ఆనందం ఎక్కడ వుంది ?
ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారా ? సమాధానం దొరికిందా ? దీని గురించి ఇదివరకు ఆలోచించి ఉండకపోతే , ఇప్పుడో రెండు నిముషాలు ఆలోచించండి.చాలామంది లాగా ఆనందం డబ్బులో , విజయంలో , స్టేటస్ లో , అనుకున్నవి సాధించడంలో వుంది... అనే నిశ్చయానికి వచ్చారా...
సరే , ఇప్పుడీ వీడియో చూడండి.
ఇప్పుడేమనిపిస్తోంది ??
మొదటిసారిగా వానని చూస్తున్న ఈ చిన్ని పాపకు మించిన ఆనందం మీరెప్పుడైనా పొంది వుంటారా ? ఇంతవరకు ఆనందానికి అసలైన కారణాలుగా మనకనిపించినవన్నీ ఎంత అనవసరమైన విషయాలో అర్థం అయిందా.
ఆనందం ఈ పెద్ద, పెద్ద విషయాలలో లేదు. అది అనుభవించడం అంత కష్టమూ కాదు.
- అది ఒక చిన్న పాప నవ్వులో ఉంది
- చినుకు తడికి చిగురు తొడిగిన మొక్కలో ఉంది
- కొత్త విషయాన్ని నేర్చుకొనే సంతృప్తిలో ఉంది
- తెలియని మనిషి మనని చూసి నవ్వే పలకరింపులో ఉంది
- మనమింకొకరికి నిస్వార్థంగా చేసే సాయంలో ఉంది
- రోజుకో కొత్త అందాన్ని సంతరించుకునే ప్రకృతిలో ఉంది
ప్రతి రోజూ, ప్రతి క్షణం మనకు ఆనందంగా ఉండే అవకాశాన్ని ఈ జీవితం ఇస్తూనే ఉంటుంది. దాన్ని గమనించడం, ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోడం మాత్రమే మన పని. మరి మీరేమంటారు ?
No comments:
Post a Comment