Tuesday, November 30, 2010

కనుక్కోగలరా -3

ఈ పాట పల్లవి కనుక్కోగలరా :

వేసవిదారుల వేసటలోన వెన్నెలతోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి  నీవై నిలిచావు
ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిసావు
ఆలు మగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు

Saturday, November 27, 2010

తనికెళ్ళ భరణి గారితో "సాహితీ పంచామృతం"

మొన్నేమధ్యే వెండితెర వెండి పండుగ జరుపుకున్న తనికెళ్ళ భరణి గారు బే ఏరియా కు వస్తున్నారు. సిలికాన్ ఆంధ్రా వారు భరణిగారితో డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటలకు సన్నీవేల్ హిందూ దేవస్థానంలో " సాహితీ పంచామృతం" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింద చూడండి.

Tuesday, November 23, 2010

నాకు నచ్చిన సినిమా-Departures (Japanese)

 ఏమీ తోచక Netflix హోమ్ పేజ్ లో recommendations లో ఉన్న ఈ సినిమా పైన క్లిక్ చేసాను & I'm glad that I did.
కథ  ప్రధాన పాత్రధారి (Daigo)  తను టోక్యో నుండి సొంత ఊరికి ఎందుకు వస్తాడో చెప్పే స్వగతంతో   మొదలవుతుంది. Daigo టోక్యో లో ఒక ఆర్కెస్ట్రాలో చెల్లిస్ట్ (Cellist)  గా పని చేస్తుంటాడు. ఆ ఆర్కెస్ట్రా మూతపడడంతో  వాళ్ళ అమ్మ వదిలి వెళ్ళిన ఇంటిలో ఉందామని తన భార్యతో కలిసి స్వంత ఊరుకి వచ్చేస్తాడు.అక్కడ ఒక న్యూస్ పేపర్లో N.K Agency-"Departures" అని చూసి ఆ ఉద్యోగం ఏదో ట్రావెల్ ఏజన్సీ లో ఉద్యోగం అనుకోని వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది అది చనిపోయిన వాళ్ళని Casket లో పెట్టేముందు వాళ్ళని అందంగా తయారు చేసే పని అని.

అసహ్యంగా , భయంగా మొదలుపెట్టిన ఈ పని పట్ల  DaigO ఎంత ప్రేమ , గౌరవం పెంచుకుంటాడంటే  తన భార్య ఏవగించుకొని వెళ్ళిపోతున్నా వదిలేయలేనంతగా .

స్నేహితుని తల్లి చనిపోయినప్పుడు  అతను చేసే పని ప్రత్యక్షంగా చూసిన భార్య, స్నేహితుడు ఆ పని ఎంత గౌరవమైనదో , అతను ఎంత భక్తీ , శ్రద్ధలతో  ఆ పని చేస్తున్నాడో గమనిస్తారు.
తనని చిన్నపుడు వదిలిపోయిన నాన్న శవాన్ని తయారు చెయ్యడం , ఆ నాన్న తనని మరచిపోలేదని తెలుసుకోవడం ఆఖరి సీను.

ఎప్పుడూ clear గా గుర్తు రాని తన తండ్రి మొఖం , తను చిన్నప్పుడు ఇచ్చిన గులక రాయిని పిడికిలి లో బిగించి పట్టుకొని వున్న శవాన్ని చూసినప్పుడు గుర్తు వస్తుంది.

కథ తెలుసుకోవాలనుకొంటే కింద సినిమా పేరుపైన క్లిక్ చేస్తే వికిపీడియా లో చదవచ్చు.

మంచి మ్యూజిక్, జపాన్ లో ని ఒక చిన్న ఊరు,మంచు, చెర్రీ పూలు, అందమైన మనసులు, అన్నిటినీ మించి మనసుని తాకే కథ. ఈ హాలిడేస్ లో టైం దొరికితే తప్పకుండా చూడండి.

సినిమా యూట్యూబ్ లో కూడా వుంది.

ఈ సినిమా కు 2008 లో  Best Foreign language film ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ విషయం సినిమా చూసేసిన తర్వాతే చూసాను.ఆ  అవార్డ్ కి అన్ని అర్హతలూ వున్న సినిమా.
Movie: Departures
Director: Yōjirō Takita

Monday, November 22, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా-జవాబులు

1) ఐసీ రిం ఝిం  మే ఓ సజన్ ... ప్యాసే  ప్యాసే మేరే నయన్ తేరేహీ  ఖ్వాబో మే ఖోగయే
సావలీ సలోనీ ఘటా జబ్ జబ్ ఛాయీ 
అఖియో మే రైనా గయీ... నిందియా నా ఆయీ

ఇక్కడ చూడండి. 


2 ) ముఝ్ కో ఛూనే  లగీ ఉస్  కీ  పరచాయియా 
దిల్ కే నజ్దీక్ బజ్ తీ  హై షేహనాయియా 
మేరే సప్నో కే అంగన్ మే గాతా హై ప్యార్

ఇక్కడ చూడండి.

౩)చుప్  కే సీనే మే  కోయీ  జైసే  సదా  దేతా  హై 
షామ్  సే  పెహలె  దియా దిల్ కా  జలా  దేతా హై
హై ఉసీ కీ ఏ సదా హై ఉసీ కీ ఏ అదా 


ఇక్కడ చూడండి.

4)  ఏ బహార్ ఏ సమా కెహ్ రహా హై ప్యార్ కర్
కిసీకీ ఆర్జూ మే అప్నేదిల్ కో బేకరార్ కర్ 
జిందగీ హై బేవఫా లూట్ ప్యార్ కా మజా


5) హం కో మిలీ హీ ఆజ్ ఏ ఘడియా నసీబ్ సే
జీ భర్ కే దేఖ్ లీజియే హం కో కరీబ్ సే
ఫిర్ ఆప్ కే నసీబ్ మే ఏ బాత్ హో న హో

Saturday, November 20, 2010

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

చాలా మంచి  పాటలు , చాలా పాపులర్ పాటలు కూడా.
1) ఐసీ రిం ఝిం  మే ఓ సజన్ ... ప్యాసే  ప్యాసే మేరే నయన్ తేరేహీ  ఖ్వాబో మే ఖోగయే
సావలీ సలోనీ ఘటా జబ్ జబ్ ఛాయీ 
అఖియో మే రైనా గయీ... నిందియా నా ఆయీ


2 ) ముఝ్ కో ఛూనే  లగీ ఉస్  కీ  పరచాయియా 
దిల్ కే నజ్దీక్ బజ్ తీ  హై షేహనాయియా 
మేరే సప్నో కే అంగన్ మే గాతా హై ప్యార్


౩)చుప్  కే సీనే మే  కోయీ  జైసే  సదా  దేతా  హై 
షామ్  సే  పెహలె  దియా దిల్ కా  జలా  దేతా హై
హై ఉసీ కీ ఏ సదా హై ఉసీ కీ ఏ అదా 



4)  ఏ బహార్ ఏ సమా కెహ్ రహా హై ప్యార్ కర్
కిసీకీ ఆర్జూ మే అప్నేదిల్ కో బేకరార్ కర్ 
జిందగీ హై బేవఫా లూట్ ప్యార్ కా మజా

5) హం కో మిలీ హీ ఆజ్ ఏ ఘడియా నసీబ్ సే
జీ భర్ కే దేఖ్ లీజియే హం కో కరీబ్ సే
ఫిర్ ఆప్ కే నసీబ్ మే ఏ బాత్ హో న హో

నాకు నచ్చిన హిందీ పాటలు-1-జవాబులు



1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట. ఇక్కడ  చూడండి.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.ఇక్కడ  చూడండి.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.ఇక్కడ  చూడండి.

4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.ఇక్కడ  చూడండి.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.ఇక్కడ  చూడండి.

6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.ఇక్కడ  చూడండి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.ఇక్కడ  చూడండి.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా. ఇక్కడ  చూడండి.

9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.ఇక్కడ  చూడండి.

Friday, November 19, 2010

నాకు నచ్చిన హిందీ పాటలు-1

గుల్జార్ రాసిన పాటల్లో నాకిష్టమైన కొన్ని పాటలివి. వీటిని మీరు కనుక్కోగలరా ? జవాబులు రేపటి టపాలో.
1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.
4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.
6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా
9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.

Sunday, November 7, 2010

మీకు ఈ పదాలకు అర్థాలు తెలుసా ?

"సీమ కథలు "   కథా సంకలనం - మూడవ ముద్రణ
సంకలన కర్త- శ్రీ సింగమనేని నారాయణ
మీరీ  పదాలు ఎప్పుడైనా విన్నారా ?వీటికి అర్థాలు తెలుసా ?
సుల్ల
జవితి
గాటిపాపలు
రాయలసీమలో పుట్టి చాలా సంవత్సరాలు అక్కడే పెరిగిన నాకు ఈ పదాలు తెలీలేదు. ఇవే కాదు సీమ లోని జీవితాల నిత్య పోరాటాలు కూడా పూర్తిగా తెలియదని ఇప్పుడే అర్థమైంది.
ప్రతి నిత్యం అక్కడ తప్పని నీళ్ళ యుద్ధాలు చాలాసార్లే  చూసాను. కొన్నిసార్లు వాటిలో ప్రత్యక్షంగానో , పరోక్షంగానో పాల్గొన్నాను . 
పల్లెల్లో ఈ సమస్య తీవ్రత గురించి తెలుసు, అయినా  ఇన్ని కథలు , దాదాపు ప్రతి ఒక్క కథ లోను ప్రధాన సమస్య నీళ్ళే, చదువుతుంటే,  మర్చిపోయిన చిన్నప్పటి చీకటి గదిలోని పిశాచి భయం మళ్ళీ గుర్తు వచ్చిన లాంటి భావం.
మీరెప్పుడైనా బిందెడు నీళ్ళ కోసం వీధులు వీధులు తిరిగారా? అర్ధరాత్రి , అపరాత్రి అని లేకుండా ఇంట్లో ఉన్న అందరూ కొళాయిల దగ్గర మేలుకొని కూర్చున్నారా ? 6-7 యేండ్ల వయసునుండే  సైకిల్ కు  4 బిందెలు కట్టుకొని , తొక్కలేక తోసుకొని వచ్చే తమ్మున్ని చూసారా ? నీళ్ళు పట్టే తొందరలో కత్తిపీట కాలి మీదపడి నరం తెగిపోయినా నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో అని పరుగులు పెట్టిన అమ్మను చూసారా ?  
ఇవన్నీనా అనుభవాలే.    కాబట్టి ఈ పుస్తకం మరీ నచ్చింది. 
" ఎవరు ఎన్ని నీళ్ళు వాడుతారో తెలిస్తే వాళ్ళ నాగరికత ఏ పాటిదో  చెప్పెయ్యొచ్చు  అనేది ఒక సూక్తి ! తాగేదానికి ఒక కడవ నీళ్ళు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది ? "
- " నీళ్ళు" కథ -- రచయిత " స్వామి"