Friday, February 28, 2014

ఈ పాటల పల్లవులు తెలుసా ? - జవాబులు

జవాబులు 

1. క్యోం మై తూఫాన్ సే డరూ , మేరా సాహిల్ ఆప్ హై



2. షామ్ సే పహలే దియా దిల్ కా జలా దేతా హై 



(నాకిష్టమైన 10 పాటలు చెప్పమంటే తప్పకుండా ఆ లిస్టు లో ఉండే పాట ఇది ... గూగులించకుండా ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా ?) 

 3. ఫిర్ ఆప్ కే నసీబ్ మే యే బాత్ హో న హో


4. మస్తీ భరీ హవా జో చలీ, ఖిల్ ఖిల్ గయీ యే దిల్ కీ కలీ 


6. జో దిల్ యహా నా మిల్ సకే, మిలేంగే ఉస్ జహాన్ మే  


7. తఖ్త్ క్యా చీజ్ హై ఔర్ లాల్ జవాహర్ క్యా హై
  



 

Wednesday, February 26, 2014

ఈ పాటల పల్లవులు తెలుసా ?

1. క్యోం మై తూఫాన్ సే డరూ , మేరా సాహిల్ ఆప్ హై

2. షామ్ సే పహలే దియా దిల్ కా జలా దేతా హై

3. ఫిర్ ఆప్ కే నసీబ్ మే యే బాత్ హో న హో

4. మస్తీ భరీ హవా జో చలీ, ఖిల్ ఖిల్ గయీ యే దిల్ కీ కలీ 

5. జీనా భూలేథే కహా యాద్ నహీ, తుఝ్ కో పాయా హై జహా సాస్ ఫిర్ ఆయీ వహీ  

6. జో దిల్ యహా నా మిల్ సకే, మిలేంగే ఉస్ జహాన్ మే 

7. తఖ్త్ క్యా చీజ్ హై ఔర్ లాల్ జవాహర్ క్యా హై

Tuesday, February 25, 2014

మానవత్వం అంటే ?????

మానవత్వం అంటే ఇదేనా ? 
 
పక్కన ఉన్న మనిషి కష్టాన్ని గమనించడం, మనం  కాస్త ఇబ్బందే పడినా మనకంటే బలహీనులకు ఆసరా ఇవ్వడం, ఇంతకు మించిన నిర్వచనం మానవత్వానికి ఉందా? 


కష్టాన్ని , కన్నీళ్ళని అర్థం చేసుకోడానికి భాష అక్కర్లేదు , మనసుంటే చాలు.
 

Saturday, February 22, 2014

ఒక చిన్న వానకే...

ఒక చిన్న వానకే పులకరించి పచ్చబడ్డ ప్రకృతి 











వర్షం పడకముందు...

వర్షం పడకముందు తీసిన కొన్ని ఫోటోలు









Saturday, February 15, 2014

కొందరివి అందం కోసం పాట్లు, మరి కొందరివి...??

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు


5-6 రోజుల క్రితం "నేను హార్లిక్స్ తినను, తాగుతాను..." అనే టైటిల్ తో ఈ మధ్య ఇక్కడ చాలా పాపులర్ అవుతున్న లిక్విడ్ డైట్ గురించి టపా రాసాను. నిన్న ఆన్లైన్ పేపర్లు తిరగేస్తుంటే సాక్షి పేపర్ లో "తినదు.. తాగుతుంది" అనే ఆర్టికల్ చూసాను. 

       ఏంటా అని చూస్తే హర్యానా లోని మంజు ధారా అనే అమ్మాయి చిన్నప్పటి నుండి ఘన పదార్థం అనేది తినకుండా, కేవలం పాలు , టీ , జ్యూస్లు తీసుకుంటూ ఉందని, ఆ అమ్మాయికి అన్నవాహికలో ఉన్న సమస్య వల్ల ఏమి తిన్నా వాంతి అయిపోతుందని రాసారు. అప్పుడే అనిపించింది... 

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు అని


Friday, February 14, 2014

వర్షం పడగానే గుర్తు వచ్చే పాట

కాలిఫోర్నియాలో ఒక సంవత్సరం నుండి సరిగ్గా వర్షాలే పడట్లేదు. రాయలసీమ నుండి వస్తూ, వస్తూ కరువు కూడా వెంట పెట్టుకొచ్చామని మా ఇంట్లో ఒకరి పైన ఒకరం జోకులు వేసుకుంటూ ఉంటాము :)  నీళ్ళు లేనప్పుడు కాలిఫోర్నియా ఐతే ఏమి, కదిరైతే ఏమీ ... అని మా అమ్మ కిందటి వారమే ఇంక అమెరికాకు రానని తెగేసి చెప్పేసింది. మా రాష్ట్రంలో కరువు చూసి హృదయం ద్రవించి, ఇందాకనే ఒబామా ఏవో ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉన్నాడు టివిలో. కిందటి వారం ఒక మోస్తరు వాన కురిసి, చెట్లు, పువ్వులు, పిట్టలు కాస్తా కళగా కనిపిస్తున్నాయి. 

         పైన వర్షం పాట అని పెట్టి , ఈ కరువు గోలేంటమ్మా అంటున్నారా, వస్తున్నా, వస్తున్నా, పాట దగ్గరికే వస్తున్నా. మన తెలుగు, హిందీ దర్శకులు ఎంతమందో, ఎన్నో అందమైన వర్షం పాటలు సృజించారు. కానీ ఎన్ని పాటలున్నా,

వర్షం పాట అనగానే నాకు ఠక్కుమని గుర్తు వచ్చే పాట, 
పక్కన ఉన్నవాళ్ళు "ఆపు తల్లీ, పాటని ఖూనీ చేస్తున్నావ్" అంటున్నా నేను గొంతెత్తి పాడేసే పాట, 
ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని పాటలు వింటున్నా మనసులో నిలచిపోయిన పాట.... 
                          ఈ పాట
 "పరఖ్" సినిమాలో, శైలేంద్ర రచించగా, సలీల్ చౌదరీ సంగీతంలో, లతా మంగేష్కర్ పాడిన ... 

                                         ओ सजना बरखा बहार आयी




     హీరోయిన్ సాధన కూడా తన ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ లేకుండా సింపుల్గా, అందంగా, అచ్చు మధ్య తరగతి అమ్మాయిలా ముచ్చటగా ఉంటుంది. ఈ సినిమా ఇదివరకు చూసి ఉండకపోతే తప్పక చూడండి. 
 
        ఈ పాట సలీల్ చౌదరీ మొదట బెంగాలీలో చేసారు. ఎక్కడో చదివిన గుర్తు, ఉస్తాద్ బడే గులామ్ ఆలీ ఖాన్ గారి దగ్గర ఉండిన ఒకే ఒక నాన్ క్లాసికల్ రికార్డ్ ఈ బెంగాలీ పాట మాత్రమేనని. 

      బెంగాలీ వెర్షన్:







Sunday, February 9, 2014

నేను హార్లిక్స్ తినను, తాగుతాను...


 నేను హార్లిక్స్ తినను, తాగుతాను... 

చిన్నప్పుడు వచ్చే హార్లిక్స్ యాడ్ గుర్తుందా? "నేను హార్లిక్స్ తాగను, తింటాను" అని. ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్తా రివర్స్ అయ్యింది. ప్రతి ఒక్కటీ తాగడమే ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్, తినే పదార్థాలైనా సరే.  

     మీరు అమ్మాయైతే , ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన లిక్విడ్ డైట్ పాటించని అతి కొద్ది మందిలో ఉండి ఉంటే, ఖచ్చితంగా విని మాత్రం ఉంటారు. ఇంకా వినని అమాయకులు ఎవరైనా ఉంటే వారి కోసం, ఈ లిక్విడ్ డైట్ రెసిపీ... 

       మీరు ఏమేమి కూరగాయలు, ఆకుకూరలు  వండుకోడానికి తెచ్చుకుంటారో, అవి + మీరు మామూలుగా తినే (Or తినని) పళ్ళు + కనిపించిన ద్రవాలు (ఉదా: జ్యూస్లు, కొబ్బరి నీళ్ళు ) కలిపి జ్యూసర్లో వేసి, వాటిని గ్లాస్స్లో పోసి తాగెయ్యడం. 


     ఈ ట్రెండ్ ప్రస్తుతం మా ఆఫీస్ లో పతాక స్థాయిలో ఉంది. ఎవరు చూసినా ఆకుపచ్చ, బ్లూ , పర్పుల్, బ్రౌన్ ఇలా రంగు, రంగుల్లో ఉండే ద్రవాలను గ్లాసుల నిండా పోసుకుని, "oh, it's so good", "oh, it makes me so full" అనుకుంటూ లొట్టలేస్తూ తాగుతున్నారు. 



(Image courtesy: Google images)


     కానీ ఆ ఆకుకూరలు , కూరగాయలు అలా జ్యూస్ కొట్టేస్తే వాటిలో నశించిపోయే పోషక విలువలు, ఫైబర్, ఉడకబెట్టకుండా పచ్చివి తింటే వచ్చే ప్రాబ్లమ్స్ , ఆ ఫ్రూట్ జ్యూసుల్లో ఉండే చక్కెర, వాటి సంగతేంటి... 
మీరుప్పుడైనా ఇది ట్రై చేసారా ?

Saturday, February 8, 2014

ఈ పాటల పల్లవులు కనుక్కోగలరా

1. నాదం నాకు ప్రాణం... చెరగరాదీ చైత్రమాసం 
రేగే అగ్నిగుండం... నన్ను తాకి పొందు శాంతం 

2. జీవితాంతం సాగిపోదాం... తోడుగా , నీడగా , జతగా, మన స్నేహం 
చెలి గుండెలో.. ఈ వేళలో..  తలపులు విరియాలి, మనసే నిండాలి
 
(క్లూ : ఈ పాట ప్రారంభం, ఒక అట్టర్ ఫ్లాప్ వెంకటేష్, రాఘవేంద్ర రావు సినిమాలో హిట్ అయిన పాటలా ఉంటుంది)

3. వలపుల దీపం వెలుగున మనము... పదికాలాలు పయనిద్దాము
మన తొలిరోజు కలలా మిగిలి ... కథలే చెప్పును మనకిక రోజూ 
ముందు తరానికీ , మన అనుబంధం, తీపిని తెలిపే తెలుగు ప్రబంధం 

4. మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం 
ముచ్చటగా ముత్యంలా మిడిసిపడే సఖి పరువం 

5. కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం... షుక్రియా 
కుసుమించే చెలి యవ్వనం , నా మదికే నీరాజనం 
ఏడేడు జన్మాలకిది శాశ్వతం... 

అన్ని పాటలూ ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన సినిమాల్లోవే.

 

Friday, February 7, 2014

ఆనందం ఎక్కడ వుంది ???

ఆనందం ఎక్కడ వుంది ?

 ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారా ? సమాధానం దొరికిందా ? దీని గురించి ఇదివరకు ఆలోచించి ఉండకపోతే , ఇప్పుడో రెండు నిముషాలు ఆలోచించండి. 

చాలామంది లాగా ఆనందం డబ్బులో , విజయంలో , స్టేటస్ లో , అనుకున్నవి సాధించడంలో వుంది... అనే నిశ్చయానికి వచ్చారా... 

సరే , ఇప్పుడీ వీడియో చూడండి. 

ఇప్పుడేమనిపిస్తోంది ?? 

మొదటిసారిగా వానని చూస్తున్న ఈ చిన్ని పాపకు మించిన ఆనందం మీరెప్పుడైనా పొంది వుంటారా ? ఇంతవరకు ఆనందానికి అసలైన కారణాలుగా మనకనిపించినవన్నీ ఎంత అనవసరమైన విషయాలో అర్థం అయిందా. 

ఆనందం ఈ పెద్ద, పెద్ద విషయాలలో లేదు. అది అనుభవించడం అంత  కష్టమూ కాదు.  

  •   అది ఒక చిన్న పాప నవ్వులో ఉంది
  •   చినుకు తడికి చిగురు తొడిగిన మొక్కలో ఉంది 
  •   కొత్త విషయాన్ని నేర్చుకొనే సంతృప్తిలో ఉంది 
  •   తెలియని మనిషి మనని చూసి నవ్వే పలకరింపులో ఉంది 
  •   మనమింకొకరికి నిస్వార్థంగా చేసే సాయంలో ఉంది 
  •    రోజుకో కొత్త అందాన్ని సంతరించుకునే ప్రకృతిలో ఉంది

 ప్రతి రోజూ, ప్రతి క్షణం మనకు ఆనందంగా ఉండే అవకాశాన్ని ఈ జీవితం ఇస్తూనే ఉంటుంది. దాన్ని గమనించడం, ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోడం మాత్రమే మన పని. మరి మీరేమంటారు ?              
             

Wednesday, February 5, 2014

మౌనవ్రతం

కినిగె పత్రిక వారి గత నెల కవితానువాదాల పోటీలో రష్యన్ కవి ఫ్యోదోర్ చూచెవ్ రాసిన “Silentium” కవితకు, నేను పంపిన అనువాదం. అఫ్కోర్స్ , సెలెక్ట్ కాలేదనుకోండి :)  

      కానీ కాకి పిల్ల కాకికి ముద్దు కదా. పైగా అసలు కవితలు అర్థమే కాని నేను , అతి కష్టపడి చేసిన అనువాదం. అందుకని ఇక్కడ పోస్ట్ చేసుకుంటున్నా. ఎంపిక చేసిన వాటిలో "విజయాదిత్య" గారి అనువాదం నచ్చింది. మరి మీకు ????

 మౌనవ్రతం 


మాటల్లో పొదగక, మనసు మారుమూలల్లో దాచి ఉంచుకో,
నువ్వు కనే స్వప్నాలని, నీ మనసుని కదిపే కాసిన్ని భావాలని
నిశి రాతిరి కప్పివేయక మునుపు మిడిసిపడే స్ఫటికపు ఆకాశంలో,
మిణుగురు పురుగులవలే ఎగిరే తారల్లా, వాటిని స్వేచ్ఛగా వదిలేసి…
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ ఆనంద వాహినిలో తేలియాడు

మది కదలికలు పట్టుకోగలవారెవ్వరు? మరొకరి మనో యవనికను కనే వారెవ్వరు?
ప్రాణానికి ప్రాణమైనా, నీలోని స్పందనలకి కారణమేదో అతడు తెలియరాగలడా?
పెదవంచుల తొణికిసలాడిన మది తలపు వితథమే కాదా
మధించిన తలిపెర కలుషితమే కాదా...
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ అమృత వాహినిలో ఓలలాడు

ఏకాంతంలో అంతర్ముఖుడవై ఉజ్జీవిస్తే
నీ హృత్కమలములో పెరిగిన జగతిని కాంచలేవా 
ఒక చిన్ని కిరణానికే చెదిరిపోయే నీహారికలాంటి తరోహితమైన ఊహల గారడీ
జీవితపు రణగొన ధ్వనులలో క్రుంగిపోయే మనోసంగీతం...
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ స్వర గాన వాహినిని ఆలింగనము చేసుకో 

Saturday, February 1, 2014

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరి...

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరి...అక్కడే నిలబడిన తార

ఇదే రోజు, 11 ఏళ్ళ క్రితం, బాగా గుర్తు. స్పేస్ షటిల్ కొలంబియాకు లాంచింగ్ లోనే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని , లాండింగ్ అనుకున్న విధంగా జరక్కపోవచ్చని వార్తల్లో చెప్తూనే వున్నారు. కానీ అంత ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించగలరు? 

      ఆ ఘోర ప్రమాదంలో, ఆకాశంలో రివ్వున ఎగిరే గువ్వలాంటి పంజాబ్ అమ్మాయి, మన భూమి ఆవిష్కరించే అద్భుత వర్ణచిత్రాలు అంతరిక్షంలో కళ్ళ ముందర రూపు దాల్చుతుంటే సంబరపడిపోయి ప్రపంచంతో పంచుకున్న ఇండియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా, తాను కలలు కన్న అంతరిక్షాన్ని వదలి రాలేక ఈ గాలిలో గాలిగా కలసిపోయింది. పుట్టి, పెరిగిన భారతదేశానికి, ఉన్నత విద్యావకాశాలిచ్చిన అమెరికాకు, ఋణం సంపూర్తిగా తీర్చుకున్నారామె.  

 R.I.P. Kalpana Chawla

 kalpana chawla

Image Credit: http://www.space.com/17056-kalpana-chawla-biography.html

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరిన కల్పన ... నిశ్చలమైన  ఆశయ సాధనకు నీవొక తార్కణ

(శ్రీ శ్రీ గారి కవిత "నిప్పులు చిమ్ముకుంటూ", ఈ పోస్ట్ టైటిల్ కి ఆధారం)