Friday, January 31, 2014

ఎపుడూ నీకు నే తెలుపనిదీ ...

ఎపుడూ నీకు నే తెలుపనిదీ...ఇక పై ఎవరికీ తెలియనిదీ


ఇ.వీ.వీ గారి అబ్బాయి, అల్లరి నరేష్ అన్నగానే మిగిలిపోయిన రాజేష్ (పేరులో ఆర్యన్ మధ్యలో చేర్చుకున్నాడు లెండి), తమిళ్ ఇండస్ట్రీ లో ఒకానొకప్పటి టాప్ హీరోయిన్ నమితలు జంటగా నటించిన "సొంతం" సినిమాలోని ఈ పాట విన్నారా?

         దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హీరోల సినిమాలు మాత్రమే చేసే పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అవకముందు చేసిన ఈ సినిమాలో "ఎపుడూ నీకు నే తెలుపనిదీ", "తెలుసునా తెలుసునా మనసుకీ కదలిక (చిత్ర గారు పాడారు)" పాటలు రెండు చాలా బాగుంటాయి. ఇదివరకు విని ఉండకపోతే తప్పక వినండి. 

మనసిచ్చిన స్నేహితుడికి ఆ మాట చెప్పలేక, మనసు లేని మనువు చేసుకోలేక, ఒక అమ్మాయి పడే ఆవేదనకి అక్షర రూపం ఈ పాట. 

        మేల్, ఫీమేల్ రెండు వర్షన్స్ లో, సుమంగళి పాడిన ఈ పాట నాకిష్టం. ఆ అమ్మాయి "ఖడ్గం" లో పాడిన "నువ్వు , నువ్వు" పాట మరచిపోగలమా ఎప్పటికైనా ?

        ఏంటీ, సాహిత్యం ఎవరిదీ అంటున్నారా? ఇంత మంచి భాషలో ఇంకెవరు రాయగలరు? పక్కన వున్న "ఈ వారం పాట" ఆడియో ప్లేయర్ లో ఈ పాట విని రచయిత పేరు చెప్పండి.


ఎపుడూ నీకు నే  తెలుపనిది... ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది... బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది... హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది

గుండెలో ఆశనే, తెలుపనే లేదు నా మౌనం
చూపులో భాషనే, చదవనే లేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా... కలుసుకోలేను  ఎదరున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా ...  అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం
కల కరిగించేటి కన్నీటి  వానే కాదా


శ్రీను వైట్ల కామెడీ మార్క్ ఈ సినిమాలో కూడా బాగా ఉంది. మూవీ చూడకపోతే యూ ట్యూబ్ లో ఉంది. 



Wednesday, January 29, 2014

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా - జవాబులు

 1. జానే కహా కైసే షహర్.. లేకే చలా యే దిల్ ముఝే 
తేరే బగైర్ దిన్ నా జలా.. తేరే బగైర్ షబ్ నా బుఝే   

 పాట: సిలీ హవా ఛూగయీ... సీలా బదన్ ఛిల్ గయా , మూవీ: లిబాస్ 

 







2.  తుమ్ ఇన్ సబ్ కో ఛోడ్ కే కైసే కల్ సుబహ్ జావోగీ 
మేరే సాథ్ ఇన్హే భీ తో తుమ్ యాద్ బహుత్ ఆవోగీ 

 One of the most beautifully picturised songs in Hindi movies (in my opinion)
 పాట: బడే అఛ్చే లగతే హై... యే ధర్తీ, యే నదియా, యే రైనా, ఔర్ తుమ్ , మూవీ: బాలికా బధు 



 
3. తుమ్హే దేఖ్ కే తో లగ్తా హై ఐసే... బహారోంకీ మౌసమ్ ఆయా హో జైసే
దిఖాయీ నా దేతీ, అంధేరోం మే జ్యోతీ... 

పాట: హమే ఔర్ జీనే కీ చాహత్ న హోతీ అగర్ తుమ్ న హోతే , మూవీ: అగర్ తుమ్ న హోతే 

 




4. ఇస్ జిందగీ కే దిన్ కిత్నే కమ్ హై... కిత్నీ హై ఖుషియా ఔర్ కిత్నే గమ్ హై 

పాట: దో లఫ్జోన్ కీ హై దిల్ కీ కహానీ , మూవీ: ది గ్రేట్ గాంబ్లర్ 

 



5. పహలే భీ యూ తో బర్సేతే బాదల్... పహలే భీ యూ తో భీగా థా ఆంచల్ 

పాట: రిమ్ ఝిమ్ గిరే సావన్ , మూవీ: మంజిల్ 

 





6. ప్యార్ మే జిన్ కే సబ్ జగ్ ఛోడా..  ఔర్ హుయే బద్నామ్
ఉన్కే హీ హాథోం హాల్ హువా యే .. బైఠె హై దిల్ కో థామ్ 


పాట: దిన్ ఢల్ జాయే హాయ్ రాత్ నా జాయే, మూవీ: గైడ్ (my fav song in this movie)

 

Tuesday, January 28, 2014

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

1. జానే కహా కైసే షహర్.. లేకే చలా యే దిల్ ముఝే 
తేరే బగైర్ దిన్ నా జలా.. తేరే బగైర్ షబ్ నా బుఝే  

2.  తుమ్ ఇన్ సబ్ కో ఛోడ్ కే కైసే కల్ సుబహ్ జావోగీ 
మేరే సాథ్ ఇన్హే భీ తో తుమ్ యాద్ బహుత్ ఆవోగీ

3. తుమ్హే దేఖ్ కే తో లగ్తా హై ఐసే... బహారోంకీ మౌసమ్ ఆయా హో జైసే
దిఖాయీ నా దేతీ, అంధేరోం మే జ్యోతీ...

4. ఇస్ జిందగీ కే దిన్ కిత్నే కమ్ హై... కిత్నీ హై ఖుషియా ఔర్ కిత్నే గమ్ హై

5. పహలే భీ యూ తో బర్సేతే బాదల్... పహలే భీ యూ తో భీగా థా ఆంచల్ 

6. ప్యార్ మే జిన్ కే సబ్ జగ్ ఛోడా..  ఔర్ హుయే బద్నామ్
ఉన్కే హీ హాథోం హాల్ హువా యే .. బైఠె హై దిల్ కో థామ్ 

Monday, January 27, 2014

గాన గంధర్వులైననేమి...

... పాటను అగౌరవపరచడానికి?

నిన్నటి స్వరాభిషేకం (ఈ టివి ప్రోగ్రాం) చూసారా? మొదటగా అక్కినేని గారి జ్ఞాపకార్థం కె. జె. ఏసుదాస్ గారు పాడిన "ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన" పాట వినే ఉంటారు. మీకేమనిపించింది ? ఏసుదాస్ గారు చాలా గొప్ప గాయకులు. ఎంతో గొప్ప గాత్రం. నా బ్లాగ్ లోకి అడుగిడగానే మీకు ఈ వారం వినిపించే పాట వారిదే. 
 
కానీ ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా బాధ వేసింది. నాకు వినికిడి జ్ఞానమే తప్ప, సంగీతంలో ఎటువంటి ప్రవేశం లేదు. ఆ పాట వింటున్నప్పుడు నాకనిపించినవి... 

  •     చరణాల దగ్గర మ్యూజిక్ కి సంబంధం లేకుండా, ముందుగానో, వెనగ్గానో పాడేసారు. 
  •     పదాలు ఇష్టమొచ్చినట్టు పలికారు. విరహమో, దాహమో కాకుండా "విరగమో, దాగమో " అని వినిపించాయి
  •     "కడిమివోలె నిలిచానని" అయితే అసలేమన్నారో కూడా అర్థం కాలేదు. 

ఆయన తెలుగు వారు కాదు, కానీ పక్కన బాలు గారు, ఇతర తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ పదాన్ని ఎలా పలకాలో అడిగితే చెప్తారు కదా. పాటంటే గాత్రం మాత్రమే కాదు కదా.  సాహిత్యం, సంగీతం , గాత్రం మూడూ కలిసి ఆ ప్రత్యేక సన్నివేశాన్ని రక్తి కట్టించినప్పుడే పాటకి సార్ధకత. అంత పెద్దవారు ఆర్కెస్ట్రా తో కలిసి ప్రాక్టీస్ చేయకుండా(చేసి ఉండరనే అనుకుంటున్నా, ఆ పెర్ఫార్మన్స్ ప్రకారం) అలా స్టేజీ మీద పాడేయడం... అక్కినేని గారికి  నివాళి ఏమో కానీ, రమేష్ నాయిడు గారు, వేటూరి గారు might be turning in their graves :(
                                          (ఈమాటకి తెలుగులో సమానార్థకం తట్టలేదు)

  

అల్లనల్లన తొంగి చూస్తున్న వసంతం


 కొద్ది, కొద్దిగా చలి తగ్గుతోంది. ఎటు చూసినా ఆకులు, పూలూ ఏమీ లేని మోడుల నుండి, చెట్లు కొన్ని పూలు పూయడం మొదలు పెట్టాయి. వసంతం రావడానికి ఇంకా చాలా టైం ఉన్నా, నిన్న ఈ పూలు, చెట్లు చూస్తుంటే, తలుపు వెనకాల అమ్మ కొంగు పట్టుకుని తొంగి చూస్తున్న చిన్న పిల్లలా, ఆమని కూడా తొంగి చూస్తున్నట్టనిపించింది. 





  చెర్రీ బ్లాసమ్స్ (తెల్లటి పూలు)
ఈ పూలు జనవరి నెల చివరి వారాలలో పూయడం మొదలు పెట్టి, ఫిబ్రవరీ రెండవ వారంలోగా రాలిపోతాయి. వాలెంటైన్స్ డే స్పెషల్ అన్నమాట :)


నేములోనేమున్నది  (పేరు తెలియని పువ్వులు)

 
హమ్మింగ్ బర్డ్ ఫీడర్





కాలిఫోర్నియా పెప్పర్ ట్రీ



Sunday, January 26, 2014

అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్

ఈ రోజు వార్తల్లో చూసాను అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్ కె. ప్రసాద్ బాబు గురించి. ప్రసాద్ బాబు గ్రే హౌన్డ్స్ సబ్-ఇన్స్పెక్టర్. మావోయిస్ట్లతో పోరాడుతూ, క్రితం సంవత్సరం ఏప్రిల్ లో, నలుగురు సహచరులని కాపాడి, ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త , ప్రసాద్ బాబు తండ్రి బాధ, మనసుని కలచి వేసింది. 


 Ashok Chakra for Andhra Pradesh's braveheart cop, who died fighting Maoists

 http://www.ndtv.com/article/india/ashok-chakra-for-andhra-pradesh-s-braveheart-cop-who-died-fighting-maoists-475651
 
   
      ఇంత చదువుకున్న, తెలివైన, ధైర్యం గల యువకుడిని కోల్పోవడం నిజంగా ఆ కుటుంబానికే కాదు,సమాజానికి కూడా పెద్ద లోటే. ఇదే సంఘటనలో మరో 9 మంది నక్సల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు  కూడా చదువు , తెలివి, ప్రాణాలను పణం పెట్టగలిగిన తెగువ కలిగిన , ప్రసాద్ బాబు లాంటి యువకులే అయ్యి ఉండవచ్చు.  కానీ వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు, వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కనీసం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆఖరి చూపు కూడా దక్కి ఉండకపోవచ్చు.

      కేవలం ఆశయాలు, లక్ష్యాలు  వేరైనందుకు, ఇరువైపులా పూడ్చుకోలేని  ప్రాణ నష్టం జరిగిపోయింది. 10 కుటుంబాలు తాము గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకులను, నవ్వులూ-ఏడుపులు కలిసి పంచుకున్న అన్న/తమ్ముళ్ళని, మనస్సుని, జీవితాన్నిపంచుకున్నసహచరులను కోల్పోయారు. కారణమేదైనా కానీ, ఈ హింస ఎప్పటికీ సమర్థనీయం కాదు. 

      సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నంత కాలం సాయుధ పోరాటాలు, వాటిని అణచి వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ఉండి తీరుతాయి అని తెలుసు. అవన్నీ ఉన్నంత కాలం ఇరుపక్షాలు ఇలాంటి సంఘటనలను collateral damage అని సమర్థించుకుంటాయి అనీ తెలుసు. అన్నీ తెలిసినా ఇలాంటి వార్త చూడగానే మనసు కదిలి వచ్చే దుఃఖం ఎందుకు ఆగదు ???

 

Saturday, January 25, 2014

వియద్గంగ - 2

ఈ కథ, డాక్టర్ కశ్యప్, మందాకిని రాక కోసం ఎదురు చూస్తుండడంతో మొదలవుతుంది. ఈ మందాకిని ఎవరంటే, కశ్యప్ ప్రాణప్రదంగా పెంచుకుని, తన ఆప్తమిత్రుడు రాజా కి ఇచ్చి పెళ్లి చేసిన, చెల్లెలు రాణి సంసారాన్ని కూలదోస్తున్న మహాతల్లి (ఆ చెల్లి మాటల్లో). ఇటువంటి పరిస్థితిలో కూడా, కశ్యప్ తన చెల్లి వైపునుండి మాత్రమే కాక, ఆ ఇంకో మనిషిని కూడా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే ఆమె వైజాగ్ కి కాంప్ కి వచ్చిందని తెలిసి, డిన్నర్ కి ఆహ్వానిస్తాడు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మందాకినిని గురించి అతను అనుకునే మాట "రాగఛ్చాయల్లో ఇమడని ఆలాపన ఆమె". 

     ఆ రోజు జరిగిన సంభాషణలో కశ్యప్ గమనించే విషయం "ఫలితం ఏదన్నా కావచ్చు... ఆమె సాన్నిధ్యం గొప్ప అనుభవం" అని. అతను భోంచేయకపోడం గమనించిన ఆమె, కారణం అడిగినప్పుడు "జీవితంలో మనకు ఇష్టమైన దాన్ని ముడుపు కట్టుకొని, మనం కోరుకున్న వ్యక్తికి మేలుగా మార్చగలం" అన్న థియరీ ని తను నమ్ముతానని, అందుకే తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు, తన ప్రాణ మిత్రుడైన రాజా హాయిగా ఉండాలని కోరుకుంటూ, తనకు చాలా ఇష్టమైన తిండిని దూరం చేసుకున్నానని చెప్తాడు. 

       ఆ ఒక్కరోజు పరిచయంలో కశ్యప్ మాటల్లో, మౌనంలో మందాకిని నేర్చుకున్న విషయాలు ఆమె , ఆమెను భూమిపై ప్రవహించే మందాకిని నుండి, ఆకాశంలో ఉండే వియద్గంగగా మారడానికి దోహదం చేస్తాయి. 

    నేను ఈ పుస్తకం మొదటిసారి చదివేటప్పటికి, ఇందులో ఉన్న మిగతా కథలు, రచయితల గురించి ఏ మాత్రం తెలీదు. కాబట్టి అన్ని కథలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చదివాను. అమ్మ ప్రతిదానికీ ఉపవాసం అంటే విసుక్కునే దాన్ని... అలా లంచాలు ఇస్తారా దేవుడి కి, మనం అన్నం మానేస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి అని. కానీ ఈ కథ చదివిన తర్వాత అర్థం అయ్యింది, మనుషులుగా మనకు అత్యంత పెద్ద బలహీనత అయిన, లేదా మనకు అతి ఇష్టమైన ఏదో ఒక విషయాన్ని, అవతల మనిషికి మంచి జరగాలని నిస్వార్థంగా త్యాగం చేస్తే , ఆ ప్రేమపూరిత చర్య ఆ మనిషి జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసి తీరుతుందని. 

      రచయిత డా. వి. ఆర్. రాసాని గారి మాటల్లో "... జీవితాన్ని జీవిస్తూ మన జీవితానికి మనమే ప్రేక్షక పాత్ర వహిస్తూ సన్నివేశాలను, ఫలితాలను, అనుభూతులను సమీక్షించుకుంటూ బ్రతకడం వలన చాలా సమస్యలకు అర్థాలు దొరుకుతాయి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ విషయాన్ని కథారూపంలో జలంధరగారు చక్కగా అందించారు."

    ఈ పుస్తకంలో మీరిదివరకే చదివి ఉండిన కథలు గాలివాన, మధుర మీనాక్షి, ఓ పువ్వు పూసింది,భగవంతం కోసం లాంటి కథలతో పాటు, అరుదైన హొగినేకల్, పెంజీకటి కవ్వల,ఒక గంట జీవితం, నా స్నేహితుడు... లాంటి మంచి కథలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఇదివరకు చదివి ఉండకపోతే ఈసారి పుస్తకాల షాప్ కి వెళ్ళినప్పుడు తప్పక తెచ్చుకోండి. మీరు డిజప్పాయింట్ అవ్వరని నా నమ్మకం. 
 
                               తాత్త్విక కథలు
                            సుభాషిణి ప్రచురణలు
                                వెల:  150/రూ . 
         దొరికే చోటు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ &  ప్రజాశక్తి బుక్ డిపో
                   
              ఇంకా ఈ పుస్తకంలో ఉన్న మిగతా కథలు... 

            






                                         
                

Friday, January 24, 2014

వియద్గంగ

నా దగ్గర ఉన్న పుస్తకాల్లో , నేను మళ్ళీ, మళ్ళీ చదివేది, దూర ప్రయాణాల్లో తప్పనిసరిగా నాతో ఉండేది , మధురాంతకం నరేంద్ర గారు సంకలనకర్తగా వెలువరించిన "తాత్త్విక కథలు" పుస్తకం. 





 
     
      "సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే "అన్నా, "ఈ సృష్టికి ఏమర్థం ? మానవునికి గమ్యమేది? ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా, లేనట్టా !" అన్నా, ఈ ప్రశ్నలన్నీ అంతర్లీనంగా కోరే సమాధానమొక్కటే... జీవిత సత్యం తెలుసుకోవడం. ఏదో ఒక సందర్భంలో జీవితం అంటే ఏమిటి అనే ఆలోచన రాని మనిషి ఉండడు. ఈ పుస్తకంలోని కథలు ఆ ప్రశ్న కి జవాబులు కాదు కానీ, కొందరు రచయితలు ఈ ప్రశ్నకు వారు అన్వేషించిన సమాధానాలు, తమ తమ దృక్పథాల్లో, కథా రూపంలో తెలుగు పాఠకులకు అందించిన కానుకలు. నరేంద్ర గారి మాటల్లోనే చెప్పాలంటే, ఈ పుస్తకంలోని కథలన్నీ "మనసునీ, జీవితాన్నీ ప్రశ్నించి జిజ్ఞాసతోనో , ఆత్మసాక్షాత్కారంతోనో ముగిసే కథలు". 

     చలం గారి "ఓ పువ్వు పూసింది", ఆర్. వసుంధరా దేవి గారి "పెంజీకటి కవ్వల", ఆర్. ఎస్. సుదర్శనం గారి "మధుర మీనాక్షి", ముళ్ళపూడి గారి "కానుక", త్రిపుర గారి "భగవంతం కోసం",  లాంటి అన్నీ మంచి కథలే వున్న ఈ సంకలనంలో, నాకు చాలా ఇష్టమైన కథ, చదివిన తర్వాత జలంధర గారి మిగిలిన రచనల గురించి ఒక క్యూరియాసిటీ ని కలిగించిన కథ "వియద్గంగ".

           (కథ గురించి నా తర్వాతి పోస్ట్ లో...)
   

Wednesday, January 22, 2014

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా - జవాబులు


1.  నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో 
    దేవదాసు- కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే,ఇంతేనులే





2. వసంత మధుర సీమల... ప్రశాంత సాంధ్య వేళల 
అనార్కలి - జీవితమే సఫలము... రాగసుధా భరితము... ప్రేమ కథ మధురము



3. కలువ మిటారపు కమ్మని కలలు....కళలు కాంతులు నీ కొరకేలే 
శాంతినివాసం - కలనైనా నీ వలపే... కలవరమందైనా నీ తలపే


4. శృతి చేసినావు ఈ మూగ వీణ...సుధా మాధురి చవి చూపినావు 
బాటసారి - ఓ బాటసారి నను మరవకోయి
(వీడియో యూ ట్యూబ్ లో దొరకలేదు)

5. జరిగి.. ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి 
మేఘ సందేశం - సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 
 (వీడియో యూ ట్యూబ్ లో దొరకలేదు)

6. మునకే మిగులునని..కన్నందుకు ఫలితమని.. తెలుసుకోరు
బహుదూరపు బాటసారి - మేఘమా నీలి మేఘమా


7. రెల్లు చేలల్లో రేయి వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో 
అమరజీవి - మల్లె పూల మారాణికి బంతిపూల పారాణి 


Tuesday, January 21, 2014

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

1.  నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో 

2. వసంత మధుర సీమల... ప్రశాంత సాంధ్య వేళల 

3. కలువ మిటారపు కమ్మని కలలు....కళలు కాంతులు నీ కొరకేలే 

4. శృతి చేసినావు ఈ మూగ వీణ...సుధా మాధురి చవి చూపినావు 

5. జరిగి.. ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి 

6. మునకే మిగులునని..కన్నందుకు ఫలితమని.. తెలుసుకోరు

7. రెల్లు చేలల్లో రేయి వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో 

నాగేశ్వర రావు గారు ఇక లేరు

నాగేశ్వర రావు గారు ఇక లేరు... ఇప్పుడే ఈనాడు లో ఈ వార్త చూసాను. ఆయనది పెద్ద వయసే, ఆరోగ్యం కూడా బాగా లేదని ఈ మధ్య వింటూనే ఉన్నాము. అయినా ఆ మాట చదవగానే మనసులో బాధ... చిన్నప్పటినుండి తెలిసిన వారెవరో వెళ్లిపోయినట్లు. చిన్నప్పుడు నేను ఎన్టీయార్ గారి వీరాభిమానిని. అందుకని ఎవరైనా ఏఎన్నార్ గారి ఫాన్స్ అంటే ఓ...వెక్కిరించేదాన్ని. అందుకే ఈరోజు ఈ బాధ నాకే విచిత్రంగా అనిపిస్తోంది. ఏమైతేనేం తెలుగు సినిమాలో ఒక శకం సగం ఎన్టీయార్ గారి మరణం తో ముగిసిపోతే, మిగిలిన సగం ఇవాళ ముగిసిపోయింది. 

        ఆయన నాస్తికులని తెలుసు. కానీ నేను నమ్మే భద్రగిరి రామయ్య ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. 



Monday, January 20, 2014

లైబ్రరీలు-2

ఇక్కడ  కొద్దిగా సెటిల్ అయ్యాక, బోర్ కొట్టడం మొదలైంది. ఇండియాలో ఉన్నప్పుడు డిగ్రీ పూర్తి కాకుండానే జాబ్ రావడంతో అసలు ఖాళీగా ఉండిందే లేదు. ఇక్కడికి వచ్చాక డిపెండెంట్ వీసా కావడంతో ఉద్యోగం చేయడానికి లేదు. 

     కొద్ది, కొద్దిగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒకరిద్దరు పరిచయం కావడంతో కాస్తా రాకపోకలు జరిగాయి. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు చూద్దామన్నా ఒక బుక్ కనిపించేది కాదు. మహా అయితే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ బుక్కులు తప్ప. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నా బుక్స్ చూసి, సూట్కేసుల్లో పప్పులు, చింతపండు, పార్టీ వేర్ లాంటి ముఖ్యమైన సామాన్లు వదిలేసి, బుక్స్ తెచ్చుకున్న మెంటల్ కేస్ nerdఅన్నట్టు వింతగా చూసేవారు. 

       పోనీ వాళ్ళకు బుక్స్ ఒకసారి రుచి చూపిస్తే, నెక్స్ట్ టైం ఇండియా కి వెళ్ళినప్పుడు వాళ్లే బుక్స్ తెచ్చుకుంటారు, అప్పుడు అవి నేను కూడా చదువుకోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసి, మీక్కావాలంటే ఏదైనా బుక్ తీసుకెళ్ళి చదువుకోండి అని ధారాళంగా ఆఫర్ ఇచ్చేదాన్ని. వాళ్ళేమో బుక్ చదివితే తలనొప్పి వస్తుందనో, లేదా టైం ఉండదనో, లేదా yawn, లేదా కాన్వెన్ట్స్ లో చదవడం వల్ల తెలుగు చదవడం రాదనో చెప్పేవాళ్ళే, కానీ ఒక్కరు కూడా నా వలలో పడలేదు sad.  అమ్మేమో పాపం, అమెరికాకు ఎవరైనా వస్తున్నారు అంటే నాకు బుక్స్ పంపాలని చూసేది. కానీ బుక్స్ చాలా బరువని అందరూ ఏదో ఒక సాకు చెప్పేసేవారు.

     ఇండియాలో లైబ్రరీలతో అస్సలు పరిచయం లేకపోడంతో ఇక్కడ లైబ్రరీలు ఉంటాయి, వాటికి వెళ్దాము అనే ఆలోచన కూడా వచ్చేదికాదు. నా బాధ చూడలేక భాస్కర్ ఒక తెలుగు కొలీగ్ ని ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయా, అని  అడిగినప్పుడు, తను తెలుగు బుక్స్ అని మెన్షన్ చెయ్యకపోడంవల్ల, ఆ కొలీగ్ లైబ్రరీ కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. అలా ఒక శనివారం పొద్దున్న భాస్కర్ నన్ను సర్ప్రైజ్ చేద్దామని ఫ్రీమాంట్ లైబ్రరీ కి తీసుకెళ్ళాడు. 

   ఈ లింక్స్ పైన క్లిక్ చేసి ఆ లైబ్రరీ ఫోటోస్ చూడండి :

1) http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#H4x_44VJ87JKgm6lr-SqDw
 

2)  http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#rujp_-OPzVV76t3CLKbCxg



    భలే వుంది కదూ. అన్ని బుక్స్ ఒక్క దగ్గర చూసి ఎంత ఆనందమేసిందంటే, ఇక ఆ వారం ఫోన్ కాల్ లో అమ్మకు అన్నీ లైబ్రరీ విషయాలే. (to be contd...)


Sunday, January 19, 2014

లైబ్రరీలు-1

అమెరికా కి వచ్చాక, నాకు ఇండియాలో ఉన్నప్పుడు పుస్తకాలపైన ఉన్న పిచ్చి ఏమీ తగ్గలేదు సరికదా, అప్పుడు చదవని ఇంగ్లీష్ బుక్స్ ఇక్కడ చాలా ఈజీగా లైబ్రరీలలో దొరకడం వల్ల ఇంకాస్తా పెరిగింది. 

     ఇండియాలో ఉన్నప్పుడు ఏ లైబ్రరీ చూసిన గుర్తు లేదు. ఇంట్లో అమ్మ, అత్తా వీళ్ళంతా కొని దాచుకున్న బుక్సే చదివేదాన్ని.అమ్మ దగ్గర ఎన్ని బుక్స్ ఉండేవంటే ఇల్లు మారేటప్పుడు 3 పెద్ద ప్రత్యేకంగా చేయించిన చెక్కపెట్టల నిండా ఉండేవి. సామాన్లు మార్చడానికి వచ్చినవాళ్ళు ప్రతిసారీ ఏ ఊర్లో అయినా ఆ మూడు పెట్టలు ఎత్తడానికి అష్ట కష్టాలు పడేవారు.ఇవి కాక ఇంకా వారం వారం వచ్చే ప్రతి ఒక్క వీక్లీని మా పేపర్ అతను అమ్మకి రెంట్ కి ఇచ్చేవాడు. అంటే అన్ని మాగజైన్స్ కొనే అవసరం లేకుండా, ఈరోజు రిలీజ్ అయ్యే పత్రిక అమ్మకిస్తే, అమ్మ చదివేసి నలపకుండా జాగ్రత్తగా రేపు తిరిగిచ్చేసేది. దీనివల్ల మాకు నమిలి మింగడానికి బుక్స్ కొరతే ఉండేది కాదు :)

      2-3 యేళ్లకి ఒకసారి నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారుతుంటే, అమ్మకున్న సవాలక్ష చింతల్లో ఇలా బుక్స్ ఇచ్చేవాళ్ళు కొత్త ఊర్లో ఉంటారా, లేదా, అనే ఐటం మొదటి 10 ప్లేసుల్లో వుండేది. నాకు గుర్తు ఉన్నంతవరకు, దేవుడి దయవల్ల ఈ కార్యక్రమానికి ఎప్పుడూ ఆటంకం కలగలేదు. అమ్మనుండి నాకు ఈ పిచ్చి వారసత్వంగా రావడంతో, మా మామా వాళ్ళందరూ నన్ను పుస్తకాల పురుగని,  నేను పెద్దయ్యాక వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, భూత్ బంగళాలలో ఉన్నట్టు బూజులని చేత్తో తీసుకుంటే వస్తే, ఏదో ఒక మూల రూంలో కిటికీ ఎక్కి ఒక బుక్ పట్టుకొని నేను కనిపిస్తానని జోకులు వేసుకునే వాళ్ళు raised eyebrows

     అమెరికాకి వచ్చేటప్పుడు నేను మొదట కూర్చుంది అమ్మ పుస్తకాల అలమరా ముందు. చాలా కష్టపడి ఒక 20 పుస్తకాలతో సర్దుకొని ఫ్రీమాంట్ కి   వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఒకరోజు పొద్దున్నే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాం. అక్కడ స్టేషన్ లో ప్లాట్ఫాం మీద వెయిట్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎంత ఆశ్చర్యమేసిందో, అంత ఆనందంగా అనిపించింది. అక్కడ లైన్లో నిలబడ్డ దాదాపు అందరి చేతుల్లో బుక్స్ applause 
అప్పుడే అనిపించింది this is my kinda place అని. తర్వాత ట్రైన్ లో కూడా అంతే, సీట్ దొరికిన వాళ్ళు, దొరక్క నిలబడ్డ వాళ్ళు చాలామంది చేతుల్లో బుక్సే. ఇది టాబ్లెట్స్ స్వైరవిహారం చేయని పాత కాలం సంగతి. (to be contd...)  

Saturday, January 18, 2014

ఈయనని మనిషే అందామా, లేక మహర్షి అందామా ?

మన కడుపు నిండినా, పక్కవాళ్ళ ఆకలి పట్టించుకోని వాళ్ళం,
ఏడాదికో, రెండేళ్ళకో పిల్లికి బిచ్చం పెట్టి దానకర్ణులని లోకమంతా పొగడాలనుకునే వాళ్ళం,
కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా, ప్రపంచం అంతా ఆగి సానుభూతి చూపాలనుకునేవాళ్ళం,

మనమంతా మనుషులమే అయితే, మరి... 

కడుపున పుట్టిన చిరునవ్వుల చిట్టి పాపలు, కలిసి మెలిసి జీవితాంతం నడవాల్సిన తోడు,
ఏ ఉన్మాదో చేసిన ఉగ్రవాద చర్యకు అసహాయంగా బలైపోతే 
జన్మంతా తగలబడిపోయే కన్నీళ్ళ కార్చిచ్చుని 
ఎన్నో ఇళ్ళ ముంగిళ్ళకి కాంతి కిరణాలుగా, 
మరెంతో మంది చిట్టి శారదల కలల ప్రమిదలుగా 
వెలిగించిన మహానుభావుడు... 

ఈయనని మనిషే అందామా, లేక మహర్షి అందామా ??

డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి 
( Video - CNN-IBN Real Heroes Awards 2010)
డా. చంద్రశేఖర్ గారి గురించి నేను తెలుసుకున్నది దంతులూరి కిషోర్ వర్మ గారి ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారానే 

"సేవే మార్గం - సంకురాత్రి చంద్రశేఖర

మీకు వీలైతే ఈ మహా మనిషి చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందించాలనుకుంటే , ఈ వెబ్ సైట్ చూడండి

www.sankurathri.org

రాసలీల వేళ... రాయబారమేల

బాలకృష్ణ సినిమాల్లో పాటలకు పెద్ద ఫ్యాన్స్ ఉండరు,నాకు తెలిసి. ఎందుకంటే ఆయన సినిమాల్లో మిగతా విషయాలకు ఉన్న ప్రాముఖ్యత, సంగీతానికి ఉండదు. వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని పాటలే గుర్తు ఉన్నాయి నాకు కూడా, ఆయన సినిమాల్లో.

ఆదిత్య 369 సినిమాలో "జాణవులే... నెర జాణవులే" పాట మీరు వినే వుంటారు. ఇదే సినిమాలోని "రాసలీల వేళ... రాయబారమేల" పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. అఫ్కోర్స్ , మ్యూజిక్ ఇళయరాజా గారిది కాబట్టి అది కూడా ఒక పెద్ద కారణమే అనుకోండి big grin   బాలకృష్ణ గారు కూడా చాలా యంగ్ గా, ఒక ఫ్రెష్ లుక్ తో ఉంటారు ఈ పాటలో. చూడడం కొంతమందికి ఇబ్బందిగానే ఉండవచ్చు, ఎందుకంటే మొదటి చరణం లో ఇది ఆనాటి తెలుగు సినిమాల్లోని quintessential వాన పాట రూపంలోకి మారుతుంది కాబట్టి smug 

కానీ చూడకుండా వింటే, ఎవరైనా సరే జానకి గారి స్వరంతో మళ్ళీ మరోసారి (లక్షోసారి??)  పీకల్లోతు ప్రేమలో పడి తీరుతారని నాదీ హామీ . మొదటి చరణానికి , రెండో చరణానికి మధ్య వచ్చే ఫ్లూట్ బిట్ వింటే... ఆహా day dreaming



చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
చూపు ముళ్ళ ఓపలేను కలల తలుపు తీయనా - See more at: http://www.lyricsintelugu.com/2010/04/raasaleela-vela-song-lyrics-in-telugu.html#sthash.3quKDTJE.dpuf
చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
చూపు ముళ్ళ ఓపలేను కలల తలుపు తీయనా - See more at: http://www.lyricsintelugu.com/2010/04/raasaleela-vela-song-lyrics-in-telugu.html#sthash.3quKDTJE.dpuf

Friday, January 17, 2014

సుచిత్రా సేన్

సుచిత్రా సేన్ ని నేను మొదటగా చూసింది టివిలో వచ్చిన ఆంధీ సినిమాలో . అప్పటికి సంజీవ్ కుమార్ లేకపోయినా, ఆయన గురించి విన్న విషయాల వల్ల ఆయన అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకని ఆ సినిమాలో మొత్తం ఫోకస్ అంతా ఆయన పైనే. సుచిత్రా సేన్ చాలా అందగత్తె అని విని, అంత అందంగా ఏమీ లేదే అనుకోడం మాత్రం గుర్తు. 

        తర్వాత ఎప్పుడో నాకెంతో ఇష్టమైన గుల్జార్ "తుమ్  పుకార్  లో", 
"హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోం కి మెహక్ తీ ఖుష్బూ" పాటలు  ఉన్న ఖామోషి కి మాతృక అని విని, సుచిత్రా సేన్ నటించిన బెంగాలీ సినిమా "దీప్ జ్వలే జాయ్ " లో పాటలు చూసాను.అచ్చు మూన్ మూన్ సేన్ లాగానే అనిపించింది ఆ పాటలు చూస్తుంటే. 

    ఆ బెంగాలీ సినిమాలోని ఈ పాట 




ఈ పాట ఇంకో హిందీ సినిమాలో వుంది. అది ఏ పాటో తెలుసా ?

ఆంధీ సినిమా చూసినా చూడకపోయినా, ఈ పాట వినని సినీ ప్రేక్షకులు ఉండరని నా నమ్మకం. సుచిత్రా సేన్ తో పాటు హరీభాయి ని కూడా చూసేయండి. 




Thursday, January 16, 2014

గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్

నేను మామూలుగా ఇంగ్లీష్ సినిమాలు పెద్ద చూడను, కార్టూన్ ఫిల్మ్స్ లేదా "IP man" లాంటి మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్ అయితే తప్ప.ఒక బద్ధకపు శనివారం  పొద్దున టివీ ఛానల్స్ మారుస్తూ ఉంటే ఒక దగ్గర ఈ సినిమా వస్తూ ఉండింది. ఆ సీన్ లో జోయనా (కాథరిన్ హాటిన్),తన తల్లి క్రిస్టినా (కాథరిన్ హెప్ బర్న్) తో డాక్టర్ ప్రెంటిస్ (సిడ్నీ పాయిటర్ ) గురించి మంచి పరిచయం ఇచ్చి, అతనిని ఆమె ముందుకు తెచ్చేటప్పటికి , ఆమె షాక్ తినే సీన్. ఆ సీన్ తర్వాత ఇక ఆ మూవీ మొత్తం అయిపోయేదాకా కదలలేదు నేను. 

     కథగా చెప్పాలంటే శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండే మాట్ డ్రేటన్, క్రిస్టినా ల కూతురు జోయానా హవాయీ కి వెకేషన్ కి అని వెళ్లి, అక్కడ 10 రోజుల్లో డాక్టర్ ప్రెంటిస్ తో ప్రేమలో పడి అతనిని తన కుటుంబానికి పరిచయం చేయడానికి తీసుకుని వస్తుంది. డాక్టర్ ప్రెంటిస్ అన్ని విధాలా తగిన వాడే , కానీ అతనిని చూసేదాకా ఆ తల్లికి అర్ధం కాదు, అసలు సమస్య ఏమిటో. డాక్టర్ ప్రెంటిస్ ఒక ఆఫ్రికన్-అమెరికన్. ఈనాటి సమాజంలో కూడా అరుదుగా జరిగే ఇంటర్ రేషియల్  మారేజ్ ఆ కథాకాలమైన 1967 లో ఇక ఎంత అనూహ్యమైన సంఘటనో ఆలోచించండి. జోయానా మాత్రం తన తల్లితండ్రులకు అలాంటి సంకుచిత భావాలేవీ లేవని , అసలు ఆ ఆలోచనే రాకుండా డాక్టర్ ని ఇంటికి తీసుకొని వచ్చినా, లోకజ్ఞానం ఉన్న డాక్టర్ మాత్రం వాళ్ళతో చెప్పుతాడు, మీకు నచ్చకపోతే ఈ పెళ్లి జరగదు అని. కానీ తను స్విట్జర్లాండ్ కి ఆ సాయంత్రమే వెళ్తున్నందున , ఆ రోజే ఏ విషయం తేల్చి చెప్పమని అడుగుతాడు. అంతలో అతని తల్లి,తండ్రులు కూడా కాబోయే కోడలిని చూడ్డానికి వచ్చి ఆ అమ్మాయిని చూసి తెల్లబోతారు . తరవాత ఏమవుతుందో వెండి తెర మీదే (లేదా బుల్లి తెర) చూడండి.

    నటీ,నటులలో నాకు ముఖ్యంగా నచ్చింది సిడ్నీ పాయిటర్. తను ఎంత poised గా ఆ పాత్ర పోషించాడో. అమ్మాయి ఇష్టపడింది కదా అనే కాకుండా, వాళ్ళ పెద్దవాళ్ళ వైపునుండి కూడా ఆలోచించే అతి మంచి అబ్బాయిగా తన నటన భలే నచ్చింది. ఇక తల్లి పాత్రలో నటించిన కాథరిన్ హెప్ బర్న్ఈ సినిమాలో తన నటనకు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. 
  
     ఈ రోజు A Raisin in the Sun గురించి చదువుతుంటే ఈ మూవీ గురించి రాయాలనిపించింది . టైం దొరికితే తప్పక చూడండి , మంచి సినిమా. 

   ఇందులోనుండి నేను పైన చెప్పిన సీను...

Wednesday, January 15, 2014

ఈ కథలు చదివారా?

ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ లో ఈ కథలు చదివారా?

మనుషులపైన  నమ్మకం పోగట్టుకోడం, డబ్బు విషయం రాగానే అంతవరకూ ఎదుటి మనిషి మనకోసం పడిన తపన, చేసిన సహాయాలు మరచిపోవడం అనేవి ఎంత అసంకల్పితంగా జరుగుతాయో, అదే సమయంలో మన ఆలోచనని సరి చేసే ఒక్క మాట వింటే మన బుద్ధి ఎలా దారికి వస్తుందో బాగా చెప్పిన కథ. ఈ వారం నాకు నచ్చిన కథ. 

    ఓలేటి శ్రీనివాస భాను గారి " ఇదేన్రీ..హింగాయుతూ "

ఈ రెండో కథ ఇంచు మించు ఈ మధ్యే నేను చూసిన నిజానికి అక్షర రూపం. నిజ జీవితంలో, కథలో చివర జరిగే సంఘటన జరగక పోవడం వల్ల ఆ గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. 

   సలీం గారి "నీటి బుడగలు"

  ఈ సలీం గారు కాలుతున్న పూలతోట రచయిత సలీం గారేనా ?

మీరు ఈ కథలు చదివారా ? నచ్చాయా , లేదా?

Tuesday, January 14, 2014

మీరైతే ఏ పాటలు సెలెక్ట్ చేసుకుంటారు?

ఇందాక యాహూ లో ఏదో ఆర్టికల్ చదువుతూ, దానితో పాటు "15 Perfect Songs for Your Speed Workout Playlist" అనే ఈ ఆర్టికల్ కూడా చూసాను. దీని ప్రకారం మనం  వర్కవుట్ చేసేటప్పుడు వినే పాటల్లోని బీట్, మన వాకింగ్ లేదా రన్నింగ్ స్పీడ్ నిలకడగా ఉంచుకోడానికి సహాయం చేస్తుందంట. ఈ లిస్టు చూసిన తర్వాత ఇలాంటి లిస్ట్ నేనొకటి చెయ్యాలంటే ఏ పాటలు ఎంచుకుంటాను అని ఆలోచించా thinking
 
      కొన్ని పాటలు తట్టాయి. నా బ్లాగ్ చదివిన వారికి ,నా ప్రొఫైల్ చూసిన వారికి, నేను ఇళయ రాజా గారికి అతి పెద్ద పంఖాని అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ పాటలన్నీ ఆయన స్వర పరిచినవే. ఇళయ రాజా గారి పాటల్లో కొన్ని పాటలు ఎంచుకోడం ఎంత కష్టం... ఎంత కష్టం confused

     మరి మీరైతే ఏ పాటలు సెలెక్ట్ చేసుకుంటారు?
 

మొదటగా అన్నిటికన్నా ఫాస్ట్ పాటలు  - 3

1. 





2.


 3.

 4.

 



మిగతా పాటలు రేపు ....

Sunday, January 12, 2014

ఐతజాజ్ హసన్ బంగాష్

చాలామంది నిన్న ఐతజాజ్ గురించి వార్త చదివే వుంటారు. చదవనివారి కోసం...ఐతజాజ్ పాకిస్తాన్లోని ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని హంగు జిల్లాకు చెందిన 14 యేళ్ళ అబ్బాయి. కిందటి సోమవారం ఆ అబ్బాయి స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం లో ఉన్న సూయిసైడ్ బాంబర్ ఆ అబ్బాయిని స్కూల్ అడ్రస్స్ అడగడంతో అనుమానపడి, ఆ బాంబర్ ని రాళ్ళతో కొట్టి తరమడానికి ప్రయత్నించి, అది వీలుకాక, పెనుగులాడి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

        ఈ వార్త చదివిన దగ్గర్నుండి ఒకటే ఆలోచన. ఐతజాజ్ తనేం చేస్తున్నాడో తెలిసే చేసివుంటాడా? తెలిసి, తెలిసి ఒక టీనేజ్ లో ఉన్న అబ్బాయి, తన ప్రాణాలను అంత బేఖాతరుగా పణం పెట్టగలడా? అనుమానంతో తనతో పాటు ఉన్న స్నేహితులు దూరం జరుగుతోంటే, ఆ నిముషంలో తనేమనుకొని ఉంటాడు? తల్చుకుంటుంటే కడుపులో బాధగా ఉంది.  ఒకవేళ ఐతజాజ్ కి కనుక అనుమానం రాకపోయినా, ఆ బాంబర్ ని ఆపలేకపోయినా, ఆ స్కూల్ లోని 1000 మంది పిల్లల పరిస్థితి తల్చుకుంటేనే భయంగా ఉంది. 

        కానీ...ఐతజాజ్ వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున స్కూల్ కి వెళ్తుంటే ఏమని చెప్పి ఉంటారు? మనకులాగే...జాగ్రత్తగా వెళ్ళు, స్కూల్లో చెప్పింది శ్రద్ధగా విను అనేకదా. పొద్దున అలిగో, పోట్లాడో, నవ్వుతూనో, ఏదో కావాలి అని గొడవ చేసో వెళ్ళిన పిల్లాడు, ఇక ఎన్నటికి తిరిగిరాడని తెలిసిన క్షణాన వాళ్ళు కన్నీటి సంద్రాలైపోయి ఉంటారు కదా.

         అకాల మరణం ఎవరిదైనా బాధాకరమే. కానీ ఇలా తమ తప్పేమి లేకుండా, కొంతమంది మానవత్వం లేని మనుషుల చర్యలవల్ల ప్రాణాలు పోగట్టుకున్న పిల్లల గురించి విన్నప్పుడు, మనుషుల మధ్యే ఉన్నామా అని అనుమానం వస్తుంది.   


CNN లో ఈ వార్త: http://www.cnn.com/2014/01/11/world/asia/pakistan-boy-bravery-award/

సంక్రాంతి శుభాకాంక్షలు

ఏదైనా పండగకు "శుభాకాంక్షలు" అని రాస్తుంటే, "పాఠకులకు, ప్రచురణ కర్తలకు శుభాకాంక్షలు" అని ఈనాడూ పేపర్ లో వేసేది గుర్తు వస్తుంది. చిన్నప్పుడు "పండగ శుభాకాంక్షలు", లేదా "హాప్పీ పొంగల్" (I just hate the mass "happy..." messages in cellphones) అని ఎవరికి చెప్పినట్టు గుర్తు లేదు. ఎవరి మొహంలో చూసినా ఆ పండగ సంతోషం కనిపించేది. అది పండగకు మా ఇంటికి వచ్చే నూర్ అంకుల్ మొహంలో అయినా, రంజాన్ కి షమ్షాద్ ఆంటీ చేసే బిర్యాని, ఖీర్ తినడానికి వెళ్ళినప్పుడు నా మొహంలో అయినా...



 

Saturday, January 11, 2014

చిన్ని, చిన్ని ఆనందాలు

ఒక్కోసారి చిన్న, చిన్న విషయాలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా. నిన్న ఏదో పని మీద బయటకు వెళ్తూ, కార్ స్టార్ట్ చేయగానే రేడియో లో ఈ పాట వేసారు.






ఆ ప్రోగ్రాం "రాత్" అనే పదం వచ్చే పాటల గురించి అనుకుంటా.

మొదటి పాట అయిపోగానే ఈ పాట.



మనం యూట్యూబ్ లో నో, ఏదో ఒక వెబ్ సైట్లోనో, లేదా సీడీల్లోనో మనకు ఇష్టమైన పాటలు ఎప్పుడైనా వినవచ్చు. కానీ రేడియోలో మనకు ఇష్టమైన పాటలు వస్తే భలే ఆనందమేస్తుంది కదూ :) 

ఈ రెండు పాటలు వినగానే 90'ల్లో నేను చూసిన హైదరాబాద్ గుర్తు వస్తుంది. అప్పటికింకా పూర్తిగా మహానగరీకరణ చెందని హైదరాబాద్. ఆ గుల్ మొహర్ చెట్లు, ఆ చిన్న చిన్న గలీలు, ఇరానీ చాయ్, విజయనగర్ కాలనీ లో నేను కొన్నాళ్ళూ గడిపిన ఒక అందమైన ఇల్లు...ఓహ్. ఆ నాటి హైదరాబాద్లో ఒక ఎనిగ్మా...నఖాబ్ వేసుకున్న అమ్మాయి ముఖంలా.
ఇప్పటి హైదరాబాద్ లో అప్పటి అందమేదీ కనిపించదు, ఎందుకనో ??

Friday, January 10, 2014

కొత్త ప్రారంభం

చాన్నాళ్ళ తర్వాత ఇవ్వాళ ఎందుకో బ్లాగ్ గుర్తు వచ్చింది. కొత్త సంవత్సరంలో ఏ రిజల్యూషన్స్ చేసుకోలేదు,కాబట్టి బ్లాగ్లో అప్పుడప్పుడూ నేను చదివిన పుస్తకాల పైన, విన్న పాటలపైన, చూసిన సినిమాలపైన అభిప్రాయాలు రాద్దామని అనుకుంటున్నాను.

ముందుగా...గత రెండు సంవత్సరాలుగా మనసంతా చికాగ్గా ఉండేది. పెద్ద కష్టాలు కాదు కానీ, చిన్న చిన్న చిరాకులైతే ఉండేవి. 2013 లో ఈ చిరాకులన్నీ తీరిపోయాయి. రోజూ చూస్తూనే ఉంటాం, చుట్టూ ఉన్నవాళ్ళలో ఎంతమంది, వాళ్ళ స్వయంకృతమో, ప్రారబ్ధమో కానీ, తెలిసో/తెలియకుండానో సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుని మునిగిపోతుండడం. కొంతమంది ఆ సమస్యలనుండి బయటపడి ఒడ్డుకి చేరగలరు, కొంతమంది మధ్యలోనే ఈదడం మానేస్తారు.

అలాంటి మునిగిపోయే సుడిగుండాల్లో పడకుండా నా చేయి పట్టుకుని ఈ భవసాగరాన్ని దాటిస్తున్న భగవంతునికి మనసారా వేల, వేల కృతజ్ఞతలు. 

నాకు అతి ఇష్టమైన రెండు భక్తిగీతాలు...