Tuesday, March 11, 2014
Monday, March 10, 2014
ఇదే ట్యూన్ లో వచ్చిన మరో పాట తెలుసా ??
ఇదే ట్యూన్ లో వేరే భాషలో వచ్చిన మరో పాట తెలుసా ?
"చినుకులా రాలి" అని చెప్దామనుకున్నారా... అబ్బా, ఆశ.
వేరే భాషలో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ "ఇన్స్పైర్ " అయ్యి (మన భాషలో కాపీ కొట్టిన) చేసిన పాట చెప్పాలి.
Saturday, March 8, 2014
మౌనరాగం
ఎప్పుడో చూసిన సినిమా. అప్పట్లో మురళి (కార్తీక్) భలే నచ్చాడు. కానీ అమ్మ, అత్తా వీళ్ళందరూ మోహన్ కారెక్టరైజేషన్ కి, తను ఎంతో బాగా పలికించిన సున్నితమైన భావాలకు వీర ఫాన్స్. "మీకు కొంచెం అర్థమయ్యే వయసు వస్తే తెలుస్తుంది, మోహన్ కారక్టర్ లో ఉన్న గొప్పతనమేంటో" అనేవాళ్ళు. నిజమే , ఈరోజు ఏదో ఛానెల్ లో ఆ సినిమా వస్తుంటే అప్పట్లో నోటీస్ చెయ్యని, మోహన్ కారెక్టర్ చూపించే అందమైన ప్రేమ అర్థమవుతోంది. కానీ ఇప్పుడు కూడా మురళీ కారెక్టరే ఎక్కువ నచ్చుతోందెందుకో? ఉప్పెనలా ముంచెత్తే అంత ప్రేమ... సినిమానే అని తెలుసు, అయినా నచ్చని అమ్మాయిలు ఉంటారా :)
Forever the best movie of Mani Ratnam (for me)
Forever the best movie of Mani Ratnam (for me)
Friday, March 7, 2014
ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట
ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట
ఎందుకో కదూ, కొన్నిసార్లు ఏదో పాట మనసుని సడన్ గా కలవరపెట్టేస్తుంది. మన మానాన మనం రోజువారీ రొడ్డకొట్టుడులో బిజీ, బిజీగా ఉంటామా ? ఓ పాటేదో గాలి అలల పైన తేలివచ్చి మనసులో తిష్ట వేసుకుంటుంది. ఇక అప్పట్నుండీ ఆ రోజంతా మనసులో, మెదల్లో, సుళ్ళు తిరుగుతూ ఆ పాటే. అయినా పువ్వులు, పాటలు , పిల్లలు, నవ్వులు లేకపోయాక ఈ ప్రపంచముండీ ఏం లాభం? అలాంటి ప్రపంచంలో బ్రతికుండీ ఏం భాగ్యం ? కాదంటారా ...
ఇంతకీ ఈ రోజు నేను పలవరిస్తోన్న పాట " కభీ తన్హాయియోం మే యూ హమారీ యాద్ ఆయేగీ".
ముబారక్ బేగం గొంతు లో ఈ పాట, మీ మనసులో మరుగున పడ్డ జ్ఞాపకాలేవో తట్టి లేపకపోతే, మీ మనసెక్కడుందో వెతుక్కోండి
ముబారక్ బేగం గొంతు లో ఈ పాట, మీ మనసులో మరుగున పడ్డ జ్ఞాపకాలేవో తట్టి లేపకపోతే, మీ మనసెక్కడుందో వెతుక్కోండి
Thursday, March 6, 2014
ఇప్పుడు చదువుతున్న పుస్తకం...
"అమృతవర్షాలు కురిసే రాత్రుల కోసం మనం నిరీక్షించకపోవచ్చు. మిన్ను విరిగి మీదపడే వేళల కోసం మెలకువగా ఉండకపోవచ్చు. కానీ ఆదమరచిన సమయాన పలకరించే ఆశ్చర్యాలకు, అదాటున మీదపడి అలజడి రేపే ఆనందాలకు, అనుకోకుండా వచ్చే అపురూపమైన అతిథులకు,మన జీవితాలను, హృదయాలను అన్నివేళలా ఒక సంసిద్ధతలో వుంచుకోవాలి. దెబ్బ కాచుకోడానికి వొళ్ళు రాటుదేల్చి పెట్టాలి. అయాచిత అద్భుతాల కోసం దోసిలి పట్టడం నేర్చుకోవాలి."
నాకిష్టమైన... అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, తనదంటూ పాఠకులు చటుక్కున గుర్తుపట్టే శైలిని ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారి "శీతవేళ రానీయకు" పుస్తకంలోని కొన్ని పంక్తులివి.
Image from avkf.org
ఈ పుస్తకం avkf.org వెబ్ సైట్లో లభ్యం
పుస్తకం పేరు వినగానే మీకు దేవులపల్లి గారి ఆ పాట గుర్తు వచ్చిందని తెలుసు. మరెందుకాలస్యం...వినేస్తే ఓ పనైపోతుంది కదా.

Subscribe to:
Posts (Atom)