Tuesday, November 23, 2010

నాకు నచ్చిన సినిమా-Departures (Japanese)

 ఏమీ తోచక Netflix హోమ్ పేజ్ లో recommendations లో ఉన్న ఈ సినిమా పైన క్లిక్ చేసాను & I'm glad that I did.
కథ  ప్రధాన పాత్రధారి (Daigo)  తను టోక్యో నుండి సొంత ఊరికి ఎందుకు వస్తాడో చెప్పే స్వగతంతో   మొదలవుతుంది. Daigo టోక్యో లో ఒక ఆర్కెస్ట్రాలో చెల్లిస్ట్ (Cellist)  గా పని చేస్తుంటాడు. ఆ ఆర్కెస్ట్రా మూతపడడంతో  వాళ్ళ అమ్మ వదిలి వెళ్ళిన ఇంటిలో ఉందామని తన భార్యతో కలిసి స్వంత ఊరుకి వచ్చేస్తాడు.అక్కడ ఒక న్యూస్ పేపర్లో N.K Agency-"Departures" అని చూసి ఆ ఉద్యోగం ఏదో ట్రావెల్ ఏజన్సీ లో ఉద్యోగం అనుకోని వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది అది చనిపోయిన వాళ్ళని Casket లో పెట్టేముందు వాళ్ళని అందంగా తయారు చేసే పని అని.

అసహ్యంగా , భయంగా మొదలుపెట్టిన ఈ పని పట్ల  DaigO ఎంత ప్రేమ , గౌరవం పెంచుకుంటాడంటే  తన భార్య ఏవగించుకొని వెళ్ళిపోతున్నా వదిలేయలేనంతగా .

స్నేహితుని తల్లి చనిపోయినప్పుడు  అతను చేసే పని ప్రత్యక్షంగా చూసిన భార్య, స్నేహితుడు ఆ పని ఎంత గౌరవమైనదో , అతను ఎంత భక్తీ , శ్రద్ధలతో  ఆ పని చేస్తున్నాడో గమనిస్తారు.
తనని చిన్నపుడు వదిలిపోయిన నాన్న శవాన్ని తయారు చెయ్యడం , ఆ నాన్న తనని మరచిపోలేదని తెలుసుకోవడం ఆఖరి సీను.

ఎప్పుడూ clear గా గుర్తు రాని తన తండ్రి మొఖం , తను చిన్నప్పుడు ఇచ్చిన గులక రాయిని పిడికిలి లో బిగించి పట్టుకొని వున్న శవాన్ని చూసినప్పుడు గుర్తు వస్తుంది.

కథ తెలుసుకోవాలనుకొంటే కింద సినిమా పేరుపైన క్లిక్ చేస్తే వికిపీడియా లో చదవచ్చు.

మంచి మ్యూజిక్, జపాన్ లో ని ఒక చిన్న ఊరు,మంచు, చెర్రీ పూలు, అందమైన మనసులు, అన్నిటినీ మించి మనసుని తాకే కథ. ఈ హాలిడేస్ లో టైం దొరికితే తప్పకుండా చూడండి.

సినిమా యూట్యూబ్ లో కూడా వుంది.

ఈ సినిమా కు 2008 లో  Best Foreign language film ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ విషయం సినిమా చూసేసిన తర్వాతే చూసాను.ఆ  అవార్డ్ కి అన్ని అర్హతలూ వున్న సినిమా.
Movie: Departures
Director: Yōjirō Takita

4 comments:

  1. Mahek,

    ఈ సినిమా నేను కూడా ఇటీవలే చూసాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నా బ్లాగ్ లో రివ్యూ రాయాలనుకున్నాను. వీలైతే ఎప్పుడో రాస్తాను. ఈ లోగా నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సినిమా చూడమని చెప్పాను.
    మీరు ముందుగా రాసినందుకు థాంక్స్.

    ReplyDelete
  2. బాగుందండి కథ. మంచి సినిమాను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. @ Kalpana
    మీ రివ్యూని తప్పకుండా రాయండి. నాకు అనిపించిందంతా నేను మాటల్లో పెట్టలేకపోయాను.

    ReplyDelete
  4. @తృష్ణ

    వీలైతే తప్పకుండా చూడండి."సినిమా" పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ లో చూడచ్చు.

    ReplyDelete