సినిమాల ప్రభావం: రాంగోపాల్ వర్మ తో సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ
రెండు రోజుల కిందట సాక్షి పేపర్లో ఈ ఇంటర్వ్యూ చదివాను, తర్వాత సాక్షి టివిలో చూసాను. నేనిప్పుడు చెప్పబోయేది ఆ ఇంటర్వ్యూలో వర్మగారు, సిరివెన్నెలగారు ఇద్దరూ ఒప్పుకున్న ఒక (ఒకే?) విషయం గురించి.
అది "సినిమాలు చూసి బాగు పడే వాళ్ళు , చెడిపోయే వాళ్ళు ఉండరు" అన్న స్టేట్మెంట్.
నేను మాత్రం ఈ స్టేట్మెంట్ ని అస్సలు ఒప్పుకోను. ఒక్కోసారి సినిమా మనిషి ఆలోచనలను చాలా ప్రభావితం చేయగలదు అన్నది నా స్వానుభవం.
బాగు పడ్డం,చెడిపోవడం అన్నదానికి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో నిర్వచనం ఉండొచ్చు. నా వరకు నేను మన గురించి మాత్రమే కాక పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, పట్టించుకోవడం అనే విషయాన్ని బాగుపడడం కేటగిరీలోకి వేస్తున్నా.
ఒక 5 - 6 సంవత్సరాల క్రితం వరకు నేను మామూలు మధ్యతరగతి మనిషి లాగే బ్రతికేస్తూ వున్నాను. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు నా జీతం,నా కుటుంబం, ఇల్లు కొందామా, కార్ కొందామా,ఏ లోన్ ఎక్కడ తక్కువ వడ్డీ కి దొరుకుతుంది, వగైరా. యూ. ఎస్ కి వచ్చాక ఎలా అప్పులు తీర్చుకోవాలి (ఇండియా, యూ.ఎస్)మళ్ళీ అప్పులు తీసుకొని ఎలా కార్ కొనాలి, ఇల్లు కొనడానికి ఎలా కూడబెట్టాలి, ఏదైనా ఖర్చు చేయాలంటే X 50 (కాలుక్యులేషన్ ఈజీ గా ఉంటుంది కదా 50 ఐతే :))
ఇలా....జీవితం మొత్తం అనను కానీ ఒక 75 -80 % డబ్బు చుట్టే తిరిగేది.
ఇలాంటి నా ఆలోచనలను చాలా వరకు మార్చేసింది ఒక సినిమా.
ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఒకే ఒక సీను....నిజం.
ఈ సీను లో ముఖ్య పాత్రధారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చితన పాపకు కాన్సర్ ఉంది, వైద్యానికి డబ్బు లేదని సహాయం చెయ్యమని వేడుకొంటుంది. తన కూతురి పుట్టినరోజు పార్టీకని తెచ్చిన డబ్బు ఆమెకిస్తాడు. మనమిచ్చిన 1000 రూపాయలతో జీవితాలు నిలబడతాయా అని అడిగిన భార్యా, పిల్లలకు ఒక్కోసారి 10 పైసల పోస్ట్ కార్డు కూడా జీవితాన్ని కాపాడుతుందని తన తల్లి జీవితాన్ని ఒక కార్డ్ తో కాపాడిన ఒక చిన్న క్లర్క్ స్వామినాథన్ గారి గురించి చెప్తాడు.
ఆ తర్వాత పేపర్లో ఆ స్త్రీ చేసేది మోసం అని చదివి అందరూ ఇందుకే మేము చెప్పేది, చూసావా..నువ్వెంత మోసపోయావో అంటే అతను మాత్రం ఆ పాపకు కేన్సర్ లేదని సంతోషపడతాడు.
మనుషులపైన ఎంత ప్రేమ ఉండాలి ఇలా ఆలోచించాలంటే ?
చుట్టూ ఎన్ని ఒత్తిళ్ళు, పోటీలు, మోసాలు, ఆకర్షణలు... ఇన్నిటినీ తట్టుకొని తన ప్రేమ,ఇంత మంచి ప్రేమ, మనుషులందరిపైనా నిలబెట్టుకుంటూ బ్రతకడం ఎంత కష్టం ?
ఈ సినిమా చూసి ఎంతో కాలం అయినా ఈ సన్నివేశం మాత్రం ఇప్పటికీ నాకు బాగా గుర్తే. మరీ 100 % మారానని చెప్పను కానీ చాలా మారాను. ముందులాగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అనిపించడం లేదు.
ఏదైనా సహాయం చెయ్యాలంటే అనవసరమైన ఆలోచనలన్నీ చెయ్యకుండా
వెంటనే చేస్తున్నా. సహాయం కోరేవారి అర్హతను ముందులాగా జడ్జ్ చెయ్యడం మానేసా.
పొరపాటున ఏ స్వార్థపు తలపు నాలో మెదిలినా ఈ క్రింది మాటలు నాకు వినిపిస్తాయి, కనిపిస్తాయి.
"నేను మనిషి ని నమ్ముతాను, ప్రేమిస్తాను, ఆదరిస్తాను ...ఎందుకంటే నేను కూడా మనిషినే అన్న చిన్న స్వార్థం"
ఈ సినిమా మీరందరూ చూసే ఉంటారు.
ఈ movie ఈమధ్యనే టివీలో చూసానండీ. కోఇన్సిడెన్స్ ఏంటంటే నిన్ననే ఏదో పుస్తకంలో (ఇదే సీన్ చిన్న స్టోరీలా రాసినది) చదివాను. చదువుతూ మీరు చెప్పినట్లే అనుకున్నాను. అందుకేనేమో "its easy to be great, but its very difficult be human" అని అంటారు.
ReplyDeleteఅవును తృష్ణ గారు.
ReplyDeleteఅందరూ మనుషుల్లా బ్రతికితే,చుట్టూవున్నవాళ్ళని మనుషుల్లా బ్రతకనిస్తే...అంతకుమించిన జీవిత పరమార్థం ఉంటుందా ?