Sunday, January 19, 2014

లైబ్రరీలు-1

అమెరికా కి వచ్చాక, నాకు ఇండియాలో ఉన్నప్పుడు పుస్తకాలపైన ఉన్న పిచ్చి ఏమీ తగ్గలేదు సరికదా, అప్పుడు చదవని ఇంగ్లీష్ బుక్స్ ఇక్కడ చాలా ఈజీగా లైబ్రరీలలో దొరకడం వల్ల ఇంకాస్తా పెరిగింది. 

     ఇండియాలో ఉన్నప్పుడు ఏ లైబ్రరీ చూసిన గుర్తు లేదు. ఇంట్లో అమ్మ, అత్తా వీళ్ళంతా కొని దాచుకున్న బుక్సే చదివేదాన్ని.అమ్మ దగ్గర ఎన్ని బుక్స్ ఉండేవంటే ఇల్లు మారేటప్పుడు 3 పెద్ద ప్రత్యేకంగా చేయించిన చెక్కపెట్టల నిండా ఉండేవి. సామాన్లు మార్చడానికి వచ్చినవాళ్ళు ప్రతిసారీ ఏ ఊర్లో అయినా ఆ మూడు పెట్టలు ఎత్తడానికి అష్ట కష్టాలు పడేవారు.ఇవి కాక ఇంకా వారం వారం వచ్చే ప్రతి ఒక్క వీక్లీని మా పేపర్ అతను అమ్మకి రెంట్ కి ఇచ్చేవాడు. అంటే అన్ని మాగజైన్స్ కొనే అవసరం లేకుండా, ఈరోజు రిలీజ్ అయ్యే పత్రిక అమ్మకిస్తే, అమ్మ చదివేసి నలపకుండా జాగ్రత్తగా రేపు తిరిగిచ్చేసేది. దీనివల్ల మాకు నమిలి మింగడానికి బుక్స్ కొరతే ఉండేది కాదు :)

      2-3 యేళ్లకి ఒకసారి నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారుతుంటే, అమ్మకున్న సవాలక్ష చింతల్లో ఇలా బుక్స్ ఇచ్చేవాళ్ళు కొత్త ఊర్లో ఉంటారా, లేదా, అనే ఐటం మొదటి 10 ప్లేసుల్లో వుండేది. నాకు గుర్తు ఉన్నంతవరకు, దేవుడి దయవల్ల ఈ కార్యక్రమానికి ఎప్పుడూ ఆటంకం కలగలేదు. అమ్మనుండి నాకు ఈ పిచ్చి వారసత్వంగా రావడంతో, మా మామా వాళ్ళందరూ నన్ను పుస్తకాల పురుగని,  నేను పెద్దయ్యాక వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, భూత్ బంగళాలలో ఉన్నట్టు బూజులని చేత్తో తీసుకుంటే వస్తే, ఏదో ఒక మూల రూంలో కిటికీ ఎక్కి ఒక బుక్ పట్టుకొని నేను కనిపిస్తానని జోకులు వేసుకునే వాళ్ళు raised eyebrows

     అమెరికాకి వచ్చేటప్పుడు నేను మొదట కూర్చుంది అమ్మ పుస్తకాల అలమరా ముందు. చాలా కష్టపడి ఒక 20 పుస్తకాలతో సర్దుకొని ఫ్రీమాంట్ కి   వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఒకరోజు పొద్దున్నే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాం. అక్కడ స్టేషన్ లో ప్లాట్ఫాం మీద వెయిట్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎంత ఆశ్చర్యమేసిందో, అంత ఆనందంగా అనిపించింది. అక్కడ లైన్లో నిలబడ్డ దాదాపు అందరి చేతుల్లో బుక్స్ applause 
అప్పుడే అనిపించింది this is my kinda place అని. తర్వాత ట్రైన్ లో కూడా అంతే, సీట్ దొరికిన వాళ్ళు, దొరక్క నిలబడ్డ వాళ్ళు చాలామంది చేతుల్లో బుక్సే. ఇది టాబ్లెట్స్ స్వైరవిహారం చేయని పాత కాలం సంగతి. (to be contd...)  

4 comments:

  1. ఆహాఁ.....చిన్నతనం నుంచే పుస్తకాల పండుగన్నమాట. బాగుంది.మీ అమ్మగారికి నా నమస్కారములు తెలపండి.
    మీరు ఇచ్చిన సుచిత్రాసేన్ తేరేబినా పాట నాకెంతో ఇష్టం. మీరు చెప్పిన జాణవులే పాట కూడా నాకిష్టం. ఇంకోపాటలో మధ్యలో పిల్లనగ్రోవి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నమస్తే లక్ష్మీదేవి గారు. నా బ్లాగ్ పోస్ట్స్ అన్నీ చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.

      అమ్మకు తప్పక చెప్తాను. తను ఇంక బుక్స్ కొనగూడదని ఎప్పటికప్పుడు ఒట్టు పెట్టుకుంటుంది. కానీ దాదాపు ప్రతి నెలా మళ్ళీ ఏదైనా బుక్ రివ్యూ చదివినప్పుడో , లేదా నేను ఏదైనా బుక్ బావుందంట అని చెప్పినప్పుడో , ఒట్టు తీసి గట్టున పెట్టేసి, అనుకున్న బుక్ ఒకటి , విశాలాంధ్ర లో చూసి చదవాలనిపించి ఇంకో 4 తెచ్చుకోకుండా ఉండదు :)

      Delete
  2. ఇల్లుమారినప్పుడు పుస్తకాల పెట్టెల బరువు మొయ్యలేక మనుష్యులు పడే కష్టాలు నాకూ అనుభవమే. మీ లైబ్రరి జ్ఞాపకాల కథ బాగుంది. తరువాతి టపాకోసం వెయిటింగ్ :)

    ReplyDelete
    Replies
    1. Thanks for reading Kishore Varma garu.

      మీరు కూడా పడ్డారా ఈ బాధలు? మరీ రెండేళ్లకోసారి ఊరు మారాల్సి ఉండడంతో మాకు ఈ బాధలు చాలా గుర్తు :)

      Delete