్కీ ఆఖొం మె కుచ్ మెహ్కె హువే సే రాజ్ హై...(ఘర్)

    6)జీనా భూలే థే కహీ యాద్ నహీ తుఝ్ కో పాయా హై జహా సాస్ ఫిర్ ఆయీ వహీ..
    నా జియా లాగేనా..(ఆనంద్)

    ReplyDelete
    Replies
    1. నిన్న అనుకున్నా, మిమ్మల్నడిగి ట్రాన్స్లేషన్ కన్ఫర్మ్ చేసుకుందామని. కానీ అలా చేస్తే మీరు సాల్వ్ చేయడానికి ఉండదు కదా. అందుకని అలాగే పోస్ట్ చేసా.

      Delete
  5. మీరిలా క్విజ్ లు ఇస్తే నాకెంత సరదాగా ఉంటుందో చెప్పలేను. ఎక్కడికో పోయిన ప్రాణాలు మళ్ళీ ఒక్కసారిగా కనబడినట్లుంటుంది! keep going! but alert before quiz posts.. orelse i'll miss them :(

    ReplyDelete
    Replies
    1. ఈసారి మీకు ఈ మెయిల్ పెడతాను, ఇక్కడ పోస్ట్ చేసిన వెంటనే :)

      Delete