Saturday, January 11, 2014

చిన్ని, చిన్ని ఆనందాలు

ఒక్కోసారి చిన్న, చిన్న విషయాలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా. నిన్న ఏదో పని మీద బయటకు వెళ్తూ, కార్ స్టార్ట్ చేయగానే రేడియో లో ఈ పాట వేసారు.






ఆ ప్రోగ్రాం "రాత్" అనే పదం వచ్చే పాటల గురించి అనుకుంటా.

మొదటి పాట అయిపోగానే ఈ పాట.



మనం యూట్యూబ్ లో నో, ఏదో ఒక వెబ్ సైట్లోనో, లేదా సీడీల్లోనో మనకు ఇష్టమైన పాటలు ఎప్పుడైనా వినవచ్చు. కానీ రేడియోలో మనకు ఇష్టమైన పాటలు వస్తే భలే ఆనందమేస్తుంది కదూ :) 

ఈ రెండు పాటలు వినగానే 90'ల్లో నేను చూసిన హైదరాబాద్ గుర్తు వస్తుంది. అప్పటికింకా పూర్తిగా మహానగరీకరణ చెందని హైదరాబాద్. ఆ గుల్ మొహర్ చెట్లు, ఆ చిన్న చిన్న గలీలు, ఇరానీ చాయ్, విజయనగర్ కాలనీ లో నేను కొన్నాళ్ళూ గడిపిన ఒక అందమైన ఇల్లు...ఓహ్. ఆ నాటి హైదరాబాద్లో ఒక ఎనిగ్మా...నఖాబ్ వేసుకున్న అమ్మాయి ముఖంలా.
ఇప్పటి హైదరాబాద్ లో అప్పటి అందమేదీ కనిపించదు, ఎందుకనో ??

2 comments:

  1. I grew up in Costal andhra. Don't know Urdu..
    Bunked Hindi classes..regret now for not learning any Hindi..
    Beautiful beautiful songs and composition, especially the first one.
    Don't know how many times i listened and enjoyed without knowing the meaning
    thanks for uploading.

    ReplyDelete
    Replies
    1. నేను కూడా మీకులాగే హిందీ క్లాసెస్ లో సరిగ్గా వినేదాన్ని కాదు :)
      కానీ థాంక్స్ టు మా అమ్మ, నన్ను మూడో క్లాస్ లోనే ప్రాథమిక పరీక్ష రాయించి హిందీ నాకు రెండో మాతృభాష లాగా అలవాటు చేసింది. దాంతో పాటు ఇంటి చుట్టు వుండే ముస్లింస్, అమ్మ, నాన్న ఎంతో ఇష్టంగా విని పాడుకునే హిందీ పాటలు, వీటన్నటివల్లా నాకు తెలుగు సినిమాలు, పాటలకన్నా, హిందీ పాటలతో అనుబంధం ఎక్కువ.

      Thanks for taking time to read & comment on my post.

      Delete