ఇక్కడ కొద్దిగా సెటిల్ అయ్యాక, బోర్ కొట్టడం మొదలైంది. ఇండియాలో ఉన్నప్పుడు డిగ్రీ పూర్తి కాకుండానే జాబ్ రావడంతో అసలు ఖాళీగా ఉండిందే లేదు. ఇక్కడికి వచ్చాక డిపెండెంట్ వీసా కావడంతో ఉద్యోగం చేయడానికి లేదు.
కొద్ది, కొద్దిగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒకరిద్దరు పరిచయం కావడంతో కాస్తా రాకపోకలు జరిగాయి. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు చూద్దామన్నా ఒక బుక్ కనిపించేది కాదు. మహా అయితే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ బుక్కులు తప్ప. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నా బుక్స్ చూసి, సూట్కేసుల్లో పప్పులు, చింతపండు, పార్టీ వేర్ లాంటి ముఖ్యమైన సామాన్లు వదిలేసి, బుక్స్ తెచ్చుకున్న మెంటల్ కేస్
అన్నట్టు వింతగా చూసేవారు.
పోనీ వాళ్ళకు బుక్స్ ఒకసారి రుచి చూపిస్తే, నెక్స్ట్ టైం ఇండియా కి వెళ్ళినప్పుడు వాళ్లే బుక్స్ తెచ్చుకుంటారు, అప్పుడు అవి నేను కూడా చదువుకోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసి, మీక్కావాలంటే ఏదైనా బుక్ తీసుకెళ్ళి చదువుకోండి అని ధారాళంగా ఆఫర్ ఇచ్చేదాన్ని. వాళ్ళేమో బుక్ చదివితే తలనొప్పి వస్తుందనో, లేదా టైం ఉండదనో, లేదా
, లేదా కాన్వెన్ట్స్ లో చదవడం వల్ల తెలుగు చదవడం రాదనో చెప్పేవాళ్ళే, కానీ ఒక్కరు కూడా నా వలలో పడలేదు
. అమ్మేమో పాపం, అమెరికాకు ఎవరైనా వస్తున్నారు అంటే నాకు బుక్స్ పంపాలని చూసేది. కానీ బుక్స్ చాలా బరువని అందరూ ఏదో ఒక సాకు చెప్పేసేవారు.
ఇండియాలో లైబ్రరీలతో అస్సలు పరిచయం లేకపోడంతో ఇక్కడ లైబ్రరీలు ఉంటాయి, వాటికి వెళ్దాము అనే ఆలోచన కూడా వచ్చేదికాదు. నా బాధ చూడలేక భాస్కర్ ఒక తెలుగు కొలీగ్ ని ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయా, అని అడిగినప్పుడు, తను తెలుగు బుక్స్ అని మెన్షన్ చెయ్యకపోడంవల్ల, ఆ కొలీగ్ లైబ్రరీ కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. అలా ఒక శనివారం పొద్దున్న భాస్కర్ నన్ను సర్ప్రైజ్ చేద్దామని ఫ్రీమాంట్ లైబ్రరీ కి తీసుకెళ్ళాడు.
ఈ లింక్స్ పైన క్లిక్ చేసి ఆ లైబ్రరీ ఫోటోస్ చూడండి :
1) http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#H4x_44VJ87JKgm6lr-SqDw
2) http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#rujp_-OPzVV76t3CLKbCxg
భలే వుంది కదూ. అన్ని బుక్స్ ఒక్క దగ్గర చూసి ఎంత ఆనందమేసిందంటే, ఇక ఆ వారం ఫోన్ కాల్ లో అమ్మకు అన్నీ లైబ్రరీ విషయాలే. (to be contd...)
కొద్ది, కొద్దిగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒకరిద్దరు పరిచయం కావడంతో కాస్తా రాకపోకలు జరిగాయి. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు చూద్దామన్నా ఒక బుక్ కనిపించేది కాదు. మహా అయితే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ బుక్కులు తప్ప. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నా బుక్స్ చూసి, సూట్కేసుల్లో పప్పులు, చింతపండు, పార్టీ వేర్ లాంటి ముఖ్యమైన సామాన్లు వదిలేసి, బుక్స్ తెచ్చుకున్న మెంటల్ కేస్

పోనీ వాళ్ళకు బుక్స్ ఒకసారి రుచి చూపిస్తే, నెక్స్ట్ టైం ఇండియా కి వెళ్ళినప్పుడు వాళ్లే బుక్స్ తెచ్చుకుంటారు, అప్పుడు అవి నేను కూడా చదువుకోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసి, మీక్కావాలంటే ఏదైనా బుక్ తీసుకెళ్ళి చదువుకోండి అని ధారాళంగా ఆఫర్ ఇచ్చేదాన్ని. వాళ్ళేమో బుక్ చదివితే తలనొప్పి వస్తుందనో, లేదా టైం ఉండదనో, లేదా

ఇండియాలో లైబ్రరీలతో అస్సలు పరిచయం లేకపోడంతో ఇక్కడ లైబ్రరీలు ఉంటాయి, వాటికి వెళ్దాము అనే ఆలోచన కూడా వచ్చేదికాదు. నా బాధ చూడలేక భాస్కర్ ఒక తెలుగు కొలీగ్ ని ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయా, అని అడిగినప్పుడు, తను తెలుగు బుక్స్ అని మెన్షన్ చెయ్యకపోడంవల్ల, ఆ కొలీగ్ లైబ్రరీ కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. అలా ఒక శనివారం పొద్దున్న భాస్కర్ నన్ను సర్ప్రైజ్ చేద్దామని ఫ్రీమాంట్ లైబ్రరీ కి తీసుకెళ్ళాడు.
ఈ లింక్స్ పైన క్లిక్ చేసి ఆ లైబ్రరీ ఫోటోస్ చూడండి :
1) http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#H4x_44VJ87JKgm6lr-SqDw
2) http://www.yelp.com/biz_photos/fremont-main-library-fremont?select=-yzI22PJppveEFMUuPcZoA#rujp_-OPzVV76t3CLKbCxg
భలే వుంది కదూ. అన్ని బుక్స్ ఒక్క దగ్గర చూసి ఎంత ఆనందమేసిందంటే, ఇక ఆ వారం ఫోన్ కాల్ లో అమ్మకు అన్నీ లైబ్రరీ విషయాలే. (to be contd...)
No comments:
Post a Comment