Friday, June 29, 2012

కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమహారం

1980-90లలో తెలుగు సినిమా పరిశ్రమలో ఇళయరాజా గారు దాదాపు అందరు హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించారు. కొంతమంది హీరోలకు చాలా సినిమాలు చేసారు , మరికొంతమంది హీరోలకు తక్కువ సినిమాలు చేసారు. ఆ టైమ్ లో శోభన్ బాబు గారి రెండు సినిమాలకు (నాకు తెలిసి) కూడా ఇళయరాజాగారు సంగీత సారధ్యం వహించారు.  

ఒక సినిమా చాలామందికి తెలిసిన "రాజ్ కుమార్ ". ఈ సినిమాలో "జానకి కలగనలేదు" పాట చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇదే సినిమాలో ఉన్న "తొలి చూపు చెలి రాసిన శుభలేఖ " పాట నాకు చాల ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాట బాలు, జానకిగార్ల  మధురమైన గళాలకు, ఇళయరాజాగారి అద్భుతమైన సంగీతానికి ఒక మచ్చు తునక. ఈ పాట ఇంతకుముందు విని ఉండకపోతే తప్పక వినండి. 



 


 ఇంతకీ ఆ రెండో సినిమా పేరు మీకు తెలుసా ? అయితే చెప్పేయండి :)


Monday, June 4, 2012

సంగీతానికి, స్వరానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఎన్నెన్నో మధుర గీతాల సృష్టికర్తలు ఇళయరాజా , బాలుగార్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని వందల గొప్ప పాటలలో , నాకిష్టమైన (మామూలుగా వినపడని)  కొన్ని పాటలు...


పువ్వై పుట్టి పూజే చేసి పోనీ..రాలి పోనీ... పువ్వుగా ప్రాణాలు పోనీ..తావిగా నన్నుండిపోనీ (ఈ పాట అన్నిటికన్నా ఇష్టమైన పాట)

ఈ పాట తమిళం లో ఇక్కడ చూడచ్చు 





అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (నా ఆల్ టైం ఫేవరేట్ సాంగ్)    




Sunday, June 3, 2012

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఎన్నిసార్లు విన్నా తనివి తీరని, మనసు నిండని పాట...
మూడు భాషలలో, ముగ్గురు గంధర్వులు , ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, కే. జే. ఏసుదాస్ గార్ల గళాలలో .
అన్ని పాటలు అంతే అద్భుతంగా వున్నాయి...కానీ బాలుగారి స్వరం పలికిన తెలుగు పాట మాత్రం కొంచెం ఎక్కువ అద్భుతంగా ఉంది కదూ... :)






 


Daddy - Hindi Movie


హైస్కూల్ లో ఉన్నప్పుడు  చూసాను ఈ సినిమా. ఇప్పటికీ ఈ పాటలు వింటుంటే అప్పటి సినిమాలు అన్నీ గుర్తు వస్తుంటాయి. ఎంత సింపుల్ గా, ఎంత మంచి సినిమాలు తీసేవారు.

సినిమా విషయానికి వస్తే మహేష్ భట్ డైరక్షన్ , పూజా భట్ మొదటి సినిమా. అనుపమ్ ఖేర్ (గుర్తు ఉన్నారా ??) సెన్సిటివ్ అండ్ సెన్సిబిల్ యాక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత పూజా భట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అనిపించింది, కానీ ఆ అమ్మాయి 3 , 4 మంచి సినిమాలు చేసి ఆ తర్వాత డైరక్షన్ సైడ్ వెళ్లిపోయినట్లుంది.


ఈ సినిమా ఇంతకుముందు   చూడకపోతే ఒకసారి ఈ పాట  చూడండి. తలత్ అజీజ్ పాటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్...   

ఆయినా ముఝ్ సే మేరీ పహ్లీ సీ సూరత్ మాంగే