Sunday, February 9, 2014

నేను హార్లిక్స్ తినను, తాగుతాను...


 నేను హార్లిక్స్ తినను, తాగుతాను... 

చిన్నప్పుడు వచ్చే హార్లిక్స్ యాడ్ గుర్తుందా? "నేను హార్లిక్స్ తాగను, తింటాను" అని. ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్తా రివర్స్ అయ్యింది. ప్రతి ఒక్కటీ తాగడమే ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్, తినే పదార్థాలైనా సరే.  

     మీరు అమ్మాయైతే , ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన లిక్విడ్ డైట్ పాటించని అతి కొద్ది మందిలో ఉండి ఉంటే, ఖచ్చితంగా విని మాత్రం ఉంటారు. ఇంకా వినని అమాయకులు ఎవరైనా ఉంటే వారి కోసం, ఈ లిక్విడ్ డైట్ రెసిపీ... 

       మీరు ఏమేమి కూరగాయలు, ఆకుకూరలు  వండుకోడానికి తెచ్చుకుంటారో, అవి + మీరు మామూలుగా తినే (Or తినని) పళ్ళు + కనిపించిన ద్రవాలు (ఉదా: జ్యూస్లు, కొబ్బరి నీళ్ళు ) కలిపి జ్యూసర్లో వేసి, వాటిని గ్లాస్స్లో పోసి తాగెయ్యడం. 


     ఈ ట్రెండ్ ప్రస్తుతం మా ఆఫీస్ లో పతాక స్థాయిలో ఉంది. ఎవరు చూసినా ఆకుపచ్చ, బ్లూ , పర్పుల్, బ్రౌన్ ఇలా రంగు, రంగుల్లో ఉండే ద్రవాలను గ్లాసుల నిండా పోసుకుని, "oh, it's so good", "oh, it makes me so full" అనుకుంటూ లొట్టలేస్తూ తాగుతున్నారు. 



(Image courtesy: Google images)


     కానీ ఆ ఆకుకూరలు , కూరగాయలు అలా జ్యూస్ కొట్టేస్తే వాటిలో నశించిపోయే పోషక విలువలు, ఫైబర్, ఉడకబెట్టకుండా పచ్చివి తింటే వచ్చే ప్రాబ్లమ్స్ , ఆ ఫ్రూట్ జ్యూసుల్లో ఉండే చక్కెర, వాటి సంగతేంటి... 
మీరుప్పుడైనా ఇది ట్రై చేసారా ?

No comments:

Post a Comment