Wednesday, April 2, 2014

విన్న ప్రతిసారి మనసుపై మత్తు జల్లే పాట

ఎన్ని పాటలు వింటుంటాం... రోజులో, నెలలో , సంవత్సరంలో, కొన్ని వేల పాటలు, ఔనా??

      ఇన్ని పాటల మధ్య, మొదటిసారి విన్నది కొన్నేళ్ళ క్రితం అయినా, ఈ రోజుకీ వింటుంటే... 

మనసుని గాలి అలలపైన తేల్చేసి, 
హృదయాన్ని పూరెక్కల మధ్య ముంచేసి, 
ఆలోచనలన్నీ మాయం చేసి, 
మనని మరో ప్రపంచంలో గిరికీలు కొట్టించే 

... పాటలెన్ని ఉంటాయి? వేళ్ళ పైన లెక్క పెట్టేటన్ని మాత్రమే,కదా?

అలాంటి ఒక పాటే, నాకెంతో ఇష్టమైన సంగీత దర్శకులు _/\_ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన "మాటే మంత్రము" పాట. 


ఈ పాట వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఈ మధ్య విని ఉండకపోతే ఈ వీడియో చూడండి. ఆ పాటకు తగ్గ ఎంత అందమైన ఫోటోలతో చేసారో.

పాట విన్న తర్వాత ఈ రోజంతా ఇదే పాట మీ మనసులో (నోట్లో) మెదులుతూ ఉండకపోతే అప్పుడడగండి. 


  


2 comments:

  1. అద్భుతమైన పాట కదా! నిన్నో మొన్నో యూట్యూబ్ లో "పాడుతా తీయగా" ఎపిసోడ్ లో బాలు ఈ పాట గురించి ఇలాంటి మాటలే చెప్తుంటే విన్నా. పాట పాడిన చిన్నారి కూడా అద్భుతంగా పాడింది. ముద్దుగా కూడా ఉంది.

    ReplyDelete
    Replies
    1. అవునా... నేనీ మధ్య అమెరికా సీరీస్ మొదలైన దగ్గరనుండి "పాడుతా తీయగా" చూడ్డం మానేసా, తృష్ణ. అయినా ఈ పాట లేకుండా ఆ ప్రోగ్రాంలో ఏ ఒక్క సీరీస్ జరిగినట్లు లేదు :)

      ఈ పాట విన్నప్పుడల్లా (ఇప్పటికి కొన్ని వందలసార్లైనా) ఏదో స్వరాల లోకంలోకి వెళ్ళిన అనుభూతి, ప్రతిసారీ అంతే కొత్తగా. ఇళయ రాజా పాటలేవైనా నాకు కాస్త అభిమానం ఎక్కువే, ఒప్పుకుంటాను. కానీ కొన్ని పాటలు మాత్రం నిజంగా ఎవ్వరూ ఊహించలేని, ఇంకెవరు చెయ్యలేని ఇంద్రజాలాలు. అంతే...

      Delete