Friday, June 29, 2012

కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమహారం

1980-90లలో తెలుగు సినిమా పరిశ్రమలో ఇళయరాజా గారు దాదాపు అందరు హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించారు. కొంతమంది హీరోలకు చాలా సినిమాలు చేసారు , మరికొంతమంది హీరోలకు తక్కువ సినిమాలు చేసారు. ఆ టైమ్ లో శోభన్ బాబు గారి రెండు సినిమాలకు (నాకు తెలిసి) కూడా ఇళయరాజాగారు సంగీత సారధ్యం వహించారు.  

ఒక సినిమా చాలామందికి తెలిసిన "రాజ్ కుమార్ ". ఈ సినిమాలో "జానకి కలగనలేదు" పాట చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇదే సినిమాలో ఉన్న "తొలి చూపు చెలి రాసిన శుభలేఖ " పాట నాకు చాల ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాట బాలు, జానకిగార్ల  మధురమైన గళాలకు, ఇళయరాజాగారి అద్భుతమైన సంగీతానికి ఒక మచ్చు తునక. ఈ పాట ఇంతకుముందు విని ఉండకపోతే తప్పక వినండి. 



 


 ఇంతకీ ఆ రెండో సినిమా పేరు మీకు తెలుసా ? అయితే చెప్పేయండి :)


2 comments:

  1. Shobhan Babu and Bala krishna starrer - Ashwamedham.

    ReplyDelete
    Replies
    1. hmmm ... అశ్వమేధం కరక్టే కానీ, నేను 2 సినిమాలని చెప్పింది శోభన్ బాబుగారు సోలో హీరోగా చేసిన మూవీస్ అండి.

      Delete