Thursday, January 16, 2014

గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్

నేను మామూలుగా ఇంగ్లీష్ సినిమాలు పెద్ద చూడను, కార్టూన్ ఫిల్మ్స్ లేదా "IP man" లాంటి మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్ అయితే తప్ప.ఒక బద్ధకపు శనివారం  పొద్దున టివీ ఛానల్స్ మారుస్తూ ఉంటే ఒక దగ్గర ఈ సినిమా వస్తూ ఉండింది. ఆ సీన్ లో జోయనా (కాథరిన్ హాటిన్),తన తల్లి క్రిస్టినా (కాథరిన్ హెప్ బర్న్) తో డాక్టర్ ప్రెంటిస్ (సిడ్నీ పాయిటర్ ) గురించి మంచి పరిచయం ఇచ్చి, అతనిని ఆమె ముందుకు తెచ్చేటప్పటికి , ఆమె షాక్ తినే సీన్. ఆ సీన్ తర్వాత ఇక ఆ మూవీ మొత్తం అయిపోయేదాకా కదలలేదు నేను. 

     కథగా చెప్పాలంటే శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండే మాట్ డ్రేటన్, క్రిస్టినా ల కూతురు జోయానా హవాయీ కి వెకేషన్ కి అని వెళ్లి, అక్కడ 10 రోజుల్లో డాక్టర్ ప్రెంటిస్ తో ప్రేమలో పడి అతనిని తన కుటుంబానికి పరిచయం చేయడానికి తీసుకుని వస్తుంది. డాక్టర్ ప్రెంటిస్ అన్ని విధాలా తగిన వాడే , కానీ అతనిని చూసేదాకా ఆ తల్లికి అర్ధం కాదు, అసలు సమస్య ఏమిటో. డాక్టర్ ప్రెంటిస్ ఒక ఆఫ్రికన్-అమెరికన్. ఈనాటి సమాజంలో కూడా అరుదుగా జరిగే ఇంటర్ రేషియల్  మారేజ్ ఆ కథాకాలమైన 1967 లో ఇక ఎంత అనూహ్యమైన సంఘటనో ఆలోచించండి. జోయానా మాత్రం తన తల్లితండ్రులకు అలాంటి సంకుచిత భావాలేవీ లేవని , అసలు ఆ ఆలోచనే రాకుండా డాక్టర్ ని ఇంటికి తీసుకొని వచ్చినా, లోకజ్ఞానం ఉన్న డాక్టర్ మాత్రం వాళ్ళతో చెప్పుతాడు, మీకు నచ్చకపోతే ఈ పెళ్లి జరగదు అని. కానీ తను స్విట్జర్లాండ్ కి ఆ సాయంత్రమే వెళ్తున్నందున , ఆ రోజే ఏ విషయం తేల్చి చెప్పమని అడుగుతాడు. అంతలో అతని తల్లి,తండ్రులు కూడా కాబోయే కోడలిని చూడ్డానికి వచ్చి ఆ అమ్మాయిని చూసి తెల్లబోతారు . తరవాత ఏమవుతుందో వెండి తెర మీదే (లేదా బుల్లి తెర) చూడండి.

    నటీ,నటులలో నాకు ముఖ్యంగా నచ్చింది సిడ్నీ పాయిటర్. తను ఎంత poised గా ఆ పాత్ర పోషించాడో. అమ్మాయి ఇష్టపడింది కదా అనే కాకుండా, వాళ్ళ పెద్దవాళ్ళ వైపునుండి కూడా ఆలోచించే అతి మంచి అబ్బాయిగా తన నటన భలే నచ్చింది. ఇక తల్లి పాత్రలో నటించిన కాథరిన్ హెప్ బర్న్ఈ సినిమాలో తన నటనకు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. 
  
     ఈ రోజు A Raisin in the Sun గురించి చదువుతుంటే ఈ మూవీ గురించి రాయాలనిపించింది . టైం దొరికితే తప్పక చూడండి , మంచి సినిమా. 

   ఇందులోనుండి నేను పైన చెప్పిన సీను...

4 comments:

  1. 1970-71 లో చూసాను ధియేటర్లో. Great movie.

    ReplyDelete
    Replies
    1. Thanks for visiting and commenting on my blog, విన్నకోట నరసింహా రావు గారు.

      అవునండీ , చాలా మంచి సినిమా. ఎలాంటి హడావిడి లేకుండా, చెప్పాలనుకున్న విషయాన్ని డైరక్టర్ స్టాన్లీ క్రామెర్ సూటిగా, హాస్యాన్ని రంగరించి ఎంత బాగా చెప్పారో. ఆయన మాటల్లోనే ఆయన తీసే సినిమాల గురించి : "I tried to make movies that lasted about issues that would not go away."

      నిజంగానే ఈ ఇష్యూ ఇంకా పోయిందని నేననుకోను. ఇప్పుడు అలాంటి జంట కనిపిస్తే విచిత్రంగా చూడకపోవచ్చు , కానీ ఈనాటి అమెరికన్ సమాజంలో కూడా ఇంటర్ రేస్ మారేజస్ చాలా తక్కువగా కనిపిస్తాయి.

      Delete
  2. అయితే ఈ సినిమా చూడాలన్నమాట! సిడ్నీ పాయిటర్ నటన నాక్కూడా ఇష్టమండి. ఎంత బాగా చేస్తాడో! ఇదివరకూ అతనిది పేచ్ ఆఫ్ బ్లూ అనే చిత్రం గురించి రాసాను. అది చూశారా మీరు? చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది.
    నా పోశ్ట్ లింక్:
    http://trishnaventa.blogspot.in/2010/01/patch-of-blue.html

    ReplyDelete
    Replies
    1. తప్పక చూడండి తృష్ణ. You will not be disappointed.

      Delete