Wednesday, January 15, 2014

ఈ కథలు చదివారా?

ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీ లో ఈ కథలు చదివారా?

మనుషులపైన  నమ్మకం పోగట్టుకోడం, డబ్బు విషయం రాగానే అంతవరకూ ఎదుటి మనిషి మనకోసం పడిన తపన, చేసిన సహాయాలు మరచిపోవడం అనేవి ఎంత అసంకల్పితంగా జరుగుతాయో, అదే సమయంలో మన ఆలోచనని సరి చేసే ఒక్క మాట వింటే మన బుద్ధి ఎలా దారికి వస్తుందో బాగా చెప్పిన కథ. ఈ వారం నాకు నచ్చిన కథ. 

    ఓలేటి శ్రీనివాస భాను గారి " ఇదేన్రీ..హింగాయుతూ "

ఈ రెండో కథ ఇంచు మించు ఈ మధ్యే నేను చూసిన నిజానికి అక్షర రూపం. నిజ జీవితంలో, కథలో చివర జరిగే సంఘటన జరగక పోవడం వల్ల ఆ గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. 

   సలీం గారి "నీటి బుడగలు"

  ఈ సలీం గారు కాలుతున్న పూలతోట రచయిత సలీం గారేనా ?

మీరు ఈ కథలు చదివారా ? నచ్చాయా , లేదా?

2 comments:

  1. మొదటిది పేపర్లో పడినప్పుడే చదివానండి.. రెండవది ఇప్పుడే చదివాను..చాలా బాగుంది. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ తృష్ణ గారు. పోస్ట్స్ అన్నీ టైం తీసుకుని చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఆప్ ఆయే బహార్ ఆయీ...నా బ్లాగ్ కు :)

      Delete