సుచిత్రా సేన్ ని నేను మొదటగా చూసింది టివిలో వచ్చిన ఆంధీ సినిమాలో . అప్పటికి సంజీవ్ కుమార్ లేకపోయినా, ఆయన గురించి విన్న విషయాల వల్ల ఆయన అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకని ఆ సినిమాలో మొత్తం ఫోకస్ అంతా ఆయన పైనే. సుచిత్రా సేన్ చాలా అందగత్తె అని విని, అంత అందంగా ఏమీ లేదే అనుకోడం మాత్రం గుర్తు.
తర్వాత ఎప్పుడో నాకెంతో ఇష్టమైన గుల్జార్ "తుమ్ పుకార్ లో",
"హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోం కి మెహక్ తీ ఖుష్బూ" పాటలు ఉన్న ఖామోషి కి మాతృక అని విని, సుచిత్రా సేన్ నటించిన బెంగాలీ సినిమా "దీప్ జ్వలే జాయ్ " లో పాటలు చూసాను.అచ్చు మూన్ మూన్ సేన్ లాగానే అనిపించింది ఆ పాటలు చూస్తుంటే.
ఆ బెంగాలీ సినిమాలోని ఈ పాట
ఈ పాట ఇంకో హిందీ సినిమాలో వుంది. అది ఏ పాటో తెలుసా ?
ఆంధీ సినిమా చూసినా చూడకపోయినా, ఈ పాట వినని సినీ ప్రేక్షకులు ఉండరని నా నమ్మకం. సుచిత్రా సేన్ తో పాటు హరీభాయి ని కూడా చూసేయండి.
ReplyDeleteసుచిత్రసేన్ మృతికి సంతాపం తెలుపుతూ రాస్తున్నాను.ఆమె అందగత్తే కాని 'ఆంధి 'సినిమాలో మధ్యవయస్కురాలి వేషంలో కనిపిస్తుంది.అందువలన అంత అందంగా కనిపించదు.ఇక 'దీప్ జ్వలే జాయ్ ' సినిమానే ' చివరకు మిగిలేది ' అనే పేరుతో సావిత్రి కథానాయికగా తెలుగులో తీసారని జ్ఞాపకం .
నమస్తే కమనీయం గారు. Thanks for visiting my blog andi.
Deleteమధ్య వయస్కులైనా ఆనాటి సౌందర్య ఛాయలు కాస్తైనా ఉంటాయి కదండీ. అయినా అప్పుడు నేనింకా స్కూల్ లో ఉన్నాను, కాబట్టి ఆ రోజుల్లో అందానికి నా కొలమానం వేరేగా వుండి వుంటుంది :) సుచిత్రా సేన్ ని మొదటిసారి చూసిన జ్ఞాపకం కాబట్టి గుర్తు ఉంది.
అవునండీ , ఈ సినిమా తెలుగులో "చివరకు మిగిలేది". ఈ బెంగాలీ పాట, హిందీలో ఏ పాటో జ్ఞప్తికి వచ్చిందా ?