కాలిఫోర్నియాలో ఒక సంవత్సరం నుండి సరిగ్గా వర్షాలే పడట్లేదు. రాయలసీమ నుండి వస్తూ, వస్తూ కరువు కూడా వెంట పెట్టుకొచ్చామని మా ఇంట్లో ఒకరి పైన ఒకరం జోకులు వేసుకుంటూ ఉంటాము :) నీళ్ళు లేనప్పుడు కాలిఫోర్నియా ఐతే ఏమి, కదిరైతే ఏమీ ... అని మా అమ్మ కిందటి వారమే ఇంక అమెరికాకు రానని తెగేసి చెప్పేసింది. మా రాష్ట్రంలో కరువు చూసి హృదయం ద్రవించి, ఇందాకనే ఒబామా ఏవో ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉన్నాడు టివిలో. కిందటి వారం ఒక మోస్తరు వాన కురిసి, చెట్లు, పువ్వులు, పిట్టలు కాస్తా కళగా కనిపిస్తున్నాయి.
పైన వర్షం పాట అని పెట్టి , ఈ కరువు గోలేంటమ్మా అంటున్నారా, వస్తున్నా, వస్తున్నా, పాట దగ్గరికే వస్తున్నా. మన తెలుగు, హిందీ దర్శకులు ఎంతమందో, ఎన్నో అందమైన వర్షం పాటలు సృజించారు. కానీ ఎన్ని పాటలున్నా,
వర్షం పాట అనగానే నాకు ఠక్కుమని గుర్తు వచ్చే పాట,
పక్కన ఉన్నవాళ్ళు "ఆపు తల్లీ, పాటని ఖూనీ చేస్తున్నావ్" అంటున్నా నేను గొంతెత్తి పాడేసే పాట,
ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని పాటలు వింటున్నా మనసులో నిలచిపోయిన పాట....
ఈ పాట
"పరఖ్" సినిమాలో, శైలేంద్ర రచించగా, సలీల్ చౌదరీ సంగీతంలో, లతా మంగేష్కర్ పాడిన ...
ओ सजना बरखा बहार आयी
హీరోయిన్ సాధన కూడా తన ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ లేకుండా సింపుల్గా, అందంగా, అచ్చు మధ్య తరగతి అమ్మాయిలా ముచ్చటగా ఉంటుంది. ఈ సినిమా ఇదివరకు చూసి ఉండకపోతే తప్పక చూడండి.
ఈ పాట సలీల్ చౌదరీ మొదట బెంగాలీలో చేసారు. ఎక్కడో చదివిన గుర్తు, ఉస్తాద్ బడే గులామ్ ఆలీ ఖాన్ గారి దగ్గర ఉండిన ఒకే ఒక నాన్ క్లాసికల్ రికార్డ్ ఈ బెంగాలీ పాట మాత్రమేనని.
బెంగాలీ వెర్షన్:

No comments:
Post a Comment