నాగేశ్వర రావు గారు ఇక లేరు... ఇప్పుడే ఈనాడు లో ఈ వార్త చూసాను. ఆయనది పెద్ద వయసే, ఆరోగ్యం కూడా బాగా లేదని ఈ మధ్య వింటూనే ఉన్నాము. అయినా ఆ మాట చదవగానే మనసులో బాధ... చిన్నప్పటినుండి తెలిసిన వారెవరో వెళ్లిపోయినట్లు. చిన్నప్పుడు నేను ఎన్టీయార్ గారి వీరాభిమానిని. అందుకని ఎవరైనా ఏఎన్నార్ గారి ఫాన్స్ అంటే ఓ...వెక్కిరించేదాన్ని. అందుకే ఈరోజు ఈ బాధ నాకే విచిత్రంగా అనిపిస్తోంది. ఏమైతేనేం తెలుగు సినిమాలో ఒక శకం సగం ఎన్టీయార్ గారి మరణం తో ముగిసిపోతే, మిగిలిన సగం ఇవాళ ముగిసిపోయింది.
ఆయన నాస్తికులని తెలుసు. కానీ నేను నమ్మే భద్రగిరి రామయ్య ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.
ఆయన నాస్తికులని తెలుసు. కానీ నేను నమ్మే భద్రగిరి రామయ్య ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.
నా మనసులోని మాటలే మీరు వ్రాసినారు.
ReplyDeleteనిజంగా చాలా బాధగా వుంది, లక్ష్మీదేవి గారు :(
ReplyDelete