1. నాదం నాకు ప్రాణం... చెరగరాదీ చైత్రమాసం
రేగే అగ్నిగుండం... నన్ను తాకి పొందు శాంతం
2. జీవితాంతం సాగిపోదాం... తోడుగా , నీడగా , జతగా, మన స్నేహం
చెలి గుండెలో.. ఈ వేళలో.. తలపులు విరియాలి, మనసే నిండాలి
(క్లూ : ఈ పాట ప్రారంభం, ఒక అట్టర్ ఫ్లాప్ వెంకటేష్, రాఘవేంద్ర రావు సినిమాలో హిట్ అయిన పాటలా ఉంటుంది)
3. వలపుల దీపం వెలుగున మనము... పదికాలాలు పయనిద్దాము
మన తొలిరోజు కలలా మిగిలి ... కథలే చెప్పును మనకిక రోజూ
ముందు తరానికీ , మన అనుబంధం, తీపిని తెలిపే తెలుగు ప్రబంధం
4. మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యంలా మిడిసిపడే సఖి పరువం
5. కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం... షుక్రియా
కుసుమించే చెలి యవ్వనం , నా మదికే నీరాజనం
ఏడేడు జన్మాలకిది శాశ్వతం...
అన్ని పాటలూ ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన సినిమాల్లోవే.

వారి సంగీతం అంటే అనువాదాలైనా అయ్యుండాల లేక సాహిత్యానికి స్వేచ్చ లేని దయినా అయ్యుండాల. అటువంటప్పుడు సంగీతం సంగతులేమో గానీ వారి పాటల్లో సాహిత్యానికి చిన్న పీటే. కనుక్కోవడం కుదరదు.
ReplyDeleteనమస్తే లక్ష్మీదేవి గారు.
ReplyDelete"వారి సంగీతం అంటే అనువాదాలైనా అయ్యుండాల లేక సాహిత్యానికి స్వేచ్చ లేని దయినా అయ్యుండాల"
క్షమించండి, కానీ ఈ మాట నేనస్సలు ఒప్పుకోలేనండి. ఇళయరాజా గారు చేసిన పాటల్లో అధిక శాతం సాహిత్యానికి ప్రాముఖ్యతనిచ్చేవే. ఏ పాటైనా కొన్ని సంవత్సరాల పాటు శ్రోతల మనస్సులో మిగలాలంటే సంగీతం, సాహిత్యం, గాత్రం, మూడూ అందంగా జత కట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇళయరాజా గారు 1970-90 మధ్యలో చేసిన పాటలకు ఈ రోజుకీ అభిమానులు ఉన్నారంటే అర్థం, ఆయన పాటల్లో ఆ మూడు లక్షణాలు ఉండడమే.
"వలపుల దీపం వెలుగున మనము... పదికాలాలు పయనిద్దాము
మన తొలిరోజు కలలా మిగిలి ... కథలే చెప్పును మనకిక రోజూ
ముందు తరానికీ , మన అనుబంధం, తీపిని తెలిపే తెలుగు ప్రబంధం"
ఈ పాట అనువదించిన సినిమాలోని పాటే. కానీ ఈ పదాల్లో తెలుగుదనం లోపించినట్టు నాకేమీ అనిపించట్లేదు.
నేనూ ఒప్పుకోను. :)
ReplyDeleteపాటల్లో పదాలు మంచివి పడితే అది వ్రాసినవారి పాండిత్యం. కానీ పదాలు పాదాలుగా మార్చేటపుడు ప్రతి భాషకూ తనదైన ఔచిత్యం ఉంటుంది. (రాజీ పడితే చేసేదేం లేదు.) దాన్ని ఫలా"నా" బాణీలోకొద్ది మార్పు కూడా చేయను. దీర్ఘాలో వత్తులో ఎగిరిపోయినా పర్లేదు.(అర్థాలే మారిపోయినా సరే) అనే ధోరణిలో అతని పాటలుంటాయి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండవచ్చు. నాకన్ని పాటలూ తెలియదు కదా! ఆ ఇళయుని అభిమానుల అభిమానం ఎంత ఉంటుందో నాకూతెలుసండి. మా తమ్ముడు వీరాభిమాని.
నిరూపించే ఓపికైతే నాకు లేదు గానీ పాట సాహిత్యం తీసుకొని చూడడం కాక పాట వినేటపుడు గమనించి గాయకుల పరిమితి అర్థమైనపుడు భాషాభిమానిగా నాకు బాధ కలగక మానదు. ఈ చర్చకు ఏకాభిప్రాయం రావడం అసంభవం అని అనుకొంటున్నాను. స్వస్తి.
మీరు "స్వస్తి" చెప్పేసారుగా , ఇక చేసేదేముంది :)
Delete