Friday, April 25, 2014

ఈ పాట తెలుగులో ఏ పాటో తెలుసా

          ఈ పాట తెలుగులో ఏ పాటో తెలుసా ??




తెలుగులో ఈ పాట ఒక మూవీ ఆల్బంలో ఉంది, కానీ సినిమాలో పిక్చరైజ్ చెయ్యబడలేదు. ఆ తెలుగు సినిమాకు సంగీత దర్శకులైన సత్యం గారి పేరు పైనే ఇంటర్నెట్ లో దొరుకుతుంది, కానీ ఇది ఇళయరాజా గారి పాట. మరి ఆ తెలుగు పాట , ఆ సినిమా పేరు మీకు తెలుసా ??

అలాగే ఈ సినిమా భారతీరాజా గారు తెలుగులో రీమేక్ చేసినప్పుడు, ఈ సిచ్యువేషన్ కి ఇళయరాజా గారు వేరే పాట చేసారు. మరి ఆ పాట, ఆ సినిమా పేరు కూడా చెప్పగలిగితే మీకు బోనస్ పాయింట్స్ :)

6 comments:

  1. బంగారుకానుకలో జి.ఆనంద్, సుశీల పాడిన ప్రేమ బృందావనం. అప్పట్లో విన్న grapevine ఏమిటంటే, బాలు రాజకీయం వల్ల ఈ పాట సినిమానుంచి తొలగించబడిందని. ఎంతవరకూ నిజమో తెలీదు.

    ReplyDelete
    Replies
    1. Thanks for visiting my blog, కేకే garu. పాట కరెక్ట్ గా చెప్పారు, కానీ బోనస్ ప్రశ్న కి సమాధానం చెప్పలేదు. కాబట్టి మీకు 100 మార్కులు మాత్రమే :)

      "బాలు రాజకీయం వల్ల ఈ పాట సినిమానుంచి తొలగించబడిందని."... ఇది కొంచెం నమ్మబుల్ గా లేదండి. ఎందుకంటే ఇది ఇళయరాజా గారు స్వరపరిచిన పాట, కాబట్టి సత్యంగారే వాడుకోడానికి ఒప్పుకోకపోయిండవచ్చు. ఎక్కడో చదివిన గుర్తు, మంచుపల్లకీ సినిమాలో "మేఘమా, దేహమా" పాటని వాడుకోడానికి రాజన్-నాగేంద్ర గారు ససేమిరా వీల్లేదన్నారని, కానీ వంశీ పట్టు పట్టడంతో, చాలా అయిష్టంగా చేసారని. అలాంటిదే ఈ పాట విషయంలో జరిగుండవచ్చు . కాకపోతే ఈ సినిమా దర్శకులు వంశీ లాగా ఇళయరాజా గారి వీర ఫాన్స్ కాకపోడంవల్ల ఈ పాట బంగారు కానుక సినిమాలో కూడా లేదు.

      Delete
  2. పాట తెలుసు గానీ పల్లవి గుర్తు రావట్లే..:(
    కానీ ఈ మూవీ తెలుగు లో తెలుసు..
    'కొత్త జీవితాలు' - 'పొంగి పొరలే అందాలెన్నో పొంగిపొరలే...' !
    బోనస్ పాయింట్స్ ఇచ్చేయండి!
    ఇంకా ఈ సినిమాలో "తం తన తంతన రాగంలో" పాట బావుంటుంది.

    ReplyDelete
    Replies
    1. అసలు ఆన్సర్ చెప్పకుండా బోనస్ ఆన్సర్ చెప్పితే పాయింట్స్ ఇవ్వరమ్మా :)

      "తం తన తంతన రాగంలో" జానకీగారు, సుశీల గారు కలసి పాడిన కొన్ని పాటల్లో ఒకటి. భలే ఉంటుంది కదా. అయినా ఒక హీరోయిన్ పాటకు ఇద్దరితో ఎందుకు పాడించారో ?? ఇదే సినిమాలోని "మనసే వెళ్ళెనే , మమతే మరచి" పాట కూడా బావుంటుంది.

      పాటలు పిక్చరైజ్ చెయ్యడంలో వంశీ , భారతీరాజా ఇద్దరిదీ భలే పెక్యులియర్ స్టైల్ కదా.

      Delete
  3. ఆ..గుర్తువచ్చేసిందోచ్.... "ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం" అని సుశీల పాడిన పాట. "బంగారు కానుక" సినిమా!!
    ఇదిగో లింక్:
    https://www.youtube.com/watch?v=2bIlUlZ70sM
    హాయ్.చెప్పేసా..చెప్పేసా :-)

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యా, పట్టేసారుగా... లేకపోతే ఇక ఈరోజు రాత్రి మీరు నిద్రపోని పాపం నాకు చుట్టుకునేది :)

      ఇప్పుడు మీకు 105 మార్క్స్. కానీ మీ ఫస్ట్ రాంక్ ని నిషీ తో పంచుకోవాలి :)

      Delete