నిరంతరమూ వసంతములే , మందారముల మరందములే
ఈ పాట వంశీ డైరక్ట్ చేసిన " ప్రేమించూ పెళ్ళాడు" సినిమాలోది. అంత బాగా లేని సినిమాల్లో కూడా ఎంత మంచి పాటలు వుండచ్చో ఈ సినిమా పాటలొక ఉదాహరణ.
నిరంతరమూ వసంతములే , ఈ చైత్ర వీణ (ఇది ఇంకో పోస్టులో) పాటలు విని చాలా ఆశపడి ఈ మధ్యే చూసాను ఈ సినిమా. అంతే చాలా డిజప్పాయింట్ కూడా అయ్యాను.
తెర వెనుక : వంశీ,ఇళయరాజా, వేటూరి, బాలు,జానకి గార్లు
తెర ముందు: భానుప్రియ,రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ గార్లు
వండర్ఫుల్ కాంబినేషన్ కదూ.
కానీ కాంబినేషన్ల కంటే కథ చాలా ముఖ్యమని ఇంకోసారి రుజువు చేస్తుంది ఈ సినిమా :-(
సినిమా చూశానన్న విషయం మరచిపోయి ఈ సినిమాలో పాటలు మాత్రం వింటూనే వున్నా (సెలెక్టివ్ మెమరీ లాస్ అన్నమాట :)
నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తంతేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా
ఆశకున్న విరిదారులా (ఇక్కడ బాలూ గారి గొంతు ఎంత మార్దవంగా ఉంటుందో)
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే
అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసి మేఘమే మూగవోయె
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘదాహాలలోన అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా
మనసులోని మరుదివ్వెలా
ఈ సమయం రసోదయమై
మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే....మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే...పదాలు ఫలాలుగా పండే
No comments:
Post a Comment