Saturday, November 20, 2010

నాకు నచ్చిన హిందీ పాటలు-1-జవాబులు



1) హృదయం మళ్ళీ తీరికగా గడిపిన రోజులను వెతుకుతోందని  కథానాయకుడు పాడే పాట. ఇక్కడ  చూడండి.
2) బొంబాయి మహానగరంలో తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటూ ఇద్దరు చిరుద్యోగులు పాడే పాట.ఇక్కడ  చూడండి.
3) నేను తన కళ్ళలోని ఆ పరిమళాన్ని చూసాను. చేతితో తాకి దానికి బంధాల నిందలు వెయ్యద్దు.ఇక్కడ  చూడండి.

4) నీపై నాకే కోపం లేదు జీవితమా ! ఆశ్చర్యపోతున్నా.ఇక్కడ  చూడండి.
5) నువ్వు తప్ప ఈ జీవితం పైన నాకెలాంటి ఫిర్యాదులు లేవు. నీవు లేకున్నా బ్రతుకుంది కానీ అది జీవితం కాదు.ఇక్కడ  చూడండి.

6) ఒక చిన్న కథతో, వాన నీళ్ళతో లోయలన్నీ నిండిపోయాయి. ఎందుకో తెలీదు కానీ గుండె నిండిపోయింది, ఎందుకో తెలీదు కానీ కళ్ళు నిండిపోయాయి.ఇక్కడ  చూడండి.
7) నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. వర్షాకాలపు కొన్ని తడిసిన రోజులు  ఉండిపోయాయి,ఇంకా ఉత్తరంలో దాచి ఉంచిన ఒక రాత్రి ఉండిపోయింది.ఇక్కడ  చూడండి.
8) ఈమధ్య నా అడుగులు నేలపైన పడ్డంలేదు. నేను ఎగరడం ఎప్పుడైనా చూసావా. ఇక్కడ  చూడండి.

9) ఆ వీధుల్ని మేము వదలి వచ్చేసాము. ఎక్కడైతే నీ పాదాలు (కమలాలు) పడేవో, ఎక్కడైతే నవ్వు నీ  బుగ్గల పైన సుడి తిరిగేదో ఆ వీధుల్ని వదిలి వచ్చేసాము.ఇక్కడ  చూడండి.

4 comments:

  1. చిన్నప్పటినుండి పల్లెటూరిలో పెరగడం వల్ల పాత హింది పాటల గురించి తెలీదు. మీ లాంటివాళ్లు ఇచ్చిన సమాచారాన్నిబట్టి పాటలు వింటుంటాను. మొదట పాటలగురించి ఎం చెప్పకుండా కేవలం క్లూస్ మాత్రమే ఇచ్చేసరికి ఏమీ అర్థం కాక నిరాశపడ్డాను. ఇప్పుడు పాటలు విన్నాను. చాలా బాగున్నయండి.

    ReplyDelete
  2. మీకు ఈ పాటలు నచ్చినందుకు సంతోషమండి.ఇంకా కొన్ని వేల మంచి పాటలు ఉన్నాయండి.మదన్ మోహన్,ఎస్.డి.బర్మన్, రోషన్,నౌషాద్, ఓ.పి.నయ్యర్,ఆర్.డి.బర్మన్...ఈ సంగీతదర్శకుల పాటలు దాదాపు అన్నీ చాలా గొప్ప పాటలే. నాకు వీలైనప్పుడల్లా వీటిల్లో కొన్నిటి గురించి అయినా నా బ్లాగ్ లో పెడ్తాను.
    మాదీ చిన్న ఊరేనండి.నా హిందీ పరిజ్ఞానం చిత్రహార్ తోనే మొదలయ్యింది :)

    ReplyDelete
  3. ఈ పాటలన్నీ నాకు ఇష్టమైనవే.మీకు ఆసక్తి ఉంటే నా బ్లాగ్ లో ఇష్టమైన పాటలు లేబుల్ చూడండి. చాలా songs మీకూ నచ్చుతాయని నమ్మకం...:)అలానే నా మ్యూజిక్ బ్లాగ్(http://samgeetapriyaa.blogspot.com) కూడా సమయమ్ దొరికితే చూడండి.

    ReplyDelete
  4. Thank you తృష్ణ. మీ బ్లాగ్ తప్పకుండా చూస్తాను.

    ReplyDelete